NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Covid : కరోనా తీవ్ర రూపం..! వచ్చే 15 రోజులు మరింత జాగ్రత్త..!!

Corona Killed: Families Died in Vijayawada Corona

Covid : కోవిడ్ Covid దేశంలో తగ్గిందనుకున్న కరోనా తీవ్రత మళ్లీ ప్రళయంలా విరుచుకుపడుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజా జీవనం, వ్యవస్థలన్నీ గాడిన పడుతున్న తరుణంలో మళ్లీ మునుపటి ఏడాది పరిస్థితులు తీసుకొస్తున్నాయి. దేశంలో ప్రధానంగా పది రాష్ట్రాల్లోనే కరోనా పెను ప్రభావం చూపిస్తున్నా.. ఇది దేశం మొత్తానికి హెచ్చరిక అని చెప్పాలి. ఏకంగా గడచిన 24 గంటల్లో 89,129కేసులు నమోదవడం.. 714 మంది ప్రాణాలు కోల్పోవడమే పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దేశంలో కరోనా గాలులు వీయడం మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ మొత్తంగా 164,110మంది చనిపోగా.. 1,23,92,260 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాస్తంత తీవ్రంగానే ఉంది. ఇదంతా కేవలం మనిషి చేసుకున్న ‘నిర్లక్ష్యం’.

beware in coming 15 days with corona Covid
beware in coming 15 days with corona Covid

ప్రపంచం మొత్తం మీద ఒక దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్లు రావడం కేవలం భారత్ లో మాత్రమే జరిగింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి వెస్టిండీస్ వంటి దీవులకు కూడా వ్యాక్సిన్లు పంపించాం. ‘ఇదే కదా మన గొప్పదనం’ అనుకున్నారేమో.. ప్రజలు కరోనాను తక్కువ అంచనా వేశారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం మానేశారు. మహారాష్ట్రలో మొదలైన ఉత్పాతం మళ్లీ దేశం మొత్తం ఇబ్బందిపడేలా చేస్తోంది. గడచిన తెలుగు రాష్ట్రాల్లో గడచిన 24 గంటల్లో ఏపీలో 1398, తెలంగాణలో 1321 కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో ఈ నెల మధ్యనాటికి కరోనా ఉగ్రరూపం చూపి ఆ తరువాత కేసులు తగ్గుతాయని.. మళ్లీ మే 15-20 మధ్య కేసులు గరిష్ట స్థాయికి చేరుతాయని అంటున్నారు.

 

సూత్ర SUTRA (Susceptible, Undetected, Tested (positive), Removed (recovered or dead) అనే గణిత నమూనా తో మహేంద్ర వర్మ సారథ్యంలోని కాన్పూర్ శాస్తవేత్తల బృందం ఈ లెక్కలు వేసింది. మొదటి దశ సమయంలోనూ ఇదే నమూనా శాస్త్రవేత్తలు అనుసరించారు. గతంలో 2020 సెప్టెంబర్ కి గిరిష్టానికి పెరిగి 2021 ఫిబ్రవరికి తగ్గుతాయని వేసిన అంచనాలు సక్సెస్ కావడంతో ప్రస్తుత నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలను హెచ్చరించింది. మహారాష్ట్రలో తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. మొత్తంగా మే చివరి వరకూ చాలా అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులు చెప్తున్నాయి.

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!