NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బొలిశెట్టి మాటల్లో జనసేన అసలు స్వరూపం : విస్తుపోయిన పవన్

బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయినా నాయకుడు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ పార్టీ తరఫున పనిచేసిన బోలిశెట్టికి ఆ నియోజకవర్గ నాయకుడు ముళ్ళపూడి బాపిరాజుకు ఉన్న కొన్ని విబేధాలు కారణంగా, బాపిరాజుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీను వీడారు. అప్పటివరకు గూడెం టీడీపీ టికెట్ ఆశించిన ఆయన జనసేనలోకి రాగానే వెంటనే టికెట్ దక్కింది. 36 వేలఓట్లు సాధించిన బొలిశెట్టి జనసేనలో క్రీయాశీలకంగా ఉన్నారు.

 

ఉన్నది ఉన్నట్లుగా

పార్టీ అధినేతకు తలలో నాలుకలా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో సైతం దూసుకుపోతున్న ఆయన పార్టీ తీరు పట్ల అధినేత పవన్ ఎదుట ఉన్నది ఉన్నట్లుగా కుండా బద్దలు కొట్టారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న బొలిశెట్టి జనసేన పార్టీ చేస్తున్న తప్పిదాలు, వెంటనే తీసుకురావాల్సిన మార్పులను సూటిగా, సుత్తి లేకుండా పార్టీ అధినేత ముందు ఉంచారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాని పవన్, నాదెండ్ల మనోహర్ వేదిక మీద ఉండగానే పార్టీ తీరును తూర్పురా బట్టారు. సమావేశంలో ఆయన మాటలు ఎప్పుడు జనసేన పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కొందరు బొలిశెట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పారని, ఎప్పటినుంచో కార్యకర్తలు చెప్పాలనుకుంటున్న మాటలు ఆయన చెప్పారని అంటుంటే, మరిలోందారు మాత్రం ఇష్టానుసారం మాట్లాడారని పవన్ ముందు ఆలా మాట్లాడటం సరి కాదని చెబుతున్నారు.

అసలు బొలిశెట్టి శ్రీనివాస్ ఎం మాట్లాడారో.. జనసేన క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం…

బొలిశెట్టి మాట : పార్టీ విధానాలు, అధికార పార్టీ వైఫల్యాలు, ఇతర అంశాలపై ఎప్పటికి అప్పుడు పార్టీ నాయకులూ ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముఖంగా మాట్లాడాలి. అప్పుడే పార్టీ లైం లైట్ లో ఉంటుంది. ప్రజలకు పార్టీ విధానాలు తెలుస్తాయి.
* ప్రస్తుతం జనసేన పార్టీ ఏదైనా విషయం తెలియజేయాలంటే కేవలం ప్రెస్ నోట్లు, ట్విట్టర్ వేదికగా మాత్రమే పనిచేస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఒక పార్టీ ఉంది అని, అది ఒక సమస్యపై స్పందించింది అని తెలియడం లేదు. అధినేత సైతం అప్పుడపుడు ట్విట్టర్ లో లేదా, ప్రస్నోటే విడుదల చేసి మాట్లాడటం వాళ్ళ మీడియా సైతం సీరియస్గా తీసుకోవడం లేదు.
బొలిశెట్టి మాట : పార్టీను నమ్ముకుని మా భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాం. మీ విధానాలు సరైనవే. కానీ మీ విధానాలకు తగిన వ్యక్తులు దొరికే అంత వరకు కనీసం గ్రామ స్థాయిలో కమిటీలు వేయకపోతే పార్టీ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది. ఎన్నిక ముందు అప్పటికి అప్పుడు బయటకు వచ్చి ఓట్లు వేయమంటే జనం నమ్మరు.
* ప్రస్తుతం నియోజకవర్గ, మండల కమిటీలే పార్టీకు ఉన్నాయి. కొన్ని చోట్ల అవి లేవు. మండల స్థాయి నాయకులూ అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోతున్నారు. కొన్నో గ్రామాల్లో మండల నాయకులకు తెలియని గ్రామాలూ ఉన్నాయి. పార్టీలో గ్రామస్థాయి కమిటీలో వేసేందుకు నియోజకవర్గ నాయకులకు బాడీత అప్పగించకపోతే మనుగడ ఎలా..? ఎప్పటికి పార్టీ నిర్మాణం అవుతుంది?
బొలిశెట్టి మాట : పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు అనుబంధంగా పనిచేతున్న వారు ఉన్నారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకు తెరచాటున సహకరిస్తున్న వారు ఉన్నారు. వీరిపై ద్రుష్టి పెట్టకపోతే పార్టీ నాశనం ఖాయం.
* ప్రస్తుత అధికపార్టీలో మిత్రులుగా ఉంటూ తూతూమంత్రంగా పనిచేసేవారి ఎక్కువగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇది బహిరంగంగా జరిగితే కొన్ని చోట్ల రహస్యంగా సాగుతుంది. దీని వాళ్ళ పార్టీ ఎప్పటికి ఎదగదు. ఎలాంటి వారి వాళ్ళ పెను ప్రమాదం తప్పదు.
బొలిశెట్టి మాట : పార్టీ అధినేతను కలవాలంటే మిడిల్ మేనేజిమెంట్ హావ ఎక్కువగా ఉంది. ఏదైనా కష్టం చెప్పుకోవాలన్న మిమ్మల్ని చేరుకోవడం గగనం అయిపోతుంది. మధ్యలోని వారు అసలు కుదరదు అని చెబుతున్నారు.
* నాయకులకే అందుబాటులో లేని వ్యక్తి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడు అని ప్రత్యర్ధులు బలంగా పార్టీ అధినేత మీద ప్రచారం తీస్కుని వెళితే పార్టీ కు కోలుకోలేని నష్టం. మిడిల్ మేనేజిమెంట్ మొదటి నుంచి పార్టీలో బాగాలేదు. పవన్ సన్నిహితులుగా, పార్టీ పెద్దలుగా చెప్పుకునే కొందరు కిందిస్థాయి నేతలను బాగా తక్కువగా చూస్తున్నారు. పార్టీని వీడిన కళ్యాణ్ దిలీప్ సుంకర, అద్దేపల్లి శ్రీధర్, విజయబాబు వంటి నేతలు దీన్ని ప్రస్తావించారు. ఇది ప్రత్యర్థులకు అస్త్రం కింద మారక ముందే అధినేత కళ్ళు తెరవాలి.
ఎలాంటివి ఇంకా కొన్ని చెప్పిన ఆయన ప్రస్తావనలో ఎలాంటి విషయాలు మరిన్ని కుండా బద్దలు కొట్టినట్లు చెప్పారు.

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?