NewsOrbit
Featured బిగ్ స్టోరీ

జగన్ పై వీర్రాజు ఎటాక్ స్టార్ట్..!! కాంగ్రెస్ రాజకీయాలతో పోలుస్తూ..!!

కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలా..

వరుస ట్వీట్లతో జగన్ ప్రభుత్వ నిర్ణయం పై ఫైర్

ఏపీ బీజేపీ నూతన చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం మీద ఎటాక్ మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పైన వీర్రాజు వరుస ట్వీట్లతో విమర్శల పరంపర కొనసాగించారు. కొంత మంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనకుంటనే..భవిష్యత్తులో అనేక మంది మనోభావాలను దెబ్బ తీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తోందని.. తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో జరిగిన ఒక ఘటనలో ఆరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక వర్గానికి చెందిన వారిలో అసలు జరిగిన ఘటనతో సంబంధం లేకపోయినా కేసుల్లో చిక్కుకున్నారని స్థానికులు ప్రభుత్వంలోని ముఖ్యుల వద్ద వాపోయారు. దీని పైన విచారణ తరువాత ఆ కేసులను ఉప సంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ఇప్పుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆయన దీని పైన చేసిన ట్వీట్లలో బెంగుళూరులో తాజాగా జరిగిన సంఘటలనను ప్రస్తావించారు.

somu veeraju file photo
somu veeraju file photo

అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమంటూ…

2018లో పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడికి సంబంధించిన అధికారులు అప్పట్లో ఆరు కేసులు నమోదు చేసారు. పాత గుంటూరులో ఒక వర్గానికి చెందిన వారి నివాసాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇక యువకుడు ఒక బాలిక పైన అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో..ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ యువకుడిని తమకు అప్పగించాలంటూ స్థానికులు కొందరు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో చిన్న పాటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఆ సమమంలో కొందరి పైన పోలీసులు పలు సెక్షన్ల తో ఆరు కేసులు నమోదు చేసారు. కొందరు అమాయకులపైనా కేసులు నమోదు చేసారంటూ స్థానికులు ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకున్నారు. దీంతో..ఆ కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన సోము వీర్రాజు తాజాగా ట్వీట్లు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు. బెంగుళూరులో తాజాగా జరిగిన ఘటనతో పాటుగా..కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తోందంటూ సోము వీర్రాజు చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.

ap bjp twitter account page
ap bjp twitter account page

మనోభావాలను దెబ్బ తీస్తుంది…

సోము వీర్రాజు ఈ అంశం పైన మూడు ట్వీట్లు చేసారు. అందులో.. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ఎంతటివారైనా తప్పుచేస్తే శిక్షించబడాలన్న న్యాయాన్ని ఆవహేళనచేస్తూ ఒకప్పుడు గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన నిందితులపై పెట్టబడిన కేసులను ఎత్తివేస్తూ సంఘవిద్రోహ శక్తులకు మరిన్నిఅవకాశాలను కల్పించటం ఈ రాష్ట్రప్రభుత్వ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. మరో ట్వీట్ లో..ఇది పూర్వ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తలపిస్తుంది..ఇది చాలా దురదృష్టకరం.. ఇటువంటి నిర్ణయాలు బెంగుళూరు నగరం లో జరిగిన దాడుల వంటి దురదృష్టకర సంఘటనలు మన రాష్ట్రం లో మరిన్ని జరిగే అవకాశాలను పెంచుతున్నాయి..అంటూ అభిప్రాయపడ్డారు. మరో ట్వీట్ లో..రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలనుకుంటే దాని పరిణామం భవిష్యత్తు లో అనేకమంది మనోభావాలను, వారి ఆత్మస్తేర్ధ్యాన్ని దెబ్బతీస్తుందనటం లో ఏమాత్రం సందేహం అవసరం లేదు..అని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పుడు దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju