Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్ బిగ్ స్టోరీ

బాబు ఆర్కే పక్కకెళ్లి ఆడుకో! నీ రాతలు తమ్ముళ్ళకే రోత పుట్టిస్తున్నాయి!

Share

ప్రతి వారం ఏదో ఒక విషయాన్ని బయటకు తీసినట్లు పెద్దపెద్ద రాతలు రాయడం… చివరాకరికి తాను తీసుకున్న రాతల గోతిలోనే తాను పడడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు బాగా అలవాటు అయిన విషయం. ప్రతి జర్నలిస్టు దేనినైనా విమర్శించొచ్చు… ఆ విమర్శలు లాజిక్ ఉండాలి ఖచ్చితమైన విశ్లేషణ వివరణ విధానం ఉండాలి. మన వాదనకు సహకరించే లెక్కలు, ఆధారాలు ఖచ్చితమైనది ఉండాలి. అలాకాకుండా నచ్చని వ్యక్తులను, ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన భాషలో ఇష్టం వచ్చిన వ్యక్తులు తో పోల్చి మరి పెద్ద పెద్ద వ్యాసాలు సుమారు అర పేజీ స్థాయిలో రాయడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా పోయే పరువే ఎక్కువ. అందులోనూ ప్రతివారం పనిగట్టుకు మరి అధికారపక్షాన్ని పెట్టడం వల్ల ఆ పార్టీకి మేలు చేసిన వారు అవుతారు తప్ప కీడు చేసిన వారు అవరు అనే విషయాన్నీ రాధ కృష్ణ ఎప్పుడు గ్రహిస్తే అప్పుడు మంచిది. ఇది ఆయనకే కాదు ఆయన వల్లమాలిన ప్రేమ కురిపించే తెలుగుదేశం పార్టీ కి చంద్రబాబు కి కూడా మేలు. ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న ఈ రాతల వల్ల ఆంధ్రజ్యోతి చేస్తున్న ప్రయోజనం ఎంతో గానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది. దీనిని సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని సైతం ఎప్పుడో గ్రహించారు. దీనిని మార్పుకు పోతే ప్రతివారం నవ్వులపాలు కాక మరేమీ మిగిలి పరిస్థితి ఉండదు.

తాజాగా ట్రంప్ తో…

జగన్ పాలనను తాజాగా అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ రంపాలతో రాధాకృష్ణ పోల్చుతూ ఈ వారం చిలక పలుకులు పలికారు. అసలు సొయాలో ఉండే రాధా కృష్ణ ఇది రాసి ఉంటారా అనే అనుమానం ఈ వ్యాసం చదివితే కలగకమానదు. అమెరికా ప్రజాస్వామ్యానికి రాష్ట్ర ప్రజాస్వామ్యానికి అసలు పంపిణీ ఎక్కడ ఉందో ఆయనకే తెలియాలి. ట్రంపు జగన్ కు అసలు ఏ విషయంలో పోలికలున్నాయో కూడా రాధాకృష్ణ కే కనిపించాలి. అంతేకాదు 151 సీట్లు గెలిచి జగన్ నియంతలా.. ట్రంపు కంటే అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు అంతగిరి లవర్ చేయాలంటూ ఆయన పిలుపునివ్వడం చూస్తుంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.
** రాధాకృష్ణ వ్యాసాలలో గతంలో వ్యంగ్యంతో పాటు ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని బలపరిచే అంశాలు కాస్తోకూస్తో ఉండేవి. అయితే జగన్ గద్దెనెక్కిన దగ్గర్నుంచి ఆయన జర్నలిస్టు కూడా గత చెప్పినట్లు కనిపిస్తోంది. ఏం చెప్పదలచుకున్నా రు ఎవరితో పోల్చారు ఎందుకు అనే సహజ అంశాలు లేకుండా ఆయన సాగిస్తున్న అక్షర యాత్ర సగటు పాఠకుల్ని పిచ్చెక్కిస్తుంది. తేదేపా సానుభూతిపరులు ఆయన రాతలు కాస్త ఉపశమనం కలిగించవచ్చు గానీ సగటు పాఠకుడు మాత్రం రాధాకృష్ణ రాతలకు వ్యాఖ్యలకు మాత్రం సతమతమవుతున్నాడు. ఆదివారం అయితే ఎనిమిది రూపాయలు పెట్టి పత్రికను కొనుగోలు చేసి రాధాకృష్ణ వ్యాసాలు చదువుతున్న సాధారణ పాఠకులకు ఆయన ఏం రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారు ఎవరు రాస్తున్నారు అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది.

తెదేపా వారికీ మింగుడు పడటం లేదా!

ఆంధ్రజ్యోతి పత్రిక అంటేనే టిడిపి పూర్తి స్థాయి పత్రిక. ఈనాడు కూడా ఆ బాధ్యతలను నిర్వర్తించిన పూర్తిస్థాయిలో మాత్రం బయట పడదు. ఆంధ్రజ్యోతి మాత్రం అలా కాదు పూర్తిగా టిడిపిని సమర్థిస్తూ, అధికార వైఎస్సార్సీపీని ఇష్టానుసారం నిందలు వేయడం పనిగా పెట్టుకుంది. ఒక్కో కథనానికి కనీసం జర్నలిజం విలువలు, ఆధారాలు లేకుండానే ఈ మధ్యకాలంలో కొన్ని కథ ప్రచురితం అవుతున్నట్లు సగటు తెదేపా అభిమానులే వాపోతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సాగిస్తున్న అక్షర యాత్ర వరకు నిజమే కానీ.. దానికి సైతం కనీస ఆధారాలు లాజిక్కులు లేకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం అసాధ్యం అనేది తెదేపా తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఈ కారణంతోనే టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆంధ్రజ్యోతి లో వస్తున్న కథనాలు పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితికి చేరుకుంది. వాటిపై విపరీతమైన ట్రోలింగ్ ను వైయస్సార్ సిపి పార్టీ తరఫున నెటిజన్లు వేస్తుండడంతో వాటికి కనీసం సమాధానం చెప్పలేక ఆంధ్రజ్యోతి కథనాలను సమర్థించలేదు టీడీపీ సోషల్ మీడియా విభాగం సైతం పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ప్రతివారం రాసి ఆర్కే పలుకులు సైతం టిడిపికి ప్లస్ కావాల్సింది పోయి ఇప్పుడు మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందారోపణలు చేయడం వరకు సరే కానీ ఎల్లలు దాటి ఎవరిని పడితే వారిని తో పోలుస్తూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ గెరిల్లా వార్ ప్రోత్సహించేలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే ఆయన మీద, న్యాయపరంగా ను చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రింట్ మీడియాకు కాలంచెల్లిన సమయంలో ఈ రాతలు వల్ల ఈ అనైతికత వ్యవహారాల వల్ల పత్రికలకు మరింత ఇమేజ్ పోతుందే తప్ప… దానిని చదివేందుకు సగటు పాఠకుడు ఒప్పుకోవడం లేదు అనేది రాధాకృష్ణ లాంటి వ్యక్తులు గుర్తెరగాలి. అప్పుడే పత్రికా ప్రపంచానికి శ్రీరామరక్ష.


Share

Related posts

Dhee 13 : ప్రియమణి ముద్దు కోసం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఏమైనా చేసేలా ఉన్నారు?

Varun G

ట్రాక్టర్ ప్రమాదంలో మరో ట్విస్టు : లోకేశ్ పై కేసు నమోదు !

Yandamuri

బిగ్ బాస్ 4 : దెబ్బకు అభిజిత్ హీరో అయ్యాడు… అఖిల్ ఢీలా పడ్డాడు

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar