సెలబ్రిటీలు అంతా మాల్దీవ్స్ లో వాలడం వెనుక ఇంత పెద్ద స్కామ్ ఉందా..?

అందరికీ ఒక బాధ అయితే…. డబ్బున్న వాళ్ళది మరొక బాధ అని ఊరికే అనరు. సెలబ్రిటీలు అంతా చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ పాటిస్తుంటారు. వారిలో కొంత మంది సామాన్య ప్రజలు లాగానే సింపుల్ గా ఉంటారు అనుకోండి అది వేరే విషయం. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు విహారయాత్రలకు బయట దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడానికి మొగ్గు చూపుతారు. కానీ ఒక్కసారిగా అందరి సెలబ్రిటీలు ఒకే హాలిడే స్పాట్ మీద పడడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు…

 

మాల్దీవ్స్ లో మకాం….

ఇప్పటికే మీకు సగం విషయం అర్థమై ఉండాలి. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో ఏ సెలబ్రిటీ టూర్ కి వెళ్లాను అని చెప్పినా అది మాల్దీవ్స్ కే అవుతుండటం గమనార్హం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను, కుటుంబసభ్యులని అక్కడికి తీసుకువెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఈ అతి సుందరమైన సముద్రతీరంలో రిసార్టులకి కొదవలేదు. గత రెండు నెలల నుండి ఎంతో మంది సెలబ్రిటీలు తమ స్నేహితులతో కుటుంబ సభ్యులతో అక్కడ సేద తీరుతున్నారు. కరోనా తర్వాత దొరికిన సమయం కాబట్టి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లిస్టులో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తాప్సీ, అలియా భట్, దిశా పటాని, తారా సుతారియా, నేహ ధూపియా, తాప్సీ పన్ను, మౌని రాయ్, మందిరాబేడీ, వరుణ్ ధావన్, మందిరా బేడీ వంటివారు ఉన్నారు.

కరోనా దెబ్బకు కుదేలు

అయితే ఇక్కడ అందరూ కలిసి ఒకే చోట కి వెళ్లడం యాదృచ్ఛికం అయితే కాదు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కరోనా వలన టూరిజం ఘోరంగా దెబ్బతింది. ప్రపంచమంతా స్తంభించిపోవడంతో ఆ ప్రదేశాలన్నీ నిర్మానుష్యమై ఎంతమందికి భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక మాల్దీవ్స్ లాంటి ప్రదేశాల్లో అయితే వాటి దేశ ఆర్థిక వ్యవస్థ టూరిజం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీరంతా కలిసి ఒక కొత్త ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. భారతదేశంలోని అందరు సెలబ్రిటీలు అక్కడికి వెళ్లడం యాదృచ్చికం కాదని…. దీని వెనుక ఒక భారీ సీక్రెట్ ఉందని…. కొంత మంది ఇంటర్నెట్ లో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

మర్కెటింగ్ కా బాప్ ఇది…!

విషయం ఏమిటంటే…. ప్రతి సెలబ్రిటీ వేరు వేరు రిసార్టులు కి వెళ్లి ఇంస్టాగ్రామ్ లో ఇతర సోషల్ మీడియా వేదికల్లో వాటిని ట్యాగ్ చేస్తున్నారు. దీని వల్ల భారీ పబ్లిసిటీ వస్తుంది. భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలు అంతా అక్కడే ఉండటంతో అక్కడ ఎలా ఉంటుందనే విషయంపై భారతీయులకి ఐడియా వచ్చేసింది. ఇంకేముంది ఫ్రీగా ప్రమోషన్స్ దొరికినట్లే, సంపన్న కుటుంబాలన్నీ వెంటనే విహార యాత్రకు వెళ్లే పనిలో పడ్డారు. మరి సెలబ్రిటీలు వెళ్లి వచ్చిన ప్రదేశంలో వారూ ఫోటోలు దిగి షేర్ చేయాలి కదా. దీని వల్ల సెలబ్రిటీలకు ఉపయోగం ఏమిటంటే…. పలు రిసార్టుల యాజమాన్యం వారికి ఫ్రీ ట్రిప్ కల్పించినట్లు గా చెబుతున్నారు. అందువల్లే వారు అక్కడికి వెళ్ళి చిల్ అవుతున్నాట. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే దీనికన్నా మార్కెటింగ్ ఇంకేముంటుంది చెప్పండి…!