బిజెపి స్ట్రాటెజీ అదిరింది..! ఆత్మ రక్షణలో కేసీఆర్?

హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల మంట రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలకు హడావుడి చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు అతన్ని బాగా ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో కెసిఆర్ అతి జాగ్రత్తగా వ్యవహరించి తప్పులు చేస్తున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి…

 

అతని చేత్తో అతని కన్నే…

మామూలుగా కేసీఆర్ ప్రత్యర్థి పై అంతుచిక్కని వ్యూహాలతో చెలరేగిపోయే రాజకీయవేత్తగా మంచి పేరున్న నాయకుడు. ఇక ఇప్పటి వరకు సరైన ప్రత్యర్థి లేక కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలేశాడు. కానీ గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఫలితం మొన్నటి దుబ్బాక ఎన్నికల ఫలితం అతనిని తన స్ట్రాటజీ పైపు పునరాలోచించేలా చేసింది. తన సొంత అజెండాతో రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ స్ట్రాటజీ ని అతని ప్రయోగించేందుకు రాజకీయ పార్టీలు ఎంతో కసరత్తు చేస్తున్నాయి. ఇక దాని ఫలితం దుబ్బాక రిజల్ట్ కాగా… ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకేళ్ళేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఆత్మ రక్షణలో తండ్రీకొడుకులు

ప్రస్తుతం బీజేపీ వ్యూహకర్తలు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. కేసీఆర్ రాజకీయం లో ఎప్పుడు తనదే పైచేయి ఉండేలా చూసుకుంటాడు. అయితే బిజెపి మాత్రం కేసీఆర్ రూట్ లోనే ప్రయాణిస్తూ భావోద్వేగంతో అజెండాను ఫిక్స్ చేసేసింది. ఎప్పటికప్పుడు అంశాలను ప్రస్తావిస్తూ దానిపై తప్పనిసరిగా కేసీఆర్ స్పందించాల్సిన పరిస్థితి తీసుకు వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మొన్న జరిగిన దుబ్బాకలో చూసినట్లయితే కేటీఆర్ మాట్లాడిన మాటలకు బిజెపి నేతలు కౌంటర్ ఇవ్వడం లేదు. కమలనాథుల స్టేట్ మెంట్ లతో విరుచుకుపడుతూ ఉంటే దానికి సమాధానం ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు కేసీఆర్, అతని కుమారుడు కేటీఆర్.

సొంత అజెండా ఎప్పటికో…

ఇలా చేయడం వల్ల ప్రత్యర్థులని చూసి టీఆరెస్ వారు భయపడుతున్నారు అన్న భావన ప్రజల్లో పెరుగుతుంది కానీ కేసీఆర్ కు తన గెలుపుపై ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉందని ఏ కోశానా అనిపించదు. ఎన్నికల అజెండా, ప్రచారం అజెండా మొత్తం బిజెపి తనకు కోరినట్లు నడిపిస్తున్నది అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మతం కావాలంటే మతం… ప్రాంతీయత… ఏదీ కాకపోతే అభివ్రుద్ధి… తమకు కావలసినట్టు చక్ర< తిప్పుతున్నారు.

ఈ విషయాన్ని కేసీఆర్ గమనించకపోవడం పెద్ద డేంజర్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి బిజెపి ముందంజలో ఉంది అని అంచనాలు వేస్తున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల ముందు ప్రక్రియ ఎలా జరగాలో డిసైడ్ చేసే పరిస్థితిని కేసీఆర్ ఎప్పుడు సాధిస్తారో వేచి చూడాలి….