NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics : 3 నెలలు.. 22 స్థానాలు..! దెబ్బకి మారిపోనున్న ఏపీ రాజకీయం…!!

TDP ; Municipolls Winning Analysis

AP Politics : మరో మూడు నెలలు చాలు. సీఎం జగన్ (YS Jagan) కి ఓ గండం గట్టెక్కినట్టే. వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి ఓ పెద్ద ఉపశమనం లభించినట్టే. టీడీపీ (TDP) బలం తగ్గినట్టే. టీడీపీ బలగం పోయినట్టే. కేవలం మూడు నెలల్లో ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని ఆడుకోడానికి.., ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఏ బలాన్ని వాడుకున్నారో… ఆ బలం ఇక వైసీపీ పరం అయిపోతుంది. శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ.. ఇక మండలిలో కూడా బలాన్ని అమాంతం పెంచేసుకోబోతుంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే వైసీపీకి మండలిలో కొత్తగా 22 మంది రానున్నారు. ఇవన్నీ టీడీపీకి మైనస్. సో.. ఇక టీడీపీ పాత్ర లేనట్టే..!!

AP Politics : Big Change in 3 Next Months
AP Politics Big Change in 3 Next Months

AP Politics : 22 ఖాళీ అవ్వనున్నాయి.. ఎలా అంటే..!?

ఏడాదిన్నర కిందట.. అలిగి, కోపం వచ్చి ఆవేశంలో ఏపీ శాసనమండలిని రద్దు చేసేయాలని సీఎం జగన్ అన్నారు కానీ.. ఇప్పుడు తేరుకున్నారు. శాసనమండలిని ఎలా వాడుకోవచ్చో.., దాని కేంద్రంగా ఎన్ని రాజకీయాలు చేయొచ్చో తెలుసుకున్నారు. అందుకే మండలి రద్దు విషయంలో వెనక్కు తగ్గారు. తప్పని పరిస్థితుల్లో మడమ తిప్పారు.

ఏపీలో శాసనమండలిలో మొత్తం స్థానాలు 58. వీటిలో శాసనసభ్యుల కోటాలో 20 .., స్థానిక సంస్థల కోటాలో 20 .., ఉపాధ్యాయుల కోటాలో 5 .., పట్టభద్రుల కోటాలో 5 .., నామినేటెడ్ కోటాలో 8 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే టీడీపీకి 29 .., వైసీపీకి 13 .., బీజేపీకి 3 , స్వతంత్రలు 3 , పీడీఎఫ్ సభ్యులు 5 .. ఖాళీలు 5 ఉన్నాయి. ఈ బలం చూసుకుని టీడీపీ శాసనమండలి వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన బిల్లులను వ్యతిరేకించింది. మండలి ద్వారా తిప్పికోట్టింది. సో… వచ్చే నెల నుండి టీడీపీ బలం తగ్గనుంది. వచ్చే నెలలో 4 , మే నెలలో 3 , జూన్ లో 15 … ఇలా మొత్తం మీద జూన్ నాటికి 22 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. వీటిలో టీడీపీవి 17 ఉన్నాయి. అంటే ఇప్పుడు 29 ఉన్న టీడీపీ బలం జూన్ నెలాఖరుకి 12 కి పడిపోతుంది. ప్రస్తుతం 13 సభ్యులు ఉన్న వైసీపీ బలం జూన్ నెలాఖరు నాటికి కనీసం 30 కి చేరనుంది. అంటే ఇక మండలి వేదికగా టీడీపీ బలం చాలదు. వైసీపీ బలం అమాంతం పెరిగిపోనుంది.

AP Politics : Big Change in 3 Next Months
AP Politics Big Change in 3 Next Months

వైసిపికే ఎలా అవకాశాలు..!?

ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఉన్నవారిలో మార్చి నెలలో నలుగురు (మూడు టీడీపీ, ఒకటి వైసీపీ) .., మే నెలలో ముగ్గురు (బీజేపీ, టీడీపీ, వైసీపీ ఒక్కొక్కరు) పదవీ గడువు తీరిపోతుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలం దృష్ట్యా ఈ స్థానాలన్నీ మళ్ళీ వైసీపీ ఖాతాకే చేరనున్నాయి.

* స్థానిక సంస్థల కోటాలో జూన్ నాటికి 11 ఖాళీ అవుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారముగా ఈ స్థానాలకు ఎన్నిక ఉంటుంది. జిల్లాల్లో ఏ పార్టీ పట్టు గట్టిగా ఉంటుందో.. ఆ పార్టీకే ఎమ్మెల్సీ బలం ఉంటుంది. సో.., ఇవి కూడా వైసీపీకె అవకాశాలున్నాయి.

AP Politics : Big Change in 3 Next Months
AP Politics Big Change in 3 Next Months

* ఇక నామినేటెడ్ క్యాటగిరిలో నాలుగు ఖాళీలు అవ్వనున్నాయి. దీనిలో మూడు టీడీపీ (టిడి జనార్దన్, బీద రవిచంద్ర, శ్రీనివాసులు) ఉండగా.., ఒకరు వైసీపీ (శమంతకమణి) ఉన్నారు. ఇవి కూడా వైసిపికి దక్కే వీలుంది. సో… ఖాళీ అవ్వనున్న 22 స్థానాల్లో తక్కువలో తక్కువ 18 స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. అందుకే ఆ పార్టీ బలం పెరుగుతుంది..!!

(ఇక ఈ స్థానాలు ఎవరికీ దక్కనున్నాయి. సీఎం జగన్ మనసులో ఎవరున్నారు..? జిల్లాల వారీగా ఆశావహుల పరిస్థితి ఏమిటి..? అనే కీలక విశ్లేషణని వచ్చే కథనంలో చూద్దాం)

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju