NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీహార్ లో బీజేపీకు పొంచి ఉన్న ముప్పు : ఇక తట్ట బుట్ట సర్దుకోవడమేనా?

 

 

ఇదేంటి మొన్ననే కదా ఎన్డీయే కూటమి బీహార్లో ప్రభత్వం ఏర్పాటు చేసింది.. నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది.. ఇంకా సరిగా వారం కూడా కాలేదు అప్పుడే తట్ట బుట్ట సర్దుకోవడం ఏంటీ అనుకుంటున్నారా..? బీజేపీ కు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన నష్టం లేకున్నా భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తోంది. బలమైన నాయకరమ్ లేకపోవడం, ప్రత్యామ్నా రాజకీయ నాయకులను తయారు చేయడంలో వెనుక బడటం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడీ బాధ్యతలు చూస్తున్న తేజస్వియాదవ్ కు బీహార్ ప్రజలు బ్రహ్మరధం పడుతుండటం, ఎటు చిరాగ్ పాశ్వాన్ సైతం దళిత వర్గాలకు ప్రతినిధిగా, యువకుడిగా బీహార్లో ప్రాజెక్ట్ అవడం ఇవన్నీ బీజేపీ భవిష్యత్తును సూచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలను ఇప్పుడే కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. బీహార్లో కాషాయం పార్టీకు వచ్చే కలం ఎంత గడ్డుగా ఉండబోతుంది అనేది తేలియజెబుతున్నాయి.

చిన్న పార్టీలు పుంజుకుంటున్నాయి

ఎన్డీయే కూటమికి బీహార్ ఎన్నికల్లో 37 . 26 శాతం ఓట్లు వచ్చాయి. 125 సీట్లు సాధించి నితీష్ పీఠం మీద కూర్చున్నారు. ప్రత్యర్థి మహాఘట్ బంధన్ కూటమి సాధించిన ఓట్ల శాతం 37 . 13 ఐతే
సాధించిన సీట్లు 110 . బలమైన ప్రత్యర్థిగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయాల కంటే ఈ రెండు కూటములు కాకుండా ఇతర చిన్న చితక పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల శాతం 25 . గెలుపు విషయాలు పక్కన పెడితే బీహార్లో ఇతర స్థానిక పార్టీలు క్రమంగా బలం పుంజుకుంటున్నట్లు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తోంది. ఏది జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకు నష్టం చేకూర్చేదే. ఇప్పుడు ఐతే స్థానిక పార్టీలు బలం పుంజుకుంటాయి అప్పుడు కచ్చితంగా జాతీయ పార్టీల మీద ప్రజలకు పెద్ద ఆసక్తి ఉండదు.

ఆర్జేడీ దూసుకువస్తుంది

రాష్ట్రీయ జనతాదళ్ కు తేజస్వి బలం ఇప్పుడు కొత్త ఉరకలు వేయిస్తుంది . గత ఎన్నికల్లో బీజేపీకు , ఆర్జేడీకి మధ్య సీట్ల మధ్య వ్యత్యాసం ఉండొచ్చు గాని ఓట్ల శాతం వచ్చేసరికి ఇద్దరికి దాదాపు సరిసమానంగా ఓట్లు వచ్చాయి. బీజేపీ, ఆర్జేడీ మధ్య కేవలం 13 వేళా ఓట్ల తేడా మాత్రమే ఉంది. అంటే ప్రజల మద్దతు విషయంలో ఇరు పార్టీలు సరిసమానంగా పోటీ పడ్డాయి. అయితే కొన్ని చోట్ల ఎక్కువ మెజార్టీ, మరి కొన్ని చిట్ల తక్కువ మెజార్టీ లో సీట్లు ప్రభావితమై ఉండొచ్చు కానీ ఓట్ల విషయంలో ఆర్జేడీ బీజేపీ దగ్గర వరకు వచ్చింది. దీనికి తేజస్విని ప్రజలు బలంగా నమ్మడం, ఒక ఎత్తు ఐతే , చిన్న పార్టీలు , స్థానిక అంశాలను ప్రజలు నమ్ముతున్నారు.

నితీష్ పార్టీ భవిత ఏంటీ

ఎన్డీయే కూటమి లో కీలకంగా, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ భవితవ్యం ఏమిటి అనేది అంతుపట్టకుండా ఉంది. ఇప్పటికే నితీష్ వచ్చే ఎన్నికల్లో తానూ పోటీ చేయనని ప్రకటించారు. మరోపక్క ఆ పార్టీ బలం తగ్గుతోంది. మరి ఆ పార్టీను ఎవరు నడిపిస్తారు. నడిపించే సత్తా ఉన్న నేతలు ఎవరు అనేది అంతుపట్టటడం లేదు. దింతో 74 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయినా బీజేపీ వచ్చే సారి నితీష్ పార్టీను నమ్ముకుంటే తన గోతిలో తానె పడ్డట్లుగా భావించాలి. జోరు మీద ఉన్న ఆర్జేడీను నిలువరించాలంటే తనకు అక్కరకు వచ్చే అగ్రవర్ణ, బీసీ ఓటర్లతో పటు మరికొందరిని కూడా గట్టాలి.

 

బీజేపీకి ఎక్కడ యువ నాయకత్వం ?

బీహార్లో బీజేపీకు యువ నాయకత్వం లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క 32 ఏళ్ల తేజస్వి అన్నింట్లో ముందుంటే మరో మక్కా ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన రాంవిలాస్ పాశ్వాన్ కొడుగు చిరాగ్ సైతం రాజకీయ క్షేత్రం తన సత్తా చూపాడు. ఏకంగా 15 నుంచి 20 స్థానాల్లో నితీష్ పార్టీను దెబ్బ కొట్టడంలో బాగా పనిచేసాడు. భారీగా ఓట్లను చీల్చాడు. ఐతే వీరిని దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్త నాయకత్వం, యువ నాయకత్వం వైపు ఇప్పుడు ద్రుష్టి పెడుతుంది. బీహార్లో కీలకంగా ఉన్న బీజేపీ నేత సుశీల్ మోడీని అక్కడి నుంచి తప్పించి కేంద్ర బాద్యతల్లోకి తీసుకురావాలని యోచిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా తర్ ప్రసాద్, రేణు దేవిలను కొత్తగా ఉపముఖ్యమంత్రులుగా చేసింది. బీహార్లో అధికంగా ఉన్న బిసి వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు, కొత్త నాయకత్వం తయారు చేసేందుకు ఈ అస్త్రాలు ఎంతవరకు బీజేపీకు పనికి వస్తాయి అనేది వేచి చూడాలి.

author avatar
Special Bureau

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju