NewsOrbit
బిగ్ స్టోరీ

అసమర్ధ వాదనలా…? అసంబద్ధ నిర్ణయాలా…?

ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ (కోర్టులు, జగన్, అధికారులు, పోలీసులు) పగతో పొగ రాజేస్తున్నారు. పడగ విప్పుతున్నారు. ఎన్నైనా, ఏమైనా కోర్టులకు పగేముంటుందిలే కానీ…, వాటిలో వాదనలకే పగ, పొగ ఉంటాయి. పగ పట్టిన, పొగ పెట్టిన వాదనలు పైచేయి సాధిస్తే, జగన్ బృందం వాదనలు కిందికి దిగి ముడుచుకుంటున్నాయి. అందుకే ఈ మధ్య ప్రతి విషయంలోనూ జగన్ బృందం అంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు కోర్టుల చేతిలో చివాట్లు తింటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం నుండి నిన్న చంద్రబాబుని విశాఖలో పోలీసులు అడ్డుకుని 151 నోటీసు కింద అరెస్టు చేసిన వరకు అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వ వాదనలు బెడిసికొడుతున్నాయి. అసలు ఈ వాదనల్లో అసమర్థత ఉందా…? నిర్ణయాల్లోనే అసంబద్ధత ఉందా అనేది ప్రభుత్వ పెద్దలు తమకు తామే విశ్లేషించుకోవాలి.
మనిసన్నాక కొన్ని లక్షణాలు, అవ లక్షణాలు సహజమే. అందులోకి రాజకీయం అంటే ఆ రెండు లక్షణాలు అవపోషణ చేసుకుని మరీ ఉండాలి. సమయం కొద్దీ బయటకు తీయాలి. ఒక పనికి, ఒక నిర్ణయానికి సరైన కారణం ముందే సిద్ధం చేసుకుని అమలు చేయాలి. జవాబుదారీగా ఉండాలి. లేకుంటే తిప్పలు తప్పవు. తప్పులు చేసిన దోషిలా ఉండాల్సి వస్తుంది. సర్ది చెప్పుకునే వాదన ఉండాలి. ఎదుటి వారి ప్రతి ప్రశ్నను ముందే ఊహించి సమాధానం సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడు నడుస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడంలో, అంతర సదుద్దేశాన్ని సక్రమంగా చెప్పడంలో, సమ్మతమైన వాదనలు వినిపించడంలో ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వరుసగా హైకోర్టులో ఈ పరిస్థితి వస్తుంది. చివాట్లు ఎదురవుతున్నాయి. రాజకీయంగా జాతీయ స్థాయిలో పేరున్న, రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ఆయన పరిపాలనా దూకుడు, సుదీర్ఘ ఆలోచనలు, భావి అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలు అటువంటివి. ప్రతిపక్షాలు వాటిని సవాలు చేయడం సహజమే. అయితే జగన్ నిర్ణయాలను కోర్టుల్లో సమర్ధించేలా, సరైన వాదనలు వినిపించట్లేదు. ఈ ఫలితమే వైఫల్యాలు.

వరుసగా హైకోర్టులో షాక్ ల మీద షాక్ లు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పర్యటనకు చంద్రబాబుకి పోలీసులు అనుమతిని ఇచ్చారు. కానీ ఆయన వచ్చిన తర్వాత 151 నోటీసులు ఇచ్చి, రాత్రికి తిరిగి పంపించేశారు. దీన్ని సమర్ధించుకోవడంలో డొల్ల తనంతో కోర్టులో దోషులుగా నిలబడ్డారు. ఇదో తాజా అపవాదు. దీనికి ముందు రోజునే రాజధాని ప్రాంత భూముల్లో ఇతర ప్రాంతాల వారికి పట్టాలు ఇవ్వవద్దని కోర్టు తేల్చి చెప్పింది. ఇదొక గొంతులో వెలక్కాయ. దీని కంటే ముందు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడం, హైకోర్టు భవనం తరలింపు ఇలా ఎన్నో అంశాల్లో కోర్టులు ప్రభుత్వ అధికారులు, పోలీసులకు చువాట్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ విచారణలు సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయడం జగన్ అండ్ బృందం పునరాలోచించుకివాల్సిన అంశం. జగన్ చుట్టూ వందల మంది సివిల్ సర్వీసెస్ అధికారులు, న్యాయ పట్టాలు పొందిన నిపుణులు.., పోలీసుల్లో చట్టాలు ఆరితేరిన వారు ఉంటారు. వారితో సంప్రదించి, సరైన నిర్ణయం అమలు చేసి, దాన్ని సమర్ధించుకోకుంటే ఇటువంటి అప్రతిష్టలు కొనసాగుతూనే ఉంటాయి. పిటిషన్లు పెరుగుతూనే ఉంటాయి. అధికారులు, పోలీసులు వాటి చుట్టూ తిరగడానికి, సమయం వెచ్చించడానికి బోలెడు మానసిక శ్రమ కూడా తప్పదు. వైసీపీకి రాజకీయంగా కాస్త చులకన తప్పదు. ప్రతిపక్షాలకు ఇవి ఆయుధాలుగా మారక తప్పదు. ఎటువంటి అంశాలను అయినా కోర్టులో బలంగా వాదించి, సమర్ధించగల నిపుణత ప్రస్తుతం కొరవడింది. అది వస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది.

శ్రీనివాస్ మానెం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment