NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇది బీజేపీ EGOకి సంబంధించిన మ్యాటర్ – ఆమె ఒక్కత్తే అడ్డం పడుతోంది !

భారతదేశంలో మెజారిటీ భూభాగాన్ని శాసిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన బలాలలో సోషల్ మీడియా ఒకటి. 2014, 2019 ఎన్నికలలో మోడీ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. అయితే గత పదేళ్లుగా పశ్చిమబెంగాల్ తమ జెండా ఎగురవేసేందుకు బిజెపి చేయని ప్రయత్నం లేదు కానీ మమతా బెనర్జీ మాత్రం ఏకగ్రీవంగా బెంగాన్ ను ఏలుతూనే ఉన్నారు. అయితే సారి మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ఉత్సాహాన్ని ఇవ్వగా తమ సోషల్ మీడియా పవర్ తో మమతా బెనర్జీని విపరీతంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టేశారు కమలనాథులు.

 

Cyclone Bulbul: PM Narendra Modi, Home Minister Amit Shah speak to ...

అమిత్ షా ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర నాయకులు సోషల్ మీడియా పై విపరీతంగా దృష్టిపెట్టి ఇప్పటికే తృణముల్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేత్రి మమత బెనర్జీ పై మరియు వారి పార్టీ నాయకులపై రకరకాల పోస్టులతో విమర్శిస్తూనే ఉన్నారు. ఇకపోతే ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు దాదాపు పోటీలో లేనట్లే అని విశ్లేషకుల అంచనా. అందుకు గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెబుతున్నారు. రెండు పార్టీలు మమతతో కలిసే అవకాశం కూడా లేదు. నేపథ్యంలో బీజేపీ తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో పడింది.

మనం ముందు నుంచి మాట్లాడుతున్న సోషల్ మీడియా ద్వారానే బిజెపి తన ప్రచారాన్ని ప్రారంభించగా అసలైన రంగంలోకి కూడా పార్టీ నాయకులను దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపోతే మమతా బెనర్జీ రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, కరోనా సందర్భంగా ఒక వర్గం ప్రజలకు అనుకూలంగా వ్యవహరించిన తీరు బిజెపికి బాగా ఉపయోగపడుతుంది. అయితే మమతాబెనర్జీ ఏమీ తక్కువ తినలేదు. తనదైన శైలిలో ఎప్పటికప్పుడు బిజెపి పార్టీ వారికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ పార్టీని ఒక్కటే ముందుకు నడిపిస్తుంది. ఇదే సమయంలో బెనర్జీ ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ వ్యూహకర్త ను రంగంలోకి దించి బిజెపికి పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ రాకతో బిజెపి ఎన్నికల్లో విజయాన్ని చాలా పర్సనల్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ బీజేపీని విమర్శించినంత ఘాటుగా ఒక్క నాయకుడు గాని నాయకురాలు గాని విమర్శించరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రశాంత్ కిషోర్ రాజకీయ కెరీర్ ప్రారంభించింది బీజేపీతోనే అయితే ఆనతి కాలంలోనే  వారితో తలెత్తిన బేధ భావాలతో విడిపోయి తర్వాత ఆగిపోయాడు. తర్వాత అతనిది ఒక్కరు టచ్ చేయని ప్రస్థానం. అతని అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలో విజయమే. అయితే ప్రశాంత్ కిషోర్ పైన్ కూడా కూడా బిజెపికి పీకలదాకా కోపం ఉంది. ఇక మమతా బెనర్జీ మరియు ప్రశాంత్ కిషోర్ లను ఏకకాలంలో దెబ్బ కొట్టాలంటే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో విజయం సాధించక తప్పదు అప్పుడే బిజెపి ఇగో సంతృప్తి చెందుతుంది.

సోషల్ మీడియా విభాగంలో టీఎంసీ వెనుకబడి ఉన్నా కూడా మమతా మరియు ప్రశాంత్ కిషోర్ కలిసి బిజెపిని కొద్దిగా ఇరకాటం లోనే పెట్టారు. ముక్యంగా మమత బీజేపీ వారి పాలసీలు మరియు వారి సిద్ధాంతాలను, వారి వైఖరిని టార్గెట్ చేస్తూ ప్రజలలో వారి ఇమేజ్ ను ఎండగట్టే కార్యక్రమం చేపడుతున్న సమయంలో నేరుగా మమతా బెనర్జీని టార్గెట్ చేస్తే తప్పించి ఆమె పార్టీ నేతలపై విరుచుకుపడినా ఏమి లాభం లేదని మోదీషా లకు తెలిసి వచ్చింది. దీనితో మమతా బెనర్జీని ప్రజల్లో బ్యాడ్ చేసేందుకు కావాల్సిన అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కమలనాథులు ఇక ఆమెకు ఉన్న ఇమేజ్ ను తగ్గించి మరియు ఆమెలోని లోపాలను, పాలనలోని లోటుపాట్లను ఎత్తి చూపితే బీజేపీ విజయం పెద్ద కష్టం కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!