NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

అద్భుతమైన ముహూర్తబలం…

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇక చకచక…శంకుస్థాపన ముహూర్తానికి రాశులన్నీ సానుకూలం….

శ్రీ మహావిష్ణువు అవతారాల్లో అత్యంత విశిష్టమైనది రామావతారం. రామావతారంలో విష్ణువు ఎన్నో కష్టాల సుడిగుండాలను ఎదుర్కొంటాడు. మానవాళికి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు చెప్పేందుకు… పరమాత్ముడు మానవరూపంలో దశరద మహారాజుకు జన్మించి ఎన్నో సవాళ్లు, సమస్యలతో పోరాటం చేశాడు. త్రేతాయుగంలో అప్పటి వరకు ఉన్న అనాచారాలను ధ్వంసం చేయడమే కాక… ఒకే భార్య సిద్ధాంతానికి శ్రీరాముడు నాందీ పలికుతాడు. కాసేపట్లో పట్టాభిషేకం జరగాల్సి ఉండగా అడవులకు వెళ్తాడు. రావణాది రాక్షసులను తుదముట్టించి సీతమ్మను అయోధ్యకు తెచ్చినా…

చాకలివాని వాక్కుతో తిరిగి భార్యను అడవులకు పంపించి ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొంటారు. రామావతారం ద్వారా సకల మానవాళికి మహిళా సమాజం పట్ల అనుసరించాల్సిన ధర్మసూక్ష్మాలను బోధించి తరిస్తారు శ్రీరామచంద్రుడు. ఆయన జీవితంలో ఎన్నెన్ని కష్టాలను అనుభవించారో… అలాగే ఆయన జన్మస్థలంలో రామమందిర నిర్మాణానికి కూడా ఎన్నో సవాళ్లు, సమస్యలు వచ్చాయి. ఎట్టకేలకు న్యాయస్థానాల నుంచి తీర్పు లభించడంతో ఈనెల 5వ తేదీన రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిపేందుకు పండితులు రంగం సిద్ధం చేస్తున్నారు.

హిందువుల ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోరిక మరికొద్ది రోజుల్లో సాకారం కాబోతోంది. రామ మందిర కల నెరవేర్చుకోడానికి హిందువులు సుధీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ స్వప్నం చూడముచ్చడగా ఈనెల 5న నెరవేరబోతోంది.ఇక రామమందిర నిర్మాణ ముహూర్తం అత్యంత శక్తివంతంగా ఉంది. ఒక్కసారి ఆ గ్రహ స్థితిని పరిశీలిస్తే… మిధునరాశిలో శుక్రుడు, రాహువు… కర్కాటక రాశిలో రవి, బుధుడు… ధనస్సు రాశిలో గురుడు, కేతువు… మకరంలో శని… కుంభంలో చంద్రుడు… మీనంలో కుజుడు ఉన్నారు. అది తులా లగ్నం సమయంలో నవాంశ రాశి మేషంలో కేతువు… సింహంలో బుధుడు…. తులలో రాహువు… వృశ్చికంలో శుక్రుడు, గురుడు…

ధనస్సులో రవి, చంద్రుడు… కుంభంలో కుజుడు ఉన్నారు. మీన నవాంశ లగ్నం ప్రకారం… రాశి చక్రంలో లగ్నాధిపతి భాగ్యరాశిలో… భాగ్యాధిపతి దశమంలో… లాభాధిపతి దశమంలో… అంటే భాగ్య లభాధిపతులిద్దరూ దశమంలో ఉండటం అత్యంత శుభం.చంద్రగ్రహం పంచమ కోణంలో ఉన్నప్పటికీ… శుభ ప్రధమే. శని కేంద్ర స్థానమైన మకరంలో… రాహువు భాగ్యరాశి అయిన మిధునంలో ఉన్నాడు… గురు గ్రహం స్వక్షేత్రంలో ఉన్నాడు. అష్టమశుద్ధి కలిగి ఉండటం విశేషరీతిలో శుభాన్నిస్తుంది. ఐతే… రామమందిర నిర్మాణం శంకుస్థాపన తులారాశిలో నిర్ణయించడం వల్ల కొందరికి అనుమానం కలుగుతుంది.

తులా రాశి చర రాశి కదా… చర రాశిలో శంకుస్థాపన చేయడం అరిష్టం బదులు మంచిది కాదు కదా అన్న సందేహం కలుగుతుంది. కానీ చర రాశి గుణం పొగొట్టి… స్థిర రాశి గుణం వచ్చేలా లగ్నాన్ని పండితులు ముహూర్తం నిర్ణయించారు.శుక్రుడు మిధున రాశిలో మూడో భాగంలో ఉండటం మూలంగా… చరరాశి స్వభావం పోయి… స్థిర రాశి స్వభావం లగ్నానికి లభిస్తుంది. ఈ ముహూర్తానికి అష్టకవర్గులో లగ్నరాశిలో 5 శుభ బిందువులు కూడా వచ్చి చేరతాయి. దీంతో ముహూర్తం అత్యంత దివ్యంగా రూపుదిద్దుకుంటుంది.

ఇన్ని సుగుణాలు గల తులాలగ్నంలో రామమందిర శంకుస్థాపన నిర్ణయించడం మనందరి అదృష్టం. ఆ సమూహర్తం… ఆగస్టు 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 15 సెకండ్లకు ప్రారంభించి 36 సెకండ్లలోనే తంతు పూర్తి చేస్తారు. ఈ విధంగా… హిందువుల చిరకాల అయోధ్యలోని రామమందిర నిర్మాణ కార్యక్రమం నెరవేరడం మనందరి అదృష్టం. మొత్తంగా ఇది హిందువుల మనోభావాలు నెరవేర్చే దివ్య ముహూర్తమంటున్నారు జ్యోతిష్యపండితులు చల్లా రామారావు, వేటపాలెం, చీరాల 9866532586.

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?