NewsOrbit
Featured బిగ్ స్టోరీ

AP Politics : పరిషత్ ఎన్నికలు అంత ఈజీ కాదు..!? కొన్ని చిక్కులున్నయ్..!!

AP Politics : Parishath elections not so easy..?

AP Politics : పరిషత్ ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కమీషన్ కూడా నోటిఫికేషన్ ఇచ్చేసింది. మరో వారంలోనే పోలింగ్.., అక్కడికి రెండు రోజుల్లోనే ఫలితాల ప్రకటనకి ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని చక చక అడుగులు వేయిస్తున్నారు. తెరవెనుక కొందరు పెద్దలు నడిపిస్తున్నారు. అయితే ఇది అంత సులువు కాదు. కొన్ని చిక్కులున్నాయ్. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన తదితర పార్టీలు ఆ చిక్కులను వాడుకుని కోర్టుకి వెళ్లాయి. టీడీపీ అయితే ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతోంది. ఆ చిక్కులేమిటి..? ఎన్నికల కమీషన్ ఎదుర్కోగలదా..? అనేది పరిశీలించాల్సిన విషయం..!

AP Politics : Parishath elections not so easy..?
AP Politics Parishath elections not so easy

AP Politics : సుప్రీమ్ కోర్టు ఏం చెప్పింది..!?

పరిషత్ ఎన్నికల విషయంలో ఇటీవల అనేక అంశాలు కోర్టుకి వెళ్లాయి. ఓ సందర్భంలో సుప్రీమ్ ఇచ్చిన తీర్పులో “ఎన్నికల నిర్వహణకు కనీసం నాలుగు వారాలు గడువు ఉండాలి. నాలుగు వారాలు ముందు అనుమతి తీసుకోవాలి అని పేర్కొంది. కానీ ఈ నోటిఫికేషన్ లో అలా లేదు. ఈ అంశమే ఇప్పుడు కీలకం కానుంది ఈ పాయింట్ పట్టుకుని ఈరోజు టీడీపీ, బీజేపీ కోర్టులో పిటిషన్ వేసాయి. ఈ చిక్కుని ఎదుర్కోవడం ఎన్నికల కమీషన్ కి అంత ఈజీ కాదు.
* ఓ వైపు తిరుపతి ఉప ఎన్నిక ఉండగా.. మధ్యలో అతి తక్కువ సమయంలో పరిషత్ ఎన్నికలు ముగించేయాలి అని ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇవ్వడం నైతికంగా వైసీపీకి ఇబ్బందికరమైన అంశమే. ఈ కారణాలు చూపించి.., ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
* 2014 లో జరిగిన ఏకగ్రీవాలకు.. ఇప్పుడు జరిగిన ఏకగ్రీవాలకు చాలా తేడా ఉంది. ఇప్పటికే ఈ ఏకగ్రీవాలు విషయంలో కోర్టుకు కొన్ని ఫిర్యాదులు, ఆధారాలు ఉన్నాయి. గత ప్రక్రియ రద్దు చేసేసి,, కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్జ ఇవ్వాలని జనసేన వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

AP Politics : Parishath elections not so easy..?
AP Politics Parishath elections not so easy

కోర్టుల్లో కీలక అంశాలు తప్పదు..!!

టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తుంది. ఇప్పుడే చంద్రబాబు ప్రకటించేశారు. అయితే అంశాన్ని వదిలేయదు. సుప్రీమ్ లో పిటిషన్ వేశారు. ఆల్రెడీ జనసేన వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఈరోజు ఉదయాన్నే బీజేపీ కూడా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ మూడు పిటిషన్లుపై ఎన్నికల కమీషన్ కౌంటర్లు సిద్ధం చేసి వేయాల్సి ఉంటుంది. గతంలో సుప్రీమ్ ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం ఉంది కాబట్టి.. దీన్ని సమర్ధించుకుంటూ ఎన్నికల కమీషన్ ఎంత మేరకు కోర్టులో పోరాడుతుంది అనేది చూడాలి. ఒకరకంగా నీలం సాహ్ని ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక ఆమెను సీఎం జగన్ నడిపిస్తారని… సీఎం జగన్ కి ఆమె అత్యంత ప్రీతిపాత్రమైన అధికారిని అని.. ఇద్దరి మధ్య సమన్వయం బాగుంటుందని తెలిసిందే. సో… నీలం సాహ్ని ఎన్ని చిక్కులు వచ్చినా.. కోర్టుల్లో పోరాడడానికి వెనుకాడరు. ఇప్పుడు మూడు పార్టీలు వేసిన పిటిషన్లతో పోరాడడం అంత సులువు కాదు..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju