NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Cabinet: సీఎంకి ఆ సామజిక సమస్య తప్పదు.. క్యాబినెట్ కూర్పులో ఇదే పెద్ద క్లిష్టం..!!

AP Ministers: Babu Tension - Minister HighRisk One Point..

AP Cabinet: రెండున్నరేళ్లలో మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని సీఎం జగన్ మొదట్లోనే స్పష్టం చేశారు. ఇప్పటికే 25 నెలలు గడిచింది. మరో మూడు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆపై కూర్పుకి కసరత్తు మొదలవుతుంది. కూడికలు, తీసివేతలు చర్చలు, సంప్రదింపులు మొదలవుతాయి. అందుకే ఇప్పటికే ఎవరుంటారు..? ఎవరు పోతారు..? అనే అంశంపై చర్చ జరుగుతుంది. అన్నిటికంటే.. అందరి కంటే సీఎం సొంత సామాజికవర్గ కూర్పు ఇప్పటి నుండి జగన్ కి తలనొప్పిగా మారింది. దీన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోగలిగితే మిగిలినవి డీల్ చేయడం కొంచెం సులువే…

AP Cabinet: Reddy Equations in Cabinet Getting big Trouble
AP Cabinet Reddy Equations in Cabinet Getting big Trouble

AP Cabinet: ఈ ముగ్గురు.. ఆ ఆరుగురు..!

ప్రస్తుతం మంత్రి వర్గంలో రెడ్డి సామాజికవర్గం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు సీఎంకి సన్నిహితులే. బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కి స్వయానా మామ అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత సీనియర్. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుత క్యాబినెట్ లో సీనియర్ గా ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా సీఎంకి సన్నిహితులే. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా.. ఈ కుటుంబం నుండి ఇద్దరికీ ఎమ్మెల్యే స్థానాలిచ్చి ఒకరికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈయను తొలగించాలన్న కష్టమే. అంటే ఇప్పుడున్న ముగ్గురు సీఎంకి సన్నిహితులు, తీయడానికి వీలు పడని పేర్లే.. అలా అని ఈ ముగ్గురినీ ఏ మాత్రం కదపకుండా వేరే వాళ్ళని కూర్పు చేస్తే “సొంత సామాజికవర్గంలో ఎవర్నీ తీయలేదన్న” అపవాదులు వస్తాయి. అందుకే ఇది పెద్ద సంకోచమైన పరిస్థితిగా మారింది. ఈ ముగ్గురితో పాటూ ఇదే సామజిక వర్గంలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి సన్నిహితులు.. మంత్రి పదవి ఆశిస్తున్న వారే ఉన్నారు.

* తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యే. బహుశా వచ్చే ఎన్నికల నుండి పోటీ చేయకపోవచ్చు. ఆయన మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టీటీడీ చైర్మన్ లేదా.. మంత్రి పదవి ఏదో ఒకటి ఇవ్వాల్సిందిగా జగన్ ని కలిసి కోరారు. ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది.
* చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగిరి ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాణిని బలంగా వినిపించారు. అప్పటి అధికార పక్షాన్ని గట్టిగా ఎదుర్కొన్నారు. ఇప్పటికే పార్టీ పట్ల అంత సానుకూలత లేని రోజాకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

AP Cabinet: Reddy Equations in Cabinet Getting big Trouble
AP Cabinet Reddy Equations in Cabinet Getting big Trouble

* కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితులు. ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనతో పాటూ సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ హయాం నుండి ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి సోదరులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నా జాబితాలో ఉన్నారు.
* మొత్తానికి రెడ్డి సామాజికవర్గంలోనే ఇంత పెద్ద జాబితా సిద్ధంగా ఉంది. ఉన్న వారినీ తీసినా సమస్యే… కొత్తా వారిలో ఎవరికీ ఇవ్వకపోయినా సమస్యే… దీన్ని సీఎం జగన్ ఏ స్థాయిలో పరిష్కరిస్తారు అనేది రాజకీయ వర్గాల కుతూహలంగా మారింది..
* ఇక మిగిలిన సామజిక వర్గాల్లో నెలకొన్న పరిస్థితి కూడా వచ్చే కథనంలో చూద్దాం..! మిగిలిన నాలుగు కీలక సామాజికవర్గాల్లోనూ పరిస్థితులను క్షణ్ణంగా విశ్లేషణ చేసుకుంటే మంత్రి వర్గ మార్పులపై ముందుగానే ఒక అవగాహన వస్తుంది.

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju