NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇవ్వనున్న బిజెపి..? ఈ ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది..!

ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి పై కాలు దువ్వుతూ కొద్దిగా దూకుడుగా వ్యవహరిస్తోంది కానీ ఎంత జనసేన తో జత కలిసినా ఎంపీ సీట్లకు వచ్చేసరికి వారికి వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్ని దక్కుతాయి అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బిజెపి అంతిమ లక్ష్యం. దాని కోసం బయటకు ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నా లోపల వైసీపీతో బిజెపి స్నేహం కొనసాగిస్తుంది అన్నది విశ్లేషకుల అంచనా.

 

Pawan Slaps A Punch On Modi, Jagan

ఇకపోతే ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనేక అంశాల్లో వైసీపీకి బహిరంగంగా మద్దతు తెలిపింది. ఏపీ రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నా కేంద్రం పెద్దలు మాత్రం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పేశారు. అయితే జగన్ దూకుడు తెలిసిన ఢిల్లీ పెద్దలు మండలి రద్దు తీర్మానం మాత్రం పెండింగ్ లోనే ఉంచారు. ఈ విషయం ఎప్పటికైనా తమకు పనికి వస్తుందన్న ఆలోచన వారిది కాబోలు. 

ఇదిలా ఉండగా బిజెపి…. జనసేన పార్టీకి ఎంత వరకు ప్రాముఖ్యతనిస్తుంది మరియు వారితో కలిసి అసలు తమ భవిష్యత్తు కార్యాచరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమర్థవంతంగా మరియు అత్యంత ప్రభావవంతంగా చేయగలుగుతుందా…. అన్న విషయంపై అటు బిజెపి కేడర్ కు కానీ జనసేన అభిమానులకు కానీ కొంచెం కూడా అవగాహన లేదు. ఈ లోపల ఏపీలో ప్రధాన పార్టీలు మాత్రం బిజెపి సమయం చూసి జనసేన కు మొండిచేయి చూపిస్తుంది అని జ్యోతిషాలు చెప్పడంమొదలుపెట్టాయి.

ఇదే విషయమై జనసేన పార్టీ కి మరియు వారి అభిమానులకి స్పష్టత వచ్చే సమయం ఆసన్నమయింది. ఇప్పుడు మరో అంశంలో బిజెపి వైసిపి మధ్య ఫ్రెండ్ షిప్ ఏ పాటిదో తేలిపోనుంది. రఘురామకృష్ణరాజు పిటిషన్ స్పీకర్ పరిధిలో ఉన్నప్పటికీ ఆయన కూడా బిజెపి నేత అన్నది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. గతంలో సుమిత్రా మహాజన్ స్పీకర్ గా ఉన్న సమయంలో అప్పట్లో పార్టీ ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి, గీతలపై పిటీషన్లు ఇచ్చినా ఐదేళ్లు పెండింగ్ లోనే ఉంచారు. అప్పుడు బీజేపీ, టీడీపీ స్నేహం ఉండేది కాబట్టి ఇలా జరిగింది అని చాలా మంది వాదన.

ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేస్తే బిజెపి వైసిపి కి దగ్గరగా ఉందనే లెక్క. తాజాగా కృష్ణంరాజు పవన్ కళ్యాణ్ ను విపరీతంగా పొగిడేశారు. అతను కాని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఐదేళ్లలో మార్చేస్తాడని… దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాడని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక తమ రాజకీయ భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన నేతను తమ ప్రత్యర్థి మాట విని వారు అనర్హత వేటు వేస్తే ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఇట్టే అర్థం అయిపోతుంది. మరి బిజెపి పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇస్తుందా లేదా జగన్ ను హ్యాండిల్ చేస్తుందా అన్నది వేచి చూడాలి.

author avatar
arun kanna

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N