NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ ప్లాన్స్ అదరహో..! ప్రాంతీయ పార్టీల గతేమికానూ..??

 

ప్రస్తుతం దేశంలో మోడీ, షా ద్వయానికి తిరుగులేదా? వారి పాచికలకు ఎదురులేదా? వారు తలుచుకుంటే ఏదయినా సాధించగలరా? ప్రాంతీయ పార్టీలను అవసరానికి ఉపయోగించుకోగలరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా బీజేపీకి మెజారిటీ మార్క్ తో గానీ, ఓట్లు, సీట్లతో గానీ పని లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మోడీ, షా చాణిక్యతను తట్టుకునే వారు ప్రస్తుతం లేరు. కర్ణాటక, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను సాగనంపి అధికార పీఠాన్ని ఎలా కైవసం చేసుకున్నారో చెప్పాల్సిన పనిలేదు.

Modi amit shah file photo

 

పార్లమెంట్ లో సంఖ్యా పరంగా బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉన్నా రాజ్యసభ విషయానికి వచ్చే సరికి మెజారిటీ లేదు. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో బీజేపీకి ఉన్నది 85 మందే. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఉంది కేవలం 40మందే. ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకున్నా మెజారిటీ మార్క్ కు 12సీట్లు తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోడం మోడీ, షా మార్క్ రాజకీయ చాణిక్యతకు నిదర్శనం.

ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తిరుగులేదని స్పష్టమైందట. మోడీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరగలేదు. కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మోడీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సమర్ధవంతమైన ప్రతిపక్షం లేక పోవడంతో ప్రధాని మోడీ తిరుగులేని హవాను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో మోడీ, షా ద్వయం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రాజ్యసభలో మెజారిటీ వచ్చే వరకు ప్రాంతీయ పార్టీలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఆ తరువాత బీజేపీ తన అట ఆడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇటీవల కాలంలో జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీకి ఎదురు దెబ్బలు తగలడంతో బీహార్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా బీజేపీ.. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించింది. తమ పార్టీకి చెందిన అభ్యర్థినే సిఎం అభ్యర్థి గా ప్రకటించాలని అమిత్ షా కు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఆర్జేడీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే అక్కడ సొంతంగా బీజేపీ బలం పెరుగుతుందన్న ఆలోచనతోనే వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ ను సిఎం అభ్యర్థిగా ప్రకటించారని టాక్. అక్కడ ఆర్జేడీ సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉంటే ఆ పార్టీలోని ముఖ్యులతో పాటు యాదవ సామజిక వర్గం కమలదళంలో చేరతారని షా ఆలోచనగా చెబుతున్నారు. బీహార్ లో నితీష్ కుమార్ తరువాత జేడీయూను, లాలు ప్రసాద్ యాదవ్ తరువాత ఆర్జేడీ లను నడిపించే వారు ఉండరని, ఆ రెండు పార్టీల నుండి వచ్చే నాయకులతో బీజేపీ మరింత స్ట్రాంగ్ అవ్వవచ్చని లెక్కలు వేస్తుంది బీజేపీ.

అదే మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ఏపీలో టీడీపీని మరింత బలహీన పర్చేందుకు సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించారు. తెలంగాణ లోనూ పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అదే మాదిరిగా ఒడిశాలోనూ అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నది. ప్రస్తుతం అక్కడ మంచి ప్రజాదరణ కల్గి ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నప్పటికీ గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని తోసి రాజని ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఇప్పటికే వయోభారంతో ఉన్న నవీన్ పట్నాయక్ తరువాత ఆ పార్టీలో ఆయనంత ప్రజాదరణ ఉన్న నాయకులు లేరు. ఇక్కడ ముందస్తు వ్యూహంలో భాగంగా బీజేడీలో కీలక నేత జై జయంత్ పాండాను బీజేపీలో చేర్చుకొని రాజ్యసభ సీటు ఇచ్చింది. అక్కడ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేడీని చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలని యోచిస్తోంది బీజేపీ. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అస్థిరపర్చి ఎదగాలని చూస్తున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయో? లేదో? వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !