NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

BJP : కాంగ్రెస్ – బీజేపీ కలిసి చూపిస్తున్న “నాన్నకి ప్రేమతో” సినిమా..!

BJP : BJP - Congress Mind Game

BJP : బీజేపీ – కాంగ్రెస్ ఒకదానికొకటి పోటీ కానేకాదు..! కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం కొట్టుమిట్టాడుతోంది. బీజేపీ అత్యంత బలీయ శక్తిగా తయారయింది. ఈ రెండు పొలిటికల్ గేమ్ ఆడితే ఏమవుతుంది..? ఎవరు నెగ్గుతారు..? ఎవరు ఓడిపోతారు..!? అనే సందేహాలు వ్యక్తమైతే మాత్రం వారికి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు సమాధానం. ఆ వేడుకల సందర్భంగా జరిగిన హింస సరైన సాక్ష్యం..! రెండు పార్టీలు BJP, Congress కలిపి ఇక్కడ “నాన్నకి ప్రేమతో” సినిమా చూపించాయి..!!

“నాన్నకి ప్రేమతో” సినిమా అంటే అందరికీ బహుశా నాన్న సెంటిమెంట్ బాగా గుర్తుంటుంది. రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా ఎన్టీఆర్ తన తండ్రిని గెలిపించడానికి పడే తాపత్రయం, పోరాటం గుర్తుంటుంది..! కానీ ఈ సినిమాలో మొత్తానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. మైండ్ గేమ్స్ ఉంటాయి.

“ప్రత్యర్థి ఏం చేయబోతున్నాడో ముందే ఊహించి.. దానికి విరుగుడు అలోచించి.., ఆ స్టెప్ వేసే మైండ్ గేమ్ ఉంటుంది. సినిమాలో విలన్, హీరో మధ్య ఇటువంటి అనేక సన్నీవేశాలు ఉంటాయి”..! ఇప్పుడు దేశంలో బీజేపీ – కాంగ్రెస్ ఇటువంటి రాజకీయ పన్నాగాలే వేస్తున్నాయి. అందుకు ఢిల్లీలో జరిగిన దాడులే ఉదాహరణ..! ఆ దాడుల, గొడవల వెనుక ఎవరున్నారు..?రైతుల్లో ఎవరు దూరి.. ఇలా హింసకి పాల్పడ్డారు అనేది దేశంలో అతి పెద్ద చర్చ..!

BJP Congress Political Mind Game
BJP Congress Political Mind Game

BJP : రైతు ఉద్యమాన్ని బీజేపీ డైవర్ట్ చేసిందా..!?

రైతులు పోలీసులను ఇలా కొట్టడం ఏమిటి..? పోలీసులను అలా తరిమి తరిమి.., ట్రాక్టర్లతో వెంటాడడం ఏమిటి..? పోలీసులు ప్రాణ రక్షణతో గోడలు దూకేయడం ఏమిటి..? ఎర్రకోటపై ఆ జెండా పాతడం ఏమిటి..!? అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ. దీనిలో కొన్ని అనుమానాలున్నాయి. అందులో మొదటిది..!? “బీజేపీనే ఒక ప్లాన్ ప్రకారం రైతు ఉద్యమంలో హింసం చెలరేగేలా చేసిందా..? అలా చేయడం వలన రైతు ఉద్యమంపై దేశంలో చిరాకు పుట్టి.., ఉద్యమాన్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది” బీజేపీకి కావాల్సింది కూడా అదే. అలా జరిగితే ఇక ఆ ఉద్యమాన్ని బీజేపీ పట్టించుకోవాల్సిన పని ఉండదు. అందుకే ఒక ప్లాన్ ప్రకారం రైతుల్లో బీజేపీ కోవర్టులు దిగి, ఇలా హింసకు పాల్పడి ఉండవచ్చు. ఏమో.. ఈ అవకాశాలు లేకపోలేదు. అమిత్ షా బుర్రలో ఇటువంటి ఐడియాలు కొదవేం లేదు. ఇది ఒకటో మైండ్ గేమ్..!!

BJP : BJP - Congress Mind Game
BJP BJP Congress Mind Game

Congress : కాంగ్రెస్ కుట్రలు పన్నిందా..!?

కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం.. కుట్ర ప్రకారం రైతు ఉద్యమంలో హింస పెరిగేలా చేసిందా..!? ఇది రెండో వాదన..! “రైతు ఉద్యమం హింసగా మారితే.. దేశంలో శాంతి భద్రతలు లోపిస్తే.. బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుంది. రైతుల్లో ఆ కసి, కోపం రావడానికి బీజేపీ విధానాలే కారణం” అంటూ దేశంలో ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగవచ్చు” అనేది కాంగ్రెస్ ఆలోచన కావచ్చు. కాంగ్రెస్ లోనూ ఇటువంటి రాజకీయాలు కొత్త కాదు. ఇలా కుట్ర పూరితంగా వ్యవహరించడం.. సంప్రదాయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య.

BJP : సున్నితంగా ఆలోచించాల్సిన అంశాలున్నాయి..!!

అయితే ఇక్కడే మనం “నాన్నకి ప్రేమతో” సినిమాలో మైండ్ గేమ్ గురించి చెప్పుకోవాలి. మొదటి మైండ్ గేమ్ – “కాంగ్రెస్ ఇలా చేస్తుంది అని ముందే ఊహించి.. బీజేపీనే ఒక ప్లాన్ ప్రకారం చేసేసి.. కాంగ్రెస్ పైకి నెట్టేయడం ద్వారా… అటు రైతు ఉద్యమంపై దేశం మొత్తం మీద వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ ఇలా చేయిస్తుంది.. అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పై కూడా దేశంలో వ్యతిరేకత పెరుగుతుంది” అనే రెండు దూరపు ఆలోచనలతో బీజేపీనే చేయించి ఉంటుంది అనే అనుమానాలున్నాయి. ఇప్పుడు దేశంలో రాజకీయాలు మైండ్ గేమ్ చుట్టూ నడుస్తున్నాయి. ప్రత్యర్థి అడుగులను ముందే ఊహించి.., దానికి విరుగుడు వేయడమే ప్రస్తుతం పొలిటికల్ సీజన్. సో.. బీజేపీ దీనిలో ముందుంది.., అందుకే ఢిల్లీలో జరిగిన ఘటనల్లో మొదటి అనుమానం బీజేపీపైకి, రెండో అనుమానం కాంగ్రెస్ పైకి వెళ్తుంది. పైగా ఆ సిద్ధూ అనే యువకుడు (మొదటి అనుమానితుడు) బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు దిగడం కూడా ఆ వాదనకి బలాన్నిస్తుంది. ఏది ఏమైనా.. దేశంలో సోషల్ మీడియా ఇంతగా చురుకైన వేళా.., యువత కూడా రాజకీయాన్ని ఆలోచిస్తున్న వేళా మైండ్ గేమ్ రాజకీయాలు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?