NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Special Status : బాబూ.., జగనూ.., మోడీ.. వెంకయ్య..! ఆ మాటకే “ప్రత్యేక హోదా”..!!

AP Special Status : Special Word for Politics

AP Special Status : హైదరాబాద్ కి సముద్రమైనా రప్పిస్తాం.., విశాఖకు ఎడారైనా ఇస్తాం.., కానీ.. ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వం అనేది బీజేపీ మాట..! అందుకు చాలా సాకులే తయారు చేసుకుంది..!! అవి మన పాత సీఎం చంద్రబాబుకి తెలుసు. మన ప్రస్తుత సీఎం జగన్ కి తెలుసు. మన ప్రధాని మోడీకి తెలుసు.

మన ఉప రాష్ట్రపతి వెంకయ్యకి తెలుసు. కాకపోతే ఆ మాట అడగడం, లేదు అనిపించుకోవడం, “అమ్మో ప్రత్యేక హోదా ఇస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది, నీతి ఆయోగ్ ఉరి తీసేస్తుంది అనేంతగా బీజేపీ పెద్దలు బిల్డప్ ఇవ్వడం… సాధారణ అంశంగా మారిపోయింది. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి. “ప్రత్యేక హోదా” అనే మాటకి ఒక ప్రత్యేక హోదా వచ్చేసింది తప్ప… రాష్ట్రానికి మాత్రం రాలేదు..!!

AP Special Status : Special Word for Politics
AP Special Status Special Word for Politics

AP Special Status : హోదా మళ్ళీ సీఎం అడిగారు..! మోడీ కాదన్నారు..!!

నిన్న దేశంలోని అందరు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగానూ “ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బేషరతుగా పార్లమెంట్‌లో ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఈ మాటలు మోడీ చెవిలో పడడం కొత్త కాదు. ఆయన సింపుల్ గా తప్పించుకోవడమూ కొత్త కాదు. సో.. నిన్న కూడా అదే జరిగింది. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం పాతబడిపోలేదని.. ఇంకా నానుతుంది అని సీఎం జగన్ నిరూపించగా.. తమ వైఖరిలో మార్పు లేదు అని మోడీ పరోక్షంగా స్పష్టం చేశారు.

AP Special Status : Special Word for Politics
AP Special Status Special Word for Politics

మరో పాతికేళ్ళు వర్ధిల్లుతుంది..!!

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదు అనేది స్పష్టం. కానీ ఇది ఎవ్వరూ వదిలిపెట్టరు.., అడగడం మానరు అనేది కూడా స్పష్టం. ఏపీకి ప్రత్యేక హోదా అనేది వచ్చే వరకు అదే ఏపీలో అతి పెద్ద “హోదా” ఉన్న రాజకీయ పదంగా.., ఎన్నికల హామీగా మిగిలిపోతుంది. బీజేపీ కేంద్రంలో ఎన్నాళ్ళు ఉంటుందో పక్కన పెడితే… ఒకవేళ కేంద్రంలో బీజేపీ యేతర పార్టీలు అధికారంలోకి వచ్చినా అది ఈజీ కాదు.అనేక నిబంధనలు, చట్టాలు మార్పులు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసినా… మళ్ళీ కాంగ్రెస్, టీడీపీ, వైసిపి ఈ పాత పాడడం ఆపవు. ఏపీ రాజకీయాల్లో ఈ పదం, ఈ హామీ మాత్రం ఒక “ప్రత్యేకమైన హోదా”గా పాతికేళ్ళు వర్ధిల్లడం ఖాయమే..!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?