NewsOrbit
Featured బిగ్ స్టోరీ

బీజేపీ లెక్కలు మారుతున్నాయా…? ఈ ప్లాన్లు అమలవుతాయా..?

ప్లాన్ – 1 : ఈ ఏడాది చివరన బీహార్ లో ఎన్నికల నాటికి జేడీయుని కలుపుకోవాలి…!
ప్లాన్ – 2 : వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడులో ఎన్నికల నాటికి అన్నా డీఎంకేని చేతుల్లో పెట్టుకోవాలి…!
ప్లాన్ – 3 : పశ్చిమ బెంగాల్ లో మమతా పీఠాన్ని పూర్తిగా లాగేసుకోవాలి…!
ప్లాన్ – 4 : 2023 నాటికి ఎలాగైనా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి…!
ప్లాన్ – 5 : ఏపీలో బలపడాలి. చంద్రబాబు కనుమరుగవ్వాలి. జగన్ తమ చేతల్లో ఉండాలి.

* ఒకటోది సాధ్యమే. అందుకే ధీమాగానే ఉన్నారు. జేడీయూ మొదటి నుండి బీజేపీ కి దోస్తీనే. ఇప్పుడు పెద్ద కష్టం కాబోదు.
* రెండోది సాధ్యమే. తమిళనాడులో జయలలిత లేని లోటు ఆ పార్టీలో ఉంది. అందుకే బీజేపీ పెత్తనం ఆరంభమయింది.
* మూడోది సాధ్యమే. అక్కడ మమతకు వ్యతిరేక గాలులు మొదలయ్యాయి. బీజేపీ పుంజుకుంటుంది. గత లోక్ సభ ఎన్నికల్లో అదే తేలింది.
* నాలుగోది సాధ్యమూ కాదు, అలా అని అసాధ్యమూ కాదు. తీవ్రంగా ప్రయత్నం చేయాలి. అక్కడ కాంగ్రెస్ ఉన్నత కాలం, బీజేపీ పైకి రాదు. బీజేపీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పైకి రాదు. ఈ రెండూ కలవవు కాబట్టి. కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో పడుకున్నా ఓట్లు పడతాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు నుండి జనంలోకెళ్ళి సెంటిమెంటుని గిల్లితే చాలు. అది కేసీఆర్ కి బాగా తెలుసు. రేవంత్ లాంటి వాళ్ళు ఇద్దరో, ముగ్గురో బీజేపీలోకి దూరితే ఏమైనా అవకాశం ఉండే వీలుంది.

 

* ఇక అయిదోది. ఇదే కీలకం. అక్కడే బీజేపీ ముప్పు తిప్పలు పడుతుంది. ఇక్కడ ఆ పార్టీకి బలమైన, స్థిరమైన నాయకుడు లేరు. ప్రజాకర్షణ ఉన్న నాయకులు లేరు. మైకుల ముందు గంటల కొద్దీ మాట్లాడే నేతలకు కొదవ లేదు.., కానీ జనం ముంగిట ఆకట్టుకునేలా స్పీచ్ దంచే, ఓట్లు కురిపించే నాయకుడు లేరు. అందుకే ఆ లోటు తెలియకుండా “పవన్ కళ్యాణ్” అనే నాయకున్ని అద్దెకు తెచ్చుకున్నారు. ఎంతైనా సొంతం, సొంతమే.. అద్దె అద్దెదే కదా…!

* అందుకే పవన్ ఆయన తరహా రాజకీయం చేస్తున్నారు తప్ప బీజేపీ తరహా అలవాటు పడలేదు. బీజేపీ పట్ల అత్యంత భక్తితో ఉన్నారు, కానీ ఆ పార్టీ తరహాలో మత, వర్గ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ఇక బీజేపీకి ఇప్పుడు ఏపీలో పవన్ చాలట్లేదు. ఒక కులానికి పవన్ అనుకున్నా.., ఆ కులానికి కూడా పూర్తిగా పవన్ సరిపోవట్లేదు. అందుకే ఆ ఆ కులాన్నీ ఏకతాటిపైకి తేవాలి. మూకుమ్మడిగా తమతో ఉండేలాగా అన్నమాట”… ఇక ఇంకో కులానికి ఒక నాయకుడు కావాలి. ఆ రెండు కులాలు కలపాలి. వచ్చే ఎన్నికల నాటికి జగన్ కి, ఆయన కులానికి ప్రత్యామ్నాయం తయారవ్వాలి.” ఇదే ఇప్పుడు బీజేపీ లెక్క. పాపం ఈ లెక్కలన్నీ వేసుకుని మొదటి అవసరమైన బీజేపీ అధ్యక్షుడిని ఇంకా ఖరారు చేసుకోలేకపోతుంది. ఒక వ్యవహారం చూద్దామంటే.., ఇంకో వ్యవహారం చుట్టుకుంటున్నాయి.
* ఇవన్నీ పక్కన పెడితే కనీసం రాష్ట్ర కీలక వ్యవహారాల్లో కూడా బీజేపీ ఒక నిర్ణయానికి రాలేక తడబడుతుంది. ఒక్కో నాయకుడూ ఒక్కోలా స్పందిస్తూ మాట్లాడుతున్నారు. కుల ప్రయోజనాలే ముఖ్యంగా.., తమ సొంత అభిప్రాయాలే కీలకమై పార్టీలో వర్గాలు వేర్వేరుగా స్పందిస్తున్నాయి. అందుకే పార్టీ లెక్కలు ఒకలా ఉంటె.. అవి మరోలా అమలవుతున్నాయి. ఇవన్నీ తర్వాత చూద్దాం ముందు రాష్ట్రంలో పెద్ద దిక్కుని చూడలేకపోతున్నారు. అందుకే అనేది దేశానికి బీజేపీ రాజకీయం నేర్పితే… ఏపీ రాజకీయం మాత్రం బిజెపికి పాఠాలు నేర్పుతుంది.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju