NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: ఈ ఆరు ఎంపీ సీట్లపై పొత్తుల గురి.. వైసీపీ స్ట్రాటజీ రెడీ..!?

AP Politics: YSRCP Special Strategy in Six MP Seats

AP Politics: ఏపీలో వైసీపీకి ప్రస్తుతం తిరుగులేదు.. కానీ ఆ ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పులు.. సీఎం జగన్ స్వీయ తప్పిదాల వలన కొన్ని వర్గాలకు దూరమవడంతో టీడీపీ, జనసేన వంటి పార్టీలకు ఆశలు చిగురిస్తున్నాయి.. అందుకే కొన్ని ఆశలు పెంచుకుంటున్నాయి. వైసీపీ పట్టున్న.., వైసీపీ గెలిచినా కొన్ని స్థానాల్లో పట్టు కోసం, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా కొన్ని అసెంబ్లీ స్థానాలపై రాజకీయ పక్షాలు అసలు పెట్టుకుంటాయి వాటిపైనే ఫోకస్ పెడుతుంటాయి. అన్ని రకాల పోల్ మేనేజ్మెంట్ చేస్తాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి ప్రచారం తదితర అన్ని రకాల స్ట్రాటజీ లు వ్యూహాలు అమలు చేస్తుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఆరు పార్లమెంటు స్థానాలపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడిట్లో వైసీపీ ఇప్పటికీ తిరుగులేని బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుండి గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ ఆరు స్థానాలపై టిడిపి కంటే జనసేన ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. ఆ ఎంపీ స్థానాలు ఏవి..? ఎందుకు ఆ పార్టీకి ప్రత్యేకం..? అనే విషయాన్ని పరిశీలిస్తే..

AP Politics: YSRCP Special Strategy in Six MP Seats
AP Politics YSRCP Special Strategy in Six MP Seats

AP Politics: విశాఖపట్నం వారికి ఈజీనా..!?

మొదటిది విశాఖపట్నం పార్లమెంట్ స్థానం. విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంవీవీ సత్యన్నారాయణ గెలిచారు. టీడీపీ నుండి పోటీ చేసిన శ్రీభరత్ కేవలం 4 వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ సిబిఐ జె.డి లక్ష్మీనారాయణ మంచి ఓట్లు సాధించారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుస్తారు అన్న నమ్మకంతో ఆ పార్టీ ఉంది. ఎందుకంటే..? విశాఖ పార్లమెంట్ పరిధిలో శృంగవరపుకోట, భీమిలి, గాజువాక, విశాఖపట్నంలోని నాలుగు దిక్కుల్లోని అసెంబ్లీ సిగ్మెంట్ లు కలుపుకుని మొత్తం ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ లు ఉండగా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. దానితో పాటు జనసేన పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. గ్రౌండ్ లెవెల్ లో బలమైన కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ లెక్కలు వేస్తుకుంటుంది. వీటిని పరిగణలోకి తీసుకోవటంతో పాటు 2019 ఎన్నికల్లో 2 లక్షల 88వేల ఓట్లు వచ్చినందు వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుపు వరకు వెళ్లొచ్చు అన్న ధీమాతో జనసేన లెక్కలు వేసుకుంటుంది. ఇదే స్థానం మీద టిడిపి కూడా హోప్స్ పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయినందున ఈసారి ఎలాగైనా గెలవచ్చు అన్న ధీమాలో టిడిపి ఉంది. ఇక్కడ టీడీపీ లేదా వైసీపీకి ఎక్కువ అవకాశాలున్నట్టు అంచనాలున్నాయి.

AP Politics: YSRCP Special Strategy in Six MP Seats
AP Politics YSRCP Special Strategy in Six MP Seats

AP Politics: కాకినాడపై జనసేన అదే గురి..!

ఆ తరువాతది కాకినాడ పార్లమెంటు స్థానం. ఈ పార్లమెంటు స్థానంలోను జనసేన పార్టీది ఇదే అంచనా. ఇదే లెక్క. ఎందుకంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలోనూ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. శెట్టి బలిజ ఓట్లు ఎక్కువ. ఇక్కడ కూడా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కి లక్ష 32 వేల ఓట్లు వచ్చాయి. జ్యోతుల వెంకటేశ్వరరావు ఇక్కడి నుండి పోటీ చేశారు. ఇక్కడ టిడిపి 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. టిడిపి తరఫున చలమలశెట్టి సునీల్ పోటీచేశారు. ఈ కాకినాడ స్థానంలో జనసేన సరైన అభ్యర్ధిని రంగంలోకి దింపితే ఈజీగా గెలుచుకోవచ్చు అని జనసేన లెక్కలు వేసుకుంటోంది. కానీ టీడీపీ కూడా దీనిపై ఆశలు పెట్టుకుంది. వైసీపీ ఫ్యాన్ గాలి విపరీతంగా ఉన్నసమయంలోనే కేవలం 25వేల ఓట్ల తేడాతో తమ అభ్యర్ధి ఓడిపోయారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బలమైన క్యాండెట్ పెడితే గెలిచే ఛాన్స్ ఉందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇక్కడ కూడా వైసీపీ ప్రస్తుతం మంచి బలంగా ఉంది. వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉంటుందని అంచనా..!

AP Politics: YSRCP Special Strategy in Six MP Seats
AP Politics YSRCP Special Strategy in Six MP Seats

నరసాపురం అభ్యర్థిని బట్టి..!

ఇక మూడవ పార్లమెంట్ నియోజకవర్గం నర్సాపురం. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో కూడా కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువ, అదే స్థాయిలో క్షత్రియ, బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఉంది. ఇక్కడ కూడా 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన నాగబాబు కు రెండున్నర లక్షల ఓట్లు వచ్చాయి. టీడీపీ తరపున అప్పటి ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పోటీ చేశారు. ఇక్కడ 31వేల ఓట్ల మెజార్టీతో వైసీపీ తరపున రఘురామ కృష్ణంరాజు గెలిచారు. ఇక్కడ కూడా జనసేన పార్టీకి మంచి క్యాడర్ ఉంది. టీడీపీ కూడా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాబట్టి రెండు పార్టీలు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఈజీగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నాయి. అయితే ఇక్కడ వైసీపీ నుండి గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి రెబల్ గా మారడం, ఆయన రాబోయే ఎన్నికల నాటికి ఏ పార్టీలో చేరతారు అనే విషయాలపై అంచనాలు, లెక్కలు మారే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ ప్రస్తుతం బలంగా ఉంది. ఇక్కడ ఓట్లు చీలిక వలన టీడీపీ బలహీనపడుతుంది. జనసేన, టీడీపీ కలిస్తే తప్ప వైసీపీని ఓడించడం కష్టమే..

మిగిలినవి ఇవే..!!

ఇక నాల్గవ స్థానం తిరుపతి. తిరుపతి లోక్ సభ స్థానంపైన కూడా జనసేన ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన హోప్స్ పెట్టుకున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ నాలుగు. విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, తిరుపతి. వీటితో పాటు మచిలీపట్నం, ఏలూరు పార్లమెంట్ స్థానాలపైనా కాస్త దృష్టి పెడుతోంది. మచిలీపట్నం, ఏలూరులో కూడా జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉంది. జనసేనకు బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. తిరుపతి విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి పెద్దగా ఓట్లు రాలేదు. కారణం ఏమిటంటే పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్ధి పోటీ చేశారు. దాదాపు 2లక్షల 28వేల తేడాతో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. కానీ తిరుపతి స్థానాన్ని జనసేన సెంటిమెంట్ గా భావిస్తోంది. తిరుపతి పట్టణంతో పాటు రూరల్ లో సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఫోకస్ పెడుతోంది జనసేన. మంచి అభ్యర్ధిని పెడితే గెలుపు అవకాశాలు ఉంటాయి అని జనసేన భావిస్తోంది. కానీ ఇక్కడ టీడీపీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే ఆ స్థానాలపై “పైన ఎన్ని చెప్పుకున్నా జనసేన టీడీపీ పొత్తు లేని పక్షంలో వైసీపీని ఓడించడం అసాధ్యం అనే సంగతి ఆ పార్టీలకు కూడా తెలుసు. ఓట్లు చీలిక ఆ పార్టీలను దెబ్బతీస్తుంది. అందుకే వైసీపీ కూడా కొన్ని స్ట్రాటెజీల ప్రకారం వెళ్తుంది. ఈ రెండు పార్టీల పొత్తు విషయం లీకవడంతో ఆ కూటమి ప్రభావితం చేసే స్థానాల్లో వైసీపీ ఒక భిన్నమైన స్ట్రాటజీ ద్వారా ఎన్నికలకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది..!

author avatar
Srinivas Manem

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!