NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP Party : ఒక్క ఆలోచన చాలు..! బీజేపీకి గట్టి గండాలే పొంచి ఉన్నాయ్..!? ఈ ఐదూ కీలకం..!!

BJP Party : Big Political issues inside

BJP Party : రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాష్ట్రాలు అప్రమత్తమవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు అప్రమత్తమవుతాయి.. ఆయా నాయకులూ సిద్ధమవుతారు. ఆ పోటీ దారులు కంగారు పడతారు. కానీ… దేశంలో మార్చి 27 నుండి మే వరకు 5 రాష్ట్రాల్లో (కేరళ , అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎన్నడూ లేని విధంగా బీజేపీ కంగారు పడుతుంది. రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్రం నుండి విద్యార్థులు కంగారు పడుతున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ – అమిత్ షాల ద్వయం అతి పెద్ద పరీక్ష రాయబోతుంది.

BJP Party : Big Political issues inside
BJP Party Big Political issues inside

BJP Party : జమిలికి ఇదే సెమి ఫైనల్..!?

2022 చివరి నాటికి దేశం మొత్తం మీద “ఒకే దేశం – ఒకే ఎన్నిక(జమిలి)” నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే చెప్పేసింది. లా కమీషన్ కూడా దీనిపై కసరత్తు చేసింది. ఏదో పెద్ద అవాంతరం వస్తే తప్ప… 2022 నవంబర్ నాటికి జమిలి జరగడం తథ్యమే..! అంటే మరో ఏడాదిన్నర మాత్రమే దేశంలో టైం ఉంది. ఈ కేంద్రానికి సమయం ఉంది. వరుసగా రెండుసార్లు గెలిచి.. కేంద్రంలో కుర్చీ ఎక్కిన బీజేపీకి వరుసగా మూడోసారి ఎక్కాలని ఉంది. నిజానికి ఇప్పుడు బీజేపీ ఉన్న బలం చూస్తుంటే.. అది అంత పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తుంది. కానీ… ఎన్నిక అంటే ఎన్నికే..! ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఓటరు దేవుళ్ళు సడెన్ గా మనసు ఎందుకు మార్చుకుంటారో తెలియదు..! ఏమో ఆకస్మికంగా దేశం మొత్తం కాంగ్రస్ వైపు తిరిగిపోవచ్చు.
* పెట్రోల్ ధరలు – గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ బీజేపీ మాటలు తప్ప చేతల్లో చూపడం లేదు. కాంగ్రెస్ మేలు అని జనం ఆలోచిస్తే…?

BJP Party : Big Political issues inside
BJP Party Big Political issues inside

* ఈ బీజేపీ వచ్చాక మాటలు తప్ప పనుల్లో ఏమి ఫలితం లేదు. నల్లధనం తేలేదు, అవినీతిని బయటపెట్టలేదు. పైగా కార్పొరేట్ చేతుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. అని జనం ఆలోచిస్తే..?
* బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక ముకేశ్ అంబానీ సంపద 140 శాతం పెరిగింది.. అదని సంపద 230 శాతం పెరిగింది.. దీనికి మోడీ అనుసరిస్తున్న విధానమే కారణం. ఈ వ్యవధిలో పేదోడికి ఏమి ఒనగూరలేదు.. అని జనం ఆలోచిస్తే..?
* కాంగ్రెస్ పాపం పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. రాహుల్ గాంధీ కష్టపడుతున్నారు. సోనియాకి ఈ వయసులో కష్టం ఎదుకు… ఓ సారి మళ్ళీ ఛాన్స్ ఇద్దాం అని జనం ఆలోచిస్తే..!?
* బీజేపీ అధికారంలోకి వచ్చాక బ్యాంకు స్కాములు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒక్కోటీ ఎత్తేస్తున్నారు. కేంద్ర చేతిలోని బ్యాంకులు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఏమో.. ఓ సారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇస్తే బాగు చేస్తారేమో..!? అని జనంలో ఆలోచన మొదలైతే..!?

BJP Party : Big Political issues inside
BJP Party Big Political issues inside

జనం అంటే నాడి. జననాడి ఈజీగా పట్టుకోలేం. బీజేపీకి ఉన్న అర్ధ, అంగ బలం కాంగ్రెస్ కి లేకపోవచ్చు. మోడీకి ఉన్న చరిష్మా రాహుల్ గాంధీకి లేకపోవచ్చు. అమిత్ షాకి ఉన్న కన్నింగ్నెస్ సోనియాకి లేకపోవచ్చు. కానీ.. జనానికి ఇవన్నీ తెలుసు. ఓటెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత చరిష్మా/ కన్నింగ్ / అర్ధ, అంగ బలం కూడా పని చేయవు. అందుకే ఇది బీజేపీకి పరీక్ష. ఈ అయిదు రాష్ట్రాల్లో (కేరళ , అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి).. సో.. ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం. బీజేపీపై జనం ఆలోచనలకూ ఈ ఎన్నికలు ప్రతిబింబాలు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్.., డీఎంకేలతో బీజేపీ తలపడుతుంది. కేరళలో వామపక్షాన్ని కొట్టడం అంత తేలిక కాదు..!! అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తేనే మోడీ – అమిత్ షా పాసైనట్టు. లేకపోతే జమిలి పరీక్ష కూడా అనుమానమే..!!

 

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?