NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాత్రంతా తాగు.. ఏపీ సర్కారు కొత్త పథకం

 

పైన హెడ్డింగ్ చూసి ఏదేదో కార్తీక మాసం ఆఫర్ అనుకోకండి. ఇది ప్రభుత్వ హెచ్చరిక. బార్ల యజమానులకు ఎక్సయిజ్ శాఖా పెడుతున్న టార్గెట్. ప్రజల చేత ఫుల్ గ తాగించండి. వాళ్ళ జేబులో రూపాయి లేకుండా నిషాలో మైమరచి పోయేలా తాగిస్తేనే మీరు అనుకున్న లాభాలు, అడిగిన మద్యం రకం అందిస్తామని, అంతేకాదు అడిగినంత సమయం అమ్ముకునేలా సహకరిస్తామని ఎక్సయిజ్ అధికారులు బల్ల గుద్ది మరి బార్ ల యజమానులకు చెబుతున్నారు.

పైన హెడ్డింగ్ చూసి ఏదేదో కార్తీక మాసం ఆఫర్ అనుకోకండి. ఇది ప్రభుత్వ హెచ్చరిక. బార్ల యజమానులకు ఎక్సయిజ్ శాఖా పెడుతున్న టార్గెట్. ప్రజల చేత ఫుల్ గ తాగించండి. వాళ్ళ జేబులో రూపాయి లేకుండా నిషాలో మైమరచి పోయేలా తాగిస్తేనే మీరు అనుకున్న లాభాలు, అడిగిన మద్యం రకం అందిస్తామని, అంతేకాదు అడిగినంత సమయం అమ్ముకునేలా సహకరిస్తామని ఎక్సయిజ్ అధికారులు బల్ల గుద్ది మరి బార్ ల యజమానులకు చెబుతున్నారు

ప్రీమియం కొంటేనే..

దింతో రాష్ట్రంవ్యాప్తంగా ఉన్న 798 బార్ లలో తెరుచుకున్నవి 670 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు సర్కారు మద్యం ఎం బ్రాండ్ కావాలంటే అది దొరకడం లేదు.  రాష్ట్రము లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ప్రీమియం తగిన వారు సైతం ధరల పెంపు తర్వాత చీపు లిక్కర్ లోకి మారిపోయారు. క్వార్టర్ 200 వరకు చీపు లిక్కర్ లభ్యం అవుతుంది. 250 నుంచి ప్రీమియం అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా కాలంలో పనుల్లేక ఉన్న మందుబాబులు ప్రీమియం తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. దింతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియం మద్యం అమ్మకాలు పడిపోయాయి. గతంలో రోజు  మిలియన్ కేసుల ప్రీమియం అమ్మకం జరిగితే ప్రస్తుతం లక్ష కేసులు అమ్మకం కూడా జరగటం లేదు అన్నది ఎక్సయిజ్ అధికారుల మాట. ఈ కారణంతోనే ఇటీవల ప్రీమియం మద్యం ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. అయినా అమ్మకాల్లో అనుకున్నంత వేగం పెరగలేదు. ప్రీమియం మద్యం అమ్మకాలు పెరగకపోతే ఈ ఏడాది ఎక్సయిజ్ ఆదాయంలో భారీగా కొత్త పడుతుంది. అది ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటకం అవుతుంది.

పక్క రాష్ట్ర సరుకే బెటర్

రాష్ట్రంలో ప్రీమియం పేరుతో దొరికే మద్యం తెలంగాణాలో చిప్ లిక్కర్ కోటలోకి వస్తుంది. ఇక్కడ క్వార్టర్ 250 అందుబాటులో ఉన్న మద్యం పక్క రాష్ట్రంలో కేవలం 170 కె అందుబాటులో ఉంది. దింతో రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక మద్యం రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తోంది. మొదట్లో హడావుడి చేసిన స్ప్లీష ఎన్ ఫోర్స్మెంట్ విభాగాలు సైతం ఛుద్యం చూస్తున్నాయి. మొదట్లో రోజువారీ సగటున రాష్ట్రవ్యాప్తంగా 160 కేసులు నమోదు చేసిన బ్యూరో ప్రస్తుతం రోజు 30 కేసులు పెడుతుంది. అక్రమ రవాణా ఆగిపోయింది అని బీరాలు పలుకుతూ తన భుజం తానే చరుచుకుంటుంది. అయితే రాష్ట్రము అనుకుని మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు దీని ప్రవాహం మాత్రం ఆగటం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.

 

తెరుచుకో నా రాజా !!

రాష్ట్రంలోని బార్లకు ఎక్సయిజ్ అధికారులు కొత్త ఆదేశాలు ఇచ్చారు. బార్లలో ఎక్కువగా చిప్ లిక్కర్ అమ్ముడు అవుతుంది. దింతో వారు అధికంగా దాన్నే అమ్మడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రీమియం తగ్గిపోతుంది. దింతో అమ్మకాలు పెంచేందుకు బార్ యజమానులు ఎన్ని అడిగితే అన్ని చిప్ లిక్కర్ కేసులు ఇక మీదట ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రీమియం తీసుకున్న వారికే చిప్ లిక్కర్ ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. సుమారు ప్రీమియం 20 కేసులు తీసుకుంటే 10 కేసులు చిప్ ఇచ్చేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంటే బార్ యజమానులు సైతం వినియోగదారునికి ఇష్టం వచ్చినంత చిప్ మందును అమ్మడు. మొదట ప్రీమియం బ్రాండ్లు కొంటేనే, అవి అమ్ముడు అయితేనే చిప్ బ్రాండ్లు అమ్మేలా కొత్త అమ్మకాలు మొదలై పెడతాడు. దీనివల్ల సామాన్యుడు తప్పక తాగాల్సిన ప్రీమియం తాగి జేబు గుల్ల చేస్కోవడం ఖాయం. అవును ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే బార్ యజమానులు అడిగినంత టైం ఇస్తామని ఎక్సయిజ్ అధికారులు బోనస్ ప్రకటించారు. గతంలో రాత్రి 11 వరకు కొనసాగిన బార్లు ఇప్పుడు అర్ధరాత్రి 1 వరకు బార్ల తెరచి దర్శనం ఇస్తున్నాయి. కొన్ని చోట్ల 3 వరకు ఉంటున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన వారే వారికీ ఈ బోనస్ ఇచ్చి మందు బాబుల నోట్లలో మద్యం పోసి… జేబులో ఉన్నదంతా లాగేస్యడానికి అనుమతి ఇచ్చారు మరి.

author avatar
Special Bureau

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!