NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబు “బుగ్గ”న మంత్రి గారి లెక్కల చుక్క..! 

రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇన్ని రోజుల రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే కారణం అని ఎద్దేవా వేస్తున్న సమయంలో కొన్ని లెక్కల చెట్టాలను విప్పారు. ప్రతిపక్షం అడిగే ప్రతీ ప్రశ్న కి తన వద్ద సమాధానం ఉందంటూ బుగ్గన చెప్పిన మాటలను మనం ఒకసారి పరిశీలిస్తే…. 

 

Chandra Babu Left AP in 3.62 lakh crore debt: Buggana Rajendranath ...

వృద్ధిరేటు పై అబద్ధపు ఆరోపణలు….

ముందుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో వృద్ధిరేటు రెండంకెలు ఉండేది చెప్పిన బుగ్గన ప్ర‌స్తుతం సింగిల్ డిజిట్ కే ఆ వృద్ధిరేటు ప‌రిమితం అయింద‌ని టీడీపీ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తోందని చెప్పారు. 2019 నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం ఉందని కానీ మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడుల‌తో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి కొంత మేలని ఆయన అన్నారు. వృద్ధి లెక్క‌లు క‌చ్చితంగా తేలాలంటే.. మూడు సంవ‌త్స‌రాలు ఆగాలని ఈ లోపలే తెదేపా వారు నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

తలసరి ఆదాయం లోనూ మేమే గ్రేటు

తలసరి ఆదాయం సంగతికి వస్తే…. 2016 – 17లో రాష్ట్రంలో త‌ల‌స‌రి ఆదాయం రూ.1,20,676 కాగా 2017 -18కి వ‌చ్చేస‌రికి రూ.1,39,000 ( అంచ‌నా), 2018-19కి వ‌చ్చేస‌రికి రూ. 1,51,000 (అంచ‌నా), 2019 – 20 వ‌చ్చేస‌రికి రూ. 1,66,000 (అంచ‌నా). అంటే ప్ర‌తి సంవ‌త్స‌రం త‌ల‌స‌రి ఆదాయం పెరుగుతోంది కానీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స‌రైన లెక్క‌లు వచ్చేసరికి ఇంకా స‌మ‌యం ఉన్నా కూడా ఈ అంచనాను కాదని తలసరి ఆదాయం తగ్గిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించాడు.

ద్రవ్యోల్బణం, మానవాభివృద్ధి సూచిక, రెవిస్యూ రాబడులు తగ్గాయనుకో…

.”AP  ద్ర‌వ్యోల్బ‌ణం  6 .5  శాతం పెరిగింది అని   మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల ఏ విధంగా చెబుతున్నారు? దేశ స‌గ‌టు తీసుకున్నా .. మ‌న రాష్ట్రంలోనే ద్ర‌వ్యోల్బ‌ణం త‌క్కువ ఉంది. ” అన్నారు బుగ్గన (ధ‌ర‌ల పెరుగుద‌ల‌నే ద్ర‌వ్యోల్బ‌ణం అని వ్య‌వ‌హరిస్తుంటారు). 

“మానవాభివృద్ధి సూచిక‌లో రాష్ట్రం 27వ స్థానానికి ప‌డిపోయింద‌ని చెబుతున్నారు. 2019 – 20 మాన‌వాభివృద్ధి సూచిక‌కు సంభంధించిన లెక్క‌లు ఇంకా తేల్చ‌లేదు. అయినా రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోంద‌ని.. అంటున్నారు. కావాల్సిగానే త‌ప్పుడు లెక్క‌లు చెబుతున్నారు టీడీపీ నాయ‌కులు,” అని విమర్శించారు ఏపీఆర్థిక మంత్రి.

రెవిస్యూ రాబడుల విషయనికి బస్తే 5 సంవ‌త్స‌రాలు ఆర్థిక శాఖ మంత్రిగా ప‌ని చేసిన వ్యక్తి ఇన్ని అబ‌ద్దాలు ఆడ‌తార‌ని అస‌లు ఊహించ‌లేదు అన్న బుగ్గన.2018 – 19లో 1, 14,670 కోట్లు రెవెన్యూ రాబడి  వ‌చ్చింది, 2019 – 20 వ‌చ్చేస‌రి రూ. 1,10,870 కోట్ల రాబ‌డి సాధించాం. 

తగ్గింది కేవ‌లం రూ. 3,799 కోట్లు మాత్ర‌మే(2.5 శాతం). మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల చెప్పిన‌ట్లు 38 శాతం మాత్రం కాదు. త‌గ్గుద‌ల కేవ‌లం 2.5 శాతమే నట. 

రెవెన్యూ, మూల ధన వ్య‌యం నష్టానికి బాధ్యులు టీడీపి నే…. 

రెవెన్యూ వ్యయం రూ. 8,949 కోట్లు( 6.96 శాతం) పెరిగింద‌ని మ‌రో ఆరోప‌ణ చేస్తున్నారు కానీ చంద్ర‌బాబు ప‌రిపాల‌న చివ‌రి సంవ‌త్స‌రం 2018 – 19లో రూ.1,28,569 కోట్ల రెవెన్యూ రాబ‌డి ఉంటే.. ఖ‌ర్చు మాత్రం రూ. 1,37,518 కోట్లు ఖ‌ర్చు చేశారు. అంటే రూ. 8,948 కోట్లు ఎక్క‌వ వ్య‌యం చేశారు.  మరి బాబు హయాములో రెవెన్యూ రాబడి కంటే ఖర్చు పెరిగింది కదా.. ఇక్కడ మామీద పడి ఏడిస్తే ఏమి వస్తుందన్నది బుగ్గన్న మాట. ఇక మూల‌ధ‌న వ్య‌యం వివరానికి వస్తే అది 35 శాతం ప‌డిపోయిన మాట వాస్త‌వ‌మే. టీడీపీ ప్ర‌భుత్వం విచ్చ‌ల‌విడిగా అవినీతి చేసి.. మూలధ‌న వ్య‌యం పెంచింది. దీని కోసం రాజ‌ధాని పేరుతో పెద్ద‌పెద్ద బిల్డింగుల పేరు చెప్పి ఇష్టారీతిన ఖ‌ర్చు చేశారు అని బుగ్గన ఎద్దేవా వేశారు.

అది వాస్తవమే కానీ ఇది మాత్రం పచ్చి అబద్ధం….

వ్యయం తగ్గింది అని తెగ గింజుకుంటున్నారే మన టీడీపీ వాళ్లు…. మరి పరిశీలిస్తే 2018 – 19లో రూ. 1,63,690 కోట్లు ఖ‌ర్చు పెడితే.. 2019 – 20 సంవ‌త్స‌రంలో రూ. 1,74,757 కోట్లు ఖ‌ర్చు చేశాం. అంటే టీడీపీ పాల‌న‌లో కంటే రూ. 11 వేల కోట్లు ఎక్కువ ఖ‌ర్చు చేశాం. మ‌రి వ్య‌యం ఎక్క‌డ త‌గ్గిన‌ట్లు ? – బుగ్గన ప్రశ్న. రెవెన్యూ లోటు, ద్ర‌వ్య‌ లోటు ఉన్న‌ది వాస్త‌వ‌మే అయితే రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రూ. 20 వేల కోట్ల అప్పు డిస్కంలు, పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేషన్ ల‌పై పెట్టారు బాబు .  పాత బ‌కాయిలు క‌ట్ట‌డానికే చాలా వ‌ర‌కు ఖ‌ర్చు చేశాం. మ‌రి ద్ర‌వ్య‌ లోటు పెర‌గ‌కుండా ఎలా ఉంటుంది? – మరలా బుగ్గన సూటి ప్రశ్న

ఇదిగో అసలైన అంశం పై వివరణ 

ప‌న్నుల ద్వారా రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం రూ. 67వేల కోట్లు మాత్ర‌మే అని య‌న‌మ‌ల చెబుతున్నారు. అది కూడా త‌ప్పే. వివిధ ప‌న్నుల ద్వారా రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం రూ. 62,473 కోట్లు, కేంద్రం వాటా రూ.52 వేల కోట్లు క‌లుపుకుంటే రూ. 1,14,772 కోట్లు వ‌స్తోంది. ఇదే ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయం. 

రోశయ్య-కిరణ్ ఒకవైపు…. బాబు మరో వైపు 

“అప్పు స్థూల నిష్పత్తి విషయంలో ఈ దశాబ్దంలో రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల పనితీరు చూస్తే ఉమ్మ‌డి రాష్ట్రం 1994 – 95 లో  బాబు కుముందు… అప్పు: స్థూల ఉత్ప‌త్తి నిష్ప‌త్తి తీసుకుంటే.. 18 .5 శాతం ఉండేది. 

చంద్ర‌బాబు నాయుడు 1995 నుంచి  2004 దాకా  9  ఏళ్ళు పాలించి  దిగిపోయేనాటికి  అప్పు: స్థూల ఉత్ప‌త్తి నిష్ప‌త్తి ని 31 శాతానికి తీసుకెళ్లారు. 

తరువాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు  YS రోశయ్య కిరణ్ రెడ్డి లు కలిపి  2004 నుంచి 2014 వ‌ర‌కు ఈ  అప్పు: స్థూల ఉత్ప‌త్తి నిష్ప‌త్తి  ని 22 శాతానికి త‌గ్గించారు. 

మరలా, 2014లో చంద్ర‌బాబు నాయుడు సీఎం అయిన త‌రువాత ఈ నిష్ప‌త్తిని 28 శాతానికి పెంచారు. విప‌రీత‌మైన అప్పులు చేసింది చంద్ర‌బాబు నాయుడే. ఈ అప్పుల నుంచి ఒక‌టే సంవ‌త్స‌రంలో బ‌య‌ట ప‌డ‌లేం. అందుకే ఆదాయం పెంపు మార్గాల‌ను అన్వేషిస్తున్నాం.”

టీడీపి vs  వైసీపీ

  •  “బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం 2018-19లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రూ. 5,680 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింది. జగన్ ప్రభుత్వం 2019-20లో రూ.21,911 కోట్లు ఖ‌ర్చు చేశాం. 4 రెట్లు ఎక్క‌వ వెనుక‌బడిన వ‌ర్గాల కోసం ఖ‌ర్చు చేశాం.
  • 2018-19లో రూ. 11,766 కోట్లు మీరు ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ కోసం ఖ‌ర్చు చేస్తే.. 2019-20లో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం రూ. 13,815 కోట్లు ఖ‌ర్చు చేశాం. రూ. 2వేల కోట్లు అధికంగా ఖ‌ర్చు చేస్తే.. ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు త‌గ్గించారు అని లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
  • 2018 – 19 ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌హిళాశిశు సంక్షేమం కోసం రూ. 1,998 కోట్లు ఖ‌ర్చు పెడితే.. 2019-20లో రూ. 2,491 కోట్లు ఖర్చు చేశాం. అంటే రూ. 500 కోట్లు అధికంగా ఖ‌ర్చు చేశాం.
  • టీడీపీ పాల‌న‌లో కాపుల అభ్యున్న‌తి కోసం ఐదు సంవ‌త్స‌రాల‌కు గాను రూ. 3,150 కోట్లు కేటాయిస్తే.. ఖ‌ర్చు చేసింది… కేవ‌లం రూ. 2 వేల‌కోట్లు. 
  • కాపుల ఆర్థికాభివృద్ధి కోసం…. కాపులకు చంద్రబాబు ఐదేళ్ల హయాంలో రూ.3,150 కోట్లు కేటాయించి, ఖర్చు చేసింది మాత్రం రూ.2000 కోట్లే. 
  • మా ప్రభుత్వం గత 13 నెలల్లో కాపులకు రూ.2,800 కోట్లు వ్యయం చేసింది. 
  • టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఆరోగ్య‌శ్రీ పెండింగ్ బిల్లు సంవ‌త్స‌రం వ‌ర‌కు చెల్లించేవారు కాదు. ఇప్పుడు 15 రోజుల్లోనే ఇస్తున్నాం అన్నారు బుగ్గన.

author avatar
arun kanna

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk