NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: RRR పై వేటు పడితే.. ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు..!?

MP RRR vs TDP: Disturbing TDP in Depth..

AP Politics: ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులకు బీజాలు పడుతున్నాయి.. పార్లమెంట్ స్పీకర్ పరిధిలో ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాలను శాసించనుంది.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయ పొయ్యి వెలిగించనుంది..! వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరగా సొంత ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 11 నెలల క్రితం రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు పిటిషన్ అందజేసినా నెలలు గడుస్తున్నా చర్యలు కనబడలేదు. ఆ తరువాత రఘురామ మరింత రెచ్చిపోయి విమర్శల దాడి పెంచారు. దీంతో ఏపి సీఐడీ ఆయనపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరుతో ఆయన బయటకు రావడం జరిగింది. ఇంత జరిగినా రఘురామ తగ్గారా అంటే అదీ లేదు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని సుప్రీం కోర్టు సూచనలు చేస్తే రచ్చబండ కార్యక్రమానికి స్వస్తి పలికి సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తూ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు.

AP Politics: Turning throuth RRR issue
AP Politics Turning throuth RRR issue

AP Politics: అటూ ఇటూ కీలక వాదనలు..!!

ఇక లాభం లేదని భావించిన వైసీపీ అధిష్టానం..రఘురామ పై ఇక అనర్హత వేటు వేయించాల్సిందే అన్న కృతనిశ్చయంతో మరిన్ని బలమైన ఆధారాలతో మరో సారి అనర్హత పిటిషన్ ను స్పీకర్ ఓంబిర్లాకు అందించింది. అయితే ఈ పిటిషన్ తో స్పీకర్ కార్యాలయం నుండి కొంత కదలిక అయితే వచ్చింది. చర్యలు ఎంత వరకూ ఉంటాయనేది ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి ఉన్నా రఘురామతో సహా టీఎంసీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపిలకు పార్టీ దిక్కార ఆరోపణలపై వివరణలు ఇవ్వాలంటూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నోటీసులు జారీ చేశారు. ఓ సభ్యుడిపై అనర్హత వేటు పడాలంటే.. ప్రాధమికంగా ఓ పార్టీ నుండి గెలుపొంది ప్రత్యర్థి పార్టీతో కలిసి పని చేయడం, లేదా పార్టీ విప్ దిక్కరించి ఓటింగ్ లో పాల్గొనడం, ప్రత్యర్థి పార్టీ కండువా కండువా కప్పుకొని ఆ పార్టీ ర్యాలీలో పాల్గొనడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లాంటివి నిరూపించాలి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామపై చేస్తున్న ఫిర్యాదుకు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో లోపాలను మాత్రమే ఎత్తి చూపుతున్నానని రఘురామ సమర్థించుకుంటున్నారు.

అయితే రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తీవ్ర స్థాయిలో పట్టుదలతో ఉన్న నేపథ్యంలో 70 శాతం తనపై అనర్హత వేటు పడదన్న ధీమాతో రఘురామ ఉన్నారు. ఒక వేళ అనర్హత వేటు పడితే నర్సాపురం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారనీ, అందుకు ఓ పత్రికాధిపతి మధ్యవర్తిత్వం నడుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒక వేళ రఘురామపై అనర్హత వేటు పడితే…ఇక్కడ ఏపి అసెంబ్లీలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

AP Politics: Turning throuth RRR issue
AP Politics Turning throuth RRR issue

అదే కోవలోకి ఈ నలుగురి సంగతి..!?

రఘురామపై ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో ఇక్కడ టీడీపీ నుండి గెలిచి వైసీపీ పంచన చేరిన ఎమ్మెల్యేలపైనా స్పీకర్ తమ్మినేని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైనా వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడం గానీ లేక రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడానికి అంతర్గతంగా వైసీపీ చర్చిస్తున్నట్లు సమాచారం. సో.. ఒక వేళ ఉప ఎన్నికలు గనుక వస్తే నర్సాపురం ఎంపి స్థానంతో పాటు గన్నవరం, చీరాల, విశాఖ దక్షిణ, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్క అనర్హత వేటు పడితే ఏపిలో రాజకీయాలు ఇంతగా మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!