NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Politics ; రాజధాని ఓటు – స్టీల్ ప్లాంట్ పోటు – ఏ పార్టీకి చేటు..!?

AP Politics: YSRCP Special Strategy in Six MP Seats

AP Politics ; ఒకవైపు రాజధాని సెంటిమెంటు.. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గొడవ.. ఈ రెండు ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటుని శాసించబోతున్నాయా..!? అసలు ఓటర్లు ఈ అంశాలను పట్టించుకుంటున్నారా..? లేక సైలెంట్ గా మా ప్రభుత్వం – మా పథకాలు – మా జగన్ అంటూ ఏకపక్షంగా ఓటేసేస్తున్నారా..!? ఇవే కీలకం. ఒకవేళ రాజధాని అంశం, స్టీల్ ప్లాంట్ అంశం ఎన్నికలపై ప్రభావం చూపితే వైసీపీకి కొంత నష్టం తప్పకపోవచ్చు. ఇవేమి జనం ఆలోచించకుండా సీఎం జగన్ పాలనపైనే ఆలోచన పెడితే ఓటింగ్ వేరేలా ఉంటుంది అనే స్పష్టమే.

AP Politics ; Capital - Visakha Steel Effects on Voting
AP Politics Capital Visakha Steel Effects on Voting

AP Politics ; వైసీపీ తప్పు ఏమైనా ఉందా..!? టీడీపీ ఏం చేస్తుంది..!?

రాష్ట్రంలో ప్రస్తుతం అతి పెద్ద ఇష్యూగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్నే తీసుకుంటే ఇక్కడ వైసీపీ, టీడీపీల తప్పేమి లేదు. బీజేపీ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తుంది. బీజేపీని ఏమి అనలేక వైసీపీ వాళ్ళు టీడీపీని, జనసేనని… టీడీపీ వాళ్ళు వైసీపీని, జనసేనని… జనసేన వాళ్ళు టీడీపీని, వైసిపిని తిడుతూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. అక్కడ బీజేపీ మాత్రం దొంగాట ఆడుతూ చేయాల్సినవి సైలెంట్ గా చేసుకుపోతుంది. దీనిలో వైసీపీ తప్పు ఏమి లేదు. గట్టిగా అడగకపోవడమే.., అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడమే.. మంత్రి వర్గంలో చర్చించి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవడమే వైసీపీ తప్పు తప్ప ఇంకేం లేదు.. టీడీపీ విషయంలో కూడా అంతే. నిజానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మరింత దూకుడుగా వెళ్ళవచ్చు. బీజేపీని – వైసిపిని ఇరుకున పెట్టొచ్చు. కానీ… భయం, భయంగా నామమాత్రపు ఆందోళనలు చేస్తుంది. సో.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ దోబూచులాడుతుండగా… బీజేపీ దొంగాట ఆడుతుంది.

AP Politics ; Capital - Visakha Steel Effects on Voting
AP Politics Capital Visakha Steel Effects on Voting

ఎన్నికల్లో నష్టం వైసిపికే ఎందుకు..!?

ఇక మున్సిపల్ ఎన్నికలు విషయానికి వస్తే ఈరోజు విశాఖలో స్ట్రాంగ్ అంశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం మాత్రమే. విశాఖని సీఎం జగన్ పరిపాలన రాజధాని చేస్తున్నారన్న విషయాన్నీ ఎప్పుడో అక్కడి జనం మర్చిపోయారు. నెల రోజుల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ పోతుంది అనే విషయాన్నీ మాత్రమే చర్చించుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నా… అక్కడ అవకాశం లేదు. ఆ పార్టీకి అక్కడ ఏమిలేదు. ఆ కోపం, ఆ కసి, ఆ క్రోధం వైసీపీపై చూపిస్తే సీఎం జగన్ బీజేపీపై పోరాడతారన్న ఆశ విశాఖ వాసుల్లో లేకపోలేదు. ఒకరకమైన అప్రమత్తత, నమ్మకం కోసం సీఎం జగన్ కి తన పవర్ తగిలేలా… విశాఖలో కొంచెం షాక్ ఇచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. అలా అని పూర్తిగా మేయర్ పీఠానికి దూరమయ్యేంతగా ఉండకపోవచ్చు… కొంచెం సీట్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

AP Politics ; Capital - Visakha Steel Effects on Voting
AP Politics Capital Visakha Steel Effects on Voting

అమరావతి ప్రాంతాల్లో ఉన్నట్టేనా..!?

ఇక విశాఖ సంగతి పక్కన పెట్టేసి అమరావతి ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ నగరాల్లో ఎన్నికల పరిస్థితి చూసుకుంటే… ఇక్కడ రాజధాని సెంటిమెంట్ ని నమ్ముకుని టీడీపీ మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉంది. కానీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ మాత్రం అమరావతి దెబ్బ అంతగా ఉండబోదని… సంక్షేమ పథకాల హవా కారణంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ / లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోని 32 ఎమ్మెల్యే స్థానాలకు గానూ.. మూడు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. 29 ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. కానీ… వ్యక్తిగత చరిష్మణో.. పార్టీ క్రాస్ ఓటింగ్ వల్లనో విజయవాడా, గుంటూరు ఎంపీలు మాత్రం టీడీపీ గెలిచింది. సో… ఆ తర్వాత మొదలైన రాజధాని రగడ సెంటిమెంట్ టీడీపీ బాగానే వాడుకుంటుంది. కేవలం రాజధాని సెంటిమెంట్ తో మాత్రమే టీడీపీ ఈ రెండు నగరాల్లో ఆశలు పెట్టుకోగా… సంక్షేమం, పథకాలు సెంటిమెంట్ తో వైసీపీ ఓట్లు అడిగింది..! ఇక్కడ ఫలితాలు కూడా రాజధాని అంశాన్ని ప్రభావితం చేయనున్నాయి..!!

author avatar
Srinivas Manem

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N