NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికలకు ముందు కేసీఆర్ వలలో పడ్డ బిజెపి…! అంతా ఫెడరల్ ఫ్రంట్ పుణ్యమే….

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు టిఆర్ఎస్ జోరుగా చేస్తున్న ప్రచారం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్క దుబ్బాకలో ఓడినంత మాత్రాన మరీ ఇంతలా దూకుడు ప్రదర్శించాలా అని నోరెళ్లబెడుతున్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ తగ్గే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగా కెసిఆర్ మరొక కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్నాడు…

 

 

అప్పుడు తెలియలేదు ఇది ప్లాన్ అని

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కేంద్రంలో బీజేపీ కి మెజారిటీ తగ్గించి తన ఉనికిని చాటాలన్న కేసీఆర్ ఆలోచనను ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారు. అసలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నాడు అంటూ ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలను శాసించాలని ఇలాంటి సమయంలో ప్లాన్ చేయడం ఏమిటి అని అన్నారు. కానీ కేంద్రంలో బిజెపి భారీ మెజారిటీ సాధించి కేసీఆర్ కు అతని ఆశలు అంత సులువుగా నెరవేరవని చూపించింది. అయితే అక్కడ ఫలితం కెసిఆర్ ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు

ఎదురెళ్ళడమే మెయిన్ అజెండా

కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు తెలంగాణలో పరిస్థితులు చక్కబెట్టి కొడుకును ముఖ్యమంత్రి కుర్చీలో కోర్చోబెట్టిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తాడు అని అంతా అనుకున్నారు కానీ అంత దూకుడుగా వ్యవహరించేంత తెలివితక్కువ వాడు కాదని కొందరి నమ్మకం. అయితే కేసీఆర్ చేసిన పని వెనకాల ఒక భారీ వ్యూహం ఉందని గ్రహించలేకపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు…. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూసి పార్టీ శ్రేణులు కంగారు పడ్డాయి. బీజేపీ ఇక్కడ కూడా పాగా వేస్తుందని భయపడ్డారు… కానీ కేసీఆర్ మాత్రం వారికి ఎదురు వెళ్లి మీరు నా రాష్ట్రంలో దెబ్బతీస్తే నేను ఏకంగా కేంద్రంలోని మీకు సవాల్ విసురుతాను అని ప్రకటించాడు. ఆ దూకుడు స్వభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితం రాబట్టింది అని విశ్లేషకులు చెబుతున్నారు.

ముందు రాష్ట్రం తర్వాతే ఏదైనా…?

ఇప్పుడు ఈ విషయం మళ్లీ తెర మీదికి ఎందుకు వచ్చింది అంటే… కెసిఆర్ మళ్లీ జాతీయ రాజకీయాల్లో శాసించాలని ప్లాన్ చేశారు. కనీసం ఈ రకంగా హింట్లు ఇచ్చారు. బీజేపీ ని ఢీ కొట్టడానికి తాను రెడీ అవుతున్నట్లు సూచనలు ఇచ్చారు. దేశానికి కొత్త దిశ దశ చూపించాల్సిన టైం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కొత్త రాజకీయాలకు ఆవిష్కర్త నేనే అంటూ గతంలో కూడా ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉండాలని ఆయన గతంలోనే చెప్పగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీ పై యుద్ధం ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇక ఇలాంటి వార్త ఒకటి బయటికి వస్తే బీజేపీ శ్రేణులు అప్రమత్తం అవుతాయి. అప్పుడే తేజస్వి సూర్య లాంటివారు హైదరాబాద్ కి వస్తారు.

బిజెపి లో ఉన్న టెన్షన్ ప్రజలకు తెలుస్తుంది. కొంచెం టిఆర్ఎస్ క్యాడర్ ఉత్సాహం చూపితే ఎప్పటిలాగే టీఆర్ఎస్ పార్టీకి భారీగా ఓట్లు పడతాయి. కేసీఆర్ బీజేపీని కొట్టడం కాదు…. తెలంగాణలో తన స్వలాభాన్ని చూసుకోవడానికి ఈ ఎత్తుగడ అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి రెండోసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించినట్లు కొన్ని సూచనలు ఇచ్చిన కేసీఆర్ వ్యూహం ఎంతవరకూ ఫలించిందో తెలుసుకోవాలంటే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాలి….

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju