NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏపీలో “బీజేపీ స్టైల్ గేమ్” ఇప్పుడే మొదలయింది..! తిరుపతి ఓటర్లకు సవాలే..!!

Andhra Pradesh ఏపీలో కుర్రాళ్లు ప్రేమ పిపాసులు.., కాస్త మధ్య వయసు వచ్చాక కుల పిపాసులు.., లేటు వయసులో రాజకీయ పిపాసులు.., ఏ వయసులో అయినా సినిమా పిపాసులు ఎక్కువ..! అటువంటి రాష్ట్రంలో మత పిపాసని, మత పిచ్చిని, మత పైత్యాన్ని రగిల్చి.. అగ్గి వెలిగించి తాము చలి కాచుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. మతం ఉంటేనే బీజేపీ ఉంటుంది. మతం కాంక్ష ఉంటేనే బీజేపీకి నాలుగు ఓట్లు పడతాయి, మత ఆలోచన ఉంటేనే BJP ఉనికి ఉంటుంది..!

అందుకే Andhra Pradesh BJP ఏపీలో ఇన్నాళ్లు బీజేపీకి అంత సీన్ లేదు. అటువంటి బీజేపీ ఇప్పుడిప్పుడే ఏపీలో ట్రాక్ ఎక్కుతుంది. ఆ పార్టీకి కావాల్సిన మేత ఫుల్ గా దొరుకుతుంది. ఉనికిని చాటాల్సిన సందర్భాలు వచ్చి పడుతున్నాయ్. అందుకే ఆ నేతలు జీవీఎల్, సునీల్ ధియోధర్, బండి సంజయ్ వరుసగా అదే టాపిక్ పై ప్రెస్ మీట్లు పెడుతున్నారు..! అసలు AP BJP బీజేపీ ట్రాక్ ఏంటి..? వారి వ్యూహం ఎలా అమలు చేయనున్నారు అనేది లోతుగా చూస్తే..!!

bjp should step back in tirupathi by election
bjp should step back in tirupathi by election

బీజేపీ అసలు తత్వం ఇదే..!!

బీజేపీ అనేది పచ్చిగా ఒక మత, హిందూ పార్టీ. ఎవరూ కాదనలేరు. 1989 లో కేవలం రెండే ఎంపీ స్థానాలు ఉన్నా ఆ పార్టీ.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రామజన్మభూమి.. అయోధ్య రామమందిరం సెంటిమెంట్ తో ఉత్తర భారతానా బాగా ఎదిగింది. 1989 లో కేవలం రెండే స్థానాలు ఉండగా.. 1994 నాటికి 80 స్థానాలకు ఎదిగింది. దీనిలోనూ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనే అధిక సీట్లు. అలా అలా దేశం మొత్తం పాకేసింది. మతాన్ని, మత అస్త్రాన్ని విస్తరించింది. అక్కడ ఏ గుడి, ఏ హిందూ విగ్రహం, ఏ వివాదం ఉన్నా వాలిపోయి సెంటిమెంట్ అస్త్రంతో రాజకీయాలు చేస్తూ దగ్గరయింది. ఇదే తరహాలో తెలంగాణాలో కూడా బాగానే ఎదిగింది. ఇక ఏపీలో సమయం వచ్చేసింది. ఏపీ ఒక్కటే బీజేపీకి ఇప్పటి వరకు లొంగని రాష్ట్రంగా ఉంది. ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా జీవన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ఇక్కడ కమలం అంటేనే ఓటర్లు తిప్పి కొడతారు. ఇటువంటి రాష్ట్రంలో కూడా ఇప్పుడు బీజేపీ తమకే సాధ్యమైన అసలు గేమ్ మొదలు పెట్టింది..!

AP BJP ; Planning to Bring Back Venkaiah Naidu

గ్రేటర్ లో ప్లాన్ సేమ్ తిరుపతిలో కూడా..!!

గ్రేటర్ లో ఏం జరిగింది..? ఎంఐఎం హిందువులను తిట్టడం.. బీజేపీ వెళ్లి హిందువులను దువ్వడం..! అంటే సింపుల్ గేమ్ ఆడారు. గెలిచారు. ఏవైనా దెబ్బలు తగిలినప్పుడే కదా నర్సులు, డాక్టర్లు విలువ తెలుస్తుంది..? సో.., గ్రేటర్ లో ఎంఐఎం ద్వారా హిందువులకు దెబ్బ తగిలించి.. బీజేపీ వెళ్లి దువ్వడం ద్వారా బాగానే ఎదిగారు. నిజానికి గ్రేటర్ లో ఇటువంటి స్ట్రాటజీ లేకపోతే బీజేపీకి పది స్థానాలు వరకు మాత్రమే దక్కేవి. అసలు ఆ పార్టీకి ఎన్నికల ప్రచార రాష్ట్రం, కీలక ఆయుధం దొరికేది కాదు. అటువంటి దశలో తాము సులువుగా అల్లుకుపోయి రాజకీయం చేయగలిగిన మత రాష్ట్రాన్ని ఎంఐఎం ద్వారా అక్కడ రగిల్చి బీజేపీ గ్రేటర్ లో పాతుకుపోయింది. అక్కడ టీఆరెస్ పాపాలు, ఎంఐఎం ఇచ్చిన సహకారం, కాంగ్రెస్ నిద్రావస్థ కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. సో.., అక్కడి హిందూ రాజకీయం తరహాలోనే..!

YS Jagan: Can Control Central upto 2024

ఏపీలో సేమ్ గేమ్..! బండి, జీవీఎల్, సునీల్ ద్వారా..!!

ఏపీలో కూడా ఇప్పుడు హిందువులకు దెబ్బలు తగులుతున్నాయి. సో.., ఇక్కడ వారికి మందు రాసె బాధ్యత మాత్రం బీజేపీ తీసుకుంది. తెలంగాణాలో అంటే హిందువులను ఎంఐఎం మానసిక దెబ్బ కొట్టింది. ఇక్కడ ఏపీలో ఎవరు కొడుతున్నారు అంటే..? ఆ మ్యాటర్ కొంచెం కీలకం సున్నితం.. నెమ్మదిగా చెప్పుకుందాం..! కానీ ఎలాగోలా బీజేపీకి డాక్టర్ పాత్ర, నర్సు పాత్ర మాత్రం వచ్చేసింది. హిందువుల మనసులలోకి దూరిపోయి.., మెదడులోకి దూరిపోయి నరనరాన హిందూ పిచ్చి, పైత్యాన్ని రగిల్చేయాలి. ఆ పాత్రని మూడు వారలు కిందట జీవీల్ పోషించారు. “ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి” అన్నారు. జనం పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు బండి సంజయ్ వచ్చి.. “బైబెల్ పార్టీ కావాలో.., భగవద్గీత పార్టీ కావాలో” తేల్చుకోమన్నారు..! సో.., ఇప్పటికే అర్ధమైందిగా ఏపీలో బీజేపీ గేమ్ ఏంటో..? ట్రాక్ ఏంటో..!? అది విజయవంతమై నాలుగు ఓట్లు పడకపోతాయా..? తిరుపతిలో గెలవకపోతామా అనేది బీజేపీ గేమ్..! ఇక్కడ ఇది అమలు జరిగితే.., విజయవంతమైతే ఇబీజేపీ స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. ఒకవేళ బెడిసికొడితే మాత్రం వ్యూహం మారుతుంది..!!

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju