బిజెపి-జనసేన పొత్తు ఇక సాగినట్లే…?

ఏపీ రాజకీయాల్లో వైసిపి తర్వాత ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అని తెలిసిందే. అయితే అందరూ చెప్పినట్లు రాజకీయాల్లో ఏనాడూ శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరు. అవసరం…. అవకాశం చూసుకొని మెలిగేవారే ఎక్కువ..! మరి ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇదే పాయింట్ ను మళ్ళీ ప్రూవ్చేయబోతున్నాయా?

 

అంత ఈజీ కాదు….

ప్రస్తుతం పవన్-బీజేపీతో పొత్తు కూడా పైన చెప్పిట్టు గాగే ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లో పొత్తులు, కలిసి ముందుకు సాగడం అనేవి చాలా క్లిష్టమైన అంశాలు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలు కలిసి దశాబ్దం కాలం కొనసాగే పరిస్థితి లేకపోయింది. మహారాష్ట్రలో శివసేన బీజేపీ దశాబ్దాల స్నేహబంధం ఏమయింది? ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. గత ఏడాది ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీల మధ్య స్నేహబంధం ఇప్పుడు ఇక్కడి నుంచే పరిస్థితిలా కనిపిస్తోంది.

తిరుపతి పై లొల్లి…?

నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జేపీ నడ్డా తో భేటీ అయ్యారు. అందరూ పవన్ అక్కడికి వెళ్లి జనసేన పార్టీకి ఉపఎన్నిక టికెట్ సాధించుకొని వస్తారని అనుకున్నారు. బిజెపి జనసేన తో కలిసి పనిచేస్తుంది… ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసుకుంటే జనసేన రాష్ట్రంలో బీజేపీ తో పోలిస్తే జనసేన బలమైన పార్టీ. అదే వీరిద్దరి మధ్య పొత్తుకు మంచిది అని పవన్ బిజెపి హైకమాండ్ ను ఒప్పించి టికెట్ తీసుకు వస్తారని అనుకున్నారు. అయితే అక్కడ ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం అవుతోంది. జనసేన పార్టీ వారికి సంబంధించి బిజెపి పై కారాలు మిరియాలు నూరుతుంది అని అర్థం అవుతోంది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బిజెపి ఏకపక్షంగా తన అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అంతర్గత చర్చల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం సాగేది కాదని విశ్లేషణలు ఊపందుకున్నాయి.

రెండూ కావాలంటే కష్టమే…

ఇది పక్కన పెడితే…. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ పోటీ నుంచి తప్పుకుని బీజేపీకి ప్రచారం చేసి పెడతానని చెప్పారు. ఎన్నికలు ఐదు రోజులు ఉంటే వేళ్ళి ఢిల్లీ లో కూర్చున్నారు. ఎన్నికల ముందు వరకు వస్తారో లేదో కూడా డౌటే. ఇప్పటికే బీజేపీలో అంతర్మథనం మొదలైపోయింది. కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్న పవన్ బిజెపి తరపున ప్రచారానికి వచ్చినా…. కేసీఆర్ ను టార్గెట్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ నుండి తప్పించుకొని సహకరించారు కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక తమకు వదిలేయాలని పవన్ తర్వాత అమిత్ షా తో జరిగే భేటీలో అడుగుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇక అదే జరిగితే రాష్ట్ర బీజేపీకి అది ఏమాత్రం రుచించే విషయం అయితే కాదు.

SHARE