NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

AP PRC Issue: అయ్యో.. ఆ రెండూ బకరాలయ్యాయే..!? పీఆర్సీ గొడవలో చివరికి ఇదే..!

AP PRC Issue: These two Became Fools in Overall Issue

AP PRC Issue: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని.. అధికార పార్టీని దద్దరిల్లేలా చేసిన గొడవ పీఆర్సీ సాధన కోసం చేపట్టిన ఆందోళనలు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్డెక్కడం.. చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం.. విజయవంతమవడం.. కచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశాలే.. సరే ఆ గొడవ ముగిసింది. ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ పెద్దలు కూర్చుని ఒక దారికొచ్చారు.

కొన్ని ఒప్పందాల మేరకు రాజీ మార్గం పట్టారు.. ఇక సమ్మె లేదు, శ్రద్దగా పని చేసుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికీ.. పునరాలోచనలో ఉన్నాయిలే.. అది వేరే విషయం..! ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఏపీలో రెండు బకరాలు బయటకు వచ్చాయి.. ఈ మొత్తం ఇష్యూని ప్రజల్లో.. జనం మైండ్ లో రకరకాల ఆలోచనలు రేకెత్తించేలా తమ ప్రయత్నాలు సాగించి బొక్కబోర్లా పడ్డాయి.. చివరికి బకరాలుగా మిగిలాయి..! ఆ రెండు ఏమిటి..!? ఎందుకు అలా బకరాలుగా మారాయో చూద్దాం..!

AP PRC Issue: These two Became Fools in Overall Issue
AP PRC Issue These two Became Fools in Overall Issue

AP PRC Issue: ఏబీఎన్ తెగ ప్రయత్నం చేసింది..!!

ఒకటో బకరా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా..! ఉద్యోగుల పోరాటం మొదలైంది మొదలు.. ఈ రోజు వరకు ప్రతీ రోజు కథనాలను వండి వార్చింది. దాదాపు నెల రోజులకు పైగా ఈ పత్రిక టాప్ బ్యానేర్ లో ఉద్యోగుల కోసమే కేటాయించారు. అక్కడ కూడా ఉద్యోగులకు ఉపయోగపడేలా.., ప్రజలకు సమాచారం ఇచ్చేలా.. జరిగింది జరిగినట్టు రాయలేదు సుమీ… ప్రతీ రోజు ఉద్యోగుల మెదళ్లలో “బాబు వైసీపీ ఇంతే.. టీడీపీనే బెటర్” అనే ఆలోచనలు కలిగేలా.. ఉద్యోగులకు వైసీపీపై విపరీతమైన కోపం వచ్చేసేలా.. ఉద్యోగులను ప్రభుత్వంపైకి ఉసిగొల్పేలా.. ఉద్యోగులను జగన్ పైకి తిరగబడేలా// రకరకాలుగా ప్రయత్నాలు చేసింది.. “ఒకరోజు మీ అందర్నీ తీసేస్తారని.. ఒకరోజు మీరు ఎన్ని చేసినా ఇంతే అనీ.. ఒకరోజు మీలో 82 వేల మందికి తొలగిస్తున్నారని..

“ఒకరోజు జగన్ కనీసం మీ ఆందోళనలు పట్టించుకోరు.. చంద్రబాబు ఉంటె ఇలా చేసేవాడని.. ఇలా రకరకాలుగా ఉద్యోగ వర్గాలను ప్రభుత్వమపైకి ఏ విధంగా ఉసిగొల్పాలా.. “మీరు ఇంకా రోడ్డెక్కాండి.. ఈ పోరాటం చాలదు..” అనే ప్రయత్నంతో చాలా రకాలుగా కథనాలు రాశారు. బహుశా.. ఏబీఎన్ మీడియా.., ఈ కథనాలు, ఆ ఛానెల్ డిబేట్లు చూసిన వాళ్ళు “ఓహో ఇక ఉద్యోగులు ప్రభుత్వానికి ఏ మాత్రం సహకరించరేమో.. ఇక తెగదెంపులేనేమో.. అనేలా.. టీడీపీ వాళ్లకు నరాలు నిక్కబొడిచేలా.. రాసి పడేశారు. కానీ ఏం లేదు. అంతా సద్దుమణిగింది. ఏబీఎన్ ప్రయత్నం మొత్తం నీరుగారింది. ఉద్యోగులు, ప్రభుత్వం ఒక్కటయ్యారు. ఏబీఎన్ ప్రయత్నం చిన్నబోయింది. చివరికి ఆ ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులు కూడా ఉద్యోగులు పట్టించుకోలేదు. ఒక పెద్ద మీడియా బకరాగా చూసారు..!

AP PRC Issue: These two Became Fools in Overall Issue
AP PRC Issue These two Became Fools in Overall Issue

సాక్షి ఇంగితం మరించింది..!

ఇక ఈ మొత్తం వ్యవహారంలో సాక్షి మరో బకరాగా మారింది. కనీసం కొన్ని కనీస సూత్రాలు, ఇంగితాలు, విలువలు మర్చిపోయింది. “దాదాపు 35 లక్షలు ఓట్ బ్యాంకు ఉన్న వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే.. దాన్ని ఎంత సావధానంగా రాయాలి..? ఎంత న్యూట్రల్ గా వ్యవహరించాలి..!? ఎంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి..?! కానీ.. సాక్షి మీడియా ఆ జ్ఞానం మరిచింది. ఉద్యోగులు తమ నాయకుడి వెంటే ఉంటారు.. 2019లో వాళ్ళు భారీగా తమకే ఓట్లేశారు అనే కనీసం ఇంగితాన్ని వదిలేసి.. ప్రతిరోజూ ఉద్యోగులకు వ్యతిరేకంగా కథనాలు రాసుకొచ్చింది. ఉద్యోగులు లంచగొండిలు అనేలా.. దేశం మొత్తం మీద ఏపీలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలిస్తున్నట్టుగా.. ఒకరకంగా వారికి ఇస్తున్నదే బాగా ఎక్కువ అన్నట్టుగా రాసుకొచ్చారు. ఉద్యోగులను ప్రజల్లో చెడుగా చూపించే ఉద్దేశంతో అనేక కథనాలను సాక్షి మీడియా ప్రచురించింది. వారిని వైసీపీ అనుకూల సోషల్ మీడియా బాగా హైలైట్ చేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా, సాక్షి కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగా చాలా శ్రమించి పని చేశారు..

కానీ 2019లో ఆ వర్గాలే దాదాపు 40 లక్షల మంది వరకు ఓట్లేశారని.. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గాలు తమా పార్టీకి కీలకమనే అంశాన్ని గుర్తించినా.. విలన్లుగా చూపించే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ ని వ్యతిరేకించే వాళ్ళు.. ప్రభుత్వాన్ని తప్పు పట్టే వాళ్ళని ప్రజల్లో చెడుగా.. లేదా పిచ్చోళ్ళగా చూపించాలనే వైసీపీ ప్రాధమిక నిర్ణయానికి కట్టుబడి విపరీత ప్రయత్నం, ప్రచారం చేసారు.. కానీ ఏమైంది..!? మళ్ళీ ఉద్యోగులు మెత్తబడ్డారుగా.. ఈ ఉద్యోగులే రేప్పొద్దున సాక్షికి బిల్లులు కట్టాలి. ఈ ఉద్యోగులే రేప్పొద్దున్న జగన్ పథకాలు అందించాలి..! సో.. ఈమొత్తం ఎపిసోడ్ లో సాక్షి కూడా మరో బకరాలా వ్యవహరించి.. మీడియా ధర్మం.. కనీసం ప్రభుత్వ అనుకూల మీడియా ధర్మం కూడా పాటించలేదు..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju