NewsOrbit
బిగ్ స్టోరీ

ఇక తప్పుకో సుబ్బారెడ్డి…!!

అంతా ఆ చౌదరి వల్లేనా…నిర్ణయాలన్నీ వివాదాస్పదమే…!!

కలియుగ ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో తరించేందుకు టీటీడీ ఛైర్మన్‎గా అవతారమెత్తిన వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు అన్నీ ఇన్నీ కావు… కేవలం జగన్మోహన్ రెడ్డి బాబాయి అన్న ఏకైక కారణంతో అందలమెక్కిన వైవీ ఏలుబడిలో టీటీడీకి అన్ని సంకటాలే. స్వామిని క్షణభంగురమైన చూసి తరించాలని ప్రపంచజనులంతా భావిస్తుంటే అక్కడ పగ్గాలు తీసుకున్నవారు తీసుకునే నిర్ణయాలు మాత్రం అన్నీ అనర్థమైనవే. ఏ నిర్ణయం తీసుకున్నా ఏముంది గర్వకారణం అన్న చందంగా ఎస్వీ నిర్ణయాలుంటాయ్. బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి అడుగడుగనా వైవీ కొత్త సమస్యలతో జగన్ సర్కారును ఇరుకునపెడుతూ వస్తున్నారు. భూముల విక్రయాలు, దర్శనాలు,అర్చకుల మధ్య వివాదాలు, కరోనా తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాల్లో ఎన్నో విమర్శలు విన్పించాయ్.

 

SVBCలో అయోధ్య రాముడు కన్పించరా? తాజాగా టీటీడీలో భాగమైన SVBC చానెల్ నిర్వాకాన్ని తెలుసుకుందాం… కలియుగ దేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి నిత్య సేవలు, కైంకర్యాలతోపాటు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఈ చానెల్ తాజాగా హిందువుల ఆరాధ్య దైవం… అయోధ్య శ్రీరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని మాత్రం ప్రసారం చేయలేదు. SVBC చానెల్ ఎవరు నిర్వహిస్తున్నారంటూ ఇంకా ఎన్నో అనుమానాలు. చానెల్ సీఈవో బాధ్యతలంటే కేవలం సీట్లో కూర్చొని డ్రై ఫ్రూట్స్ తిని… వచ్చిన వారికి నాలుగు పోస్కోలు కబుర్లు చెప్పడమేనా… అసలు SVBC చానెల్ లో జరుగుతున్న అకృత్యాల గురించి తర్వాత కథనలో తెలుసుకుందాం… సీఈవోను తొలగించాలి-బీజేపీ తాజాగా ఇదే అంశాన్ని బీజేపీ నాయకుడు,నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి ప్రస్తావించారు.

కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన SVBC ఛానల్, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయోధ్య ప్రసారాలను ఛానల్‎లో‎ ఎందుకు టెలీకాస్ట్ చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. వీవీఐపీలు, రాజకీయ నాయకుల దర్శనాల వార్తలు మాత్రమే చానెల్‎లో చూపిస్తారా… ప్రపంచంలో 250 టీవీ ఛానళ్లు రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే… SVBC ఎందుకు చేయలేదంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన SVBC CEO వెంకట నగేష్‎ చౌదరిని తక్షణం విధుల నుంచి తొలగించాలని, ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి వెంటనే దీనిపై విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని… 24 గంటల్లో బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముణ్ణాళ్ల ముచ్చటగా పృధ్వీ ఎపిసోడ్ ప్రభుత్వం మారి ఏడాదిన్నర గడుస్తున్నా… సుజనా చౌదరి వీరవేధేయుడు నగేశ్ చౌదరి ఏలుబడిలోనే సాగుతోంది.

వైసీపీ నాయకులను ప్రసన్నం చేసుకొని… ఎవరొచ్చినా… తనకంటే విధేయుడిగా ఉండరంటూ మాట కలిపిన చౌదరి అంతా తనై చక్రం తిప్పుతున్నాడు. కోట్ల రూపాయల నిధులు పక్కదారి గురించి విచారణ జరుపుతానంటూ మధ్యలో అమ్మనా బత్తాయ్ అంటూ వచ్చిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ చేజేతులా స్వామి సేవ కార్యాన్ని అపహాస్యం చేసుకోగా… ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి మద్దతుతో చౌదరిగారి నిర్వహణలో సాగుతోంది. చానెల్ లో అసలు కార్యక్రమాలే ఉండవ్. వందల కొద్దీ ఉద్యోగులంటారు. అందరికీ 50 వేలకు పైనే జీతభత్యాలు… గంట సేపు కూడా కుదురగా సీట్లో కూర్చొని ఉద్యోగుల సంఖ్య కనీసం 70, 80 దాకా ఉంటుందట. వైవీ అండదండలతో చౌదరి దూకుడు ఎస్వీబీసీ సీఈవో కోసం ప్రకటన ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎవరనీ తీసుకోలేదు. ఇందుకు కారణం కూడా మన ఘనత వహించిన సుబ్బారెడ్డి గారేనట. చానెల్ బాధ్యతలు టీటీడీ మరో జేఈవో ధర్మా రెడ్డికి అప్పగించినా… ఈ గందరగోళాలు నాకెందుకులే అనుకున్నాడో ఏమో… ఆయన కూడా చానెల్ మోహం చూడలేదట.

నగేశ్ చౌదరి కంటిన్యూ కావడానికి ప్రధాన కారణం వైవీ సుబ్బారెడ్డేనట. ఈ నగేశ్ చౌదరి జగన్ అంటే అసలు పడదు. అయినా.. సుబ్బారెడ్డి‎కి మాత్రం ఆ చౌదరి ఆయన వెనుక ఉన్న పెద్ద చౌదరి అంటే అంతో గౌరవం ఎందుకో అర్థం కావటం లేదంటూ ఛానళ్లోనే గుసగుసలు. వైసీపీ ప్రభుత్వం వచ్చినా…. ఆ వ్యతిరేకును ఇంతా అందలం ఎక్కించాల్సిన అవసరం సుబ్బారెడ్డికి ఏంటనేది వైసీపీ మద్దతు దారుల్లోనే హాట్ టాపిక్. దీని మీద ఇప్పుడు సీఎం వద్దకు వెళ్లేందుకు కొందరు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో బీజేపీ నేతల విమర్శతో సుబ్బారెడ్డి సీఎం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆశీస్సులు కూడా ఈ చౌదరికి ఉన్నాయట.. చివరగా ఒక్క మాట SVBC కేవలం చానెల్ మాత్రమే కాదు.. పరమాత్ముడి సేవలో పరమ పవిత్రమైన కార్యం… అది గుర్తించకోండి… లేదంటే ఆ ఎఫెక్ట్‎కి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తస్మాత్ జాగ్రత్త.

 

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju