NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

నితీష్ కి వెన్నుపోటు..! బీహార్ లో బీజేపీ మార్కు రాజకీయం..! ఇదిగో సాక్ష్యాలు..!!

చంద్రబాబు అయినా.., జగన్ అయినా… నితీష్ అయినా, కేసీఆర్ అయినా.. ప్రాంతీయ పార్టీలంటే బీజేపీ కాలికి చెప్పులా ఉన్నట్టే లెక్క..! తీసి పడేస్తుంది, మార్చేస్తుంది, చిరాకొస్తే ఇసిరిపడేస్తుంది. అవసరమంటే పొత్తులంటుంది. ఆ పొత్తుల్లో కూడా కత్తులు దాస్తుంది. ఇది బీజేపీ మార్కు రాజకీయం. తాజాగా బీహార్ లో కూడా బీజేపీ మార్కు రాజకీయంతో నితీష్ కి దెబ్బ వేసింది. అందరూ అనుకుంటున్నట్టు అక్కడ ఓడింది ఆర్జేడీ కాదు..!!

అవును. బీహార్ లో ఓడింది ఆర్జేడీ కాదు, వారి బలం వారికి ఉంది. మహా అయితే 2015 లో 80 సీట్లు గెలిస్తే ఇప్పుడు 75 గెలిచారు. అయిదు సీట్లు మాత్రమే కోల్పోయారు. కానీ నితీష్ మాత్రం 2015 లో 71 గెలిచి.., ఇప్పుడు 43 కి పడిపోయారు. అధికార కూటమిలో ఉన్నామనే ఓదార్పు తప్ప నితీష్ కి ఈ ఎన్నిక దారుణ ఓటమి కింద లెక్క. జేడీయూని దెబ్బ వేయడానికి బీజేపీ వేసిన అడుగులు, నితీష్ పై బీజేపీకి ఎందుకు పగ అనేది చూద్దాం..!!

2015 లో పార్టీల వారీగా గెలిచినా స్థానాలు ఇవీ : జేడీయూ : 71 , ఆర్జేడీ : 80 : కాంగ్రెస్ : 27 .., బీజేపీ : 53 …! 2020 లో పార్టీల వారీగా గెలుపు ఇలా.. : 2020 లో ఆర్జేడీ : 75 , బీజేపీ : 74 .., జేడీయూ : 43 .., కాంగ్రెస్ : 19 ..!!

నితీష్ ని బీజేపీ దెబ్బ కొట్టింది ఇలా..!!

గత నెలలో మరణించిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలుసు కదా.., ఆయన కుమారుడు చిరాంగ్ పాశ్వాన్. ఫక్తు బీజేపీ మనిషి. మోడీ భక్తుడు. కానీ బీహార్ లో బీజేపీ కూటమిలో కాకుండా వేరుగా పోటీ చేసారు. చేశారు అనే కంటే చేయించారు అనడం బెటర్. నితీష్ ని పూర్తిగా నమ్మక.., అవసరం ఉంటే చిరాంగ్ తో కలిసి సీఎం కుర్చీ ఎక్కేయొచ్చు అనే ఓ అంతర్గత ఆలోచనతో చిరాంగ్ తో వేరు కుంపటి పెట్టించి, జేడీయూ ఓట్లు చీల్చేలా స్కెచ్ వేసింది బీజేపీ. దాన్ని పక్కాగా అమలు చేసింది. ఫలితమే నితీష్ కి ఈ సీట్లు. దాదాపు 40 స్థానాల్లో జేడీయూ రెండో స్థానంలో ఉండిపోయింది. ఆ ఓట్లుని ఎల్జేపీ చీల్చింది. దళితుల, అల్ప వర్గాల ఓట్లు చాలా చోట్ల చీల్చింది. ఎల్జేపీకి 5 శాతం ఓట్లు వచ్చాయి. జేడీయూ కి 15 శాతం, ఆర్జెడీకి 23 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్క చాలు.., జేడీయూ కి పడిన దెబ్బా తెలుసుకోడానికి..! ఎల్జేపీ ఫలితంగా నితీష్ కి రావాల్సిన సీట్లు రాలేదు.., ఆర్జెడీకి కొంచెం ఎక్కువ స్థానాలే వచ్చినట్టు లెక్క.., బీజేపీ బాగా పెంచుకుంది.

నితీష్ ని బీజేపీ ఎందుకు ముంచాలి..!?

మోడీకి అధికారం వచ్చింది సేవ చేయడానికి.. దేశాన్ని కబ్జా చేసి అధికారంలోకి రావడానికి కాదు. వాళ్ళ ఆటలు ఢిల్లీలో ఆదుకోవాలి. బీహార్ లో కాదు. ఇది వాళ్ళ సొంత అడ్డాలాగా ఫీలవుతున్నారు. మోడీ మరో హిట్లర్ లా ఉన్నారు, ఫాసిజం చేస్తామంటే కుదరదు. ఆయన ఒక దుష్మన్ (దుర్మార్గుడు)..” ఈ మాటలు నితీష్ కుమార్ అన్నవే. ఇలా 2015 ఎన్నికల్లో మోడీ .. నితీష్ ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్సించుకున్నారు.

అంతే కాదు.. మోడీ గుజరాత్ సీఎంగా ఉండగా మోడీ పాలనని వ్యతిరేకించిన ఇతర సీఎంలలో నితీష్ కూడా ఒకరు. అంటే జేడీయూ, బీజేపీ స్నేహం ఏమి పుటిన నుండి లేదు, పోయే వరకు ఉండదు అని కచ్చితమే కదా..! కేవలం ఒకరి అవసరాల కోసం ఒకరు జత కట్టారు. ఈ జతలోనే బీజేపీ పక్కన కత్తి పట్టింది. బీజేపీతో ఎంత స్నేహంగా ఉన్నా… బీజేపీకి, మోడీకి శత్రువులు ఎవరో బాగా తెలుసు, వాళ్ళని ఎలా ముంచాలో కూడా తెలుసు. ఈ విషయం తెలియనిది ఈ నాయకులకే. పాపం 2019 ఎన్నికల్లో చంద్రబాబు తెలుసుకున్నాడు, ఇప్పుడు నితీష్ తెలుసుకున్నాడు..! ఇంకా ఎందరో బీజేపీ చేతిలో బకరాలు..!!

బీహార్ సీఎం ఎవరు..? ఆర్జేడీ సాధించింది ఏమిటి..? ముస్లిం ఓట్లు ఏమయ్యాయి..!? ఇలా బీహార్ ఎన్నికలపై మరిన్ని కథనాలు, విశ్లేషణలు “న్యూస్ ఆర్బిట్” అందిస్తుంది..!

 

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju