NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan : గంటా వేసిన స్కెచ్ కు పవన్ దగ్గర సమాధానం ఉందా…?

Pawan Kalyan :  టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రాజీనామా చేసి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అసలు అతని ప్లాన్ ఏమిటో ఎవరికీ అర్థం కాని సమయంలో ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అతను టార్గెట్ చేయడం విశేషం.

 

can Pawan Kalyan answer Ganta
can Pawan Kalyan answer Ganta

టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బలవంతంగా బరిలోకి లాగుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్కళ్యాణ్ బరిలోకి దిగాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకంగా బిజెపి పార్టీ ని వదిలేసి విడిగా ఆందోళనకు దిగాలని సూచించారు. ఒక్క పవన్ కళ్యాణ్ నే కాకుండా సినీ పరిశ్రమ మొత్తం బరిలోకి దిగాలని అన్నారు. అయితే సినీ పరిశ్రమ కేవలం ముసుగు అనిఅతను మాత్రం నేరుగా పవన్కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.

విషయం ఏమిటంటే…. కేంద్ర ప్రభుత్వం జగన్ దగ్గర నుండి లేఖ వచ్చిన తర్వాత కూడా విశాఖ ప్రైవేటీకరణ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు కానీ రిక్తహస్తాల తోనే వెనుదిరిగారు. అయితే ఒక్కసారిగా ఇదే అదను అన్నట్లు గంటా శ్రీనివాసరావు ఇటు బిజెపి అటు పవన్ కళ్యాణ్ కి తన అస్త్రాలు ఎక్కుపెట్టారు. పైగా తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అతని వ్యాఖ్యలకు ఇంకాస్త విలువ ఉంటుంది. పైగా పార్టీ లైన్ ను కాదని చంద్రబాబు నాయుడు ఆదేశాలను కూడా దిక్కరించి మరీ గంటా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటిదాకా అంతా వ్యక్తిగతంగా ఉంది కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం అతను ఖచ్చితంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేయడం చూస్తుంటే అతని వెనుక ఏదో బలమైన పార్టీ అజెండా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి అయితే బిజెపి నేతలు కానీ లేకపోతే మిత్రపక్షం జనసేన కానీ అతని మాటల పై స్పందించలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి సహకరించలేక, బహిరంగంగా వ్యతిరేకించలేక బిజెపిజనసేన లీడర్లు అవస్థలు పడుతుంటే మధ్యలో గంటా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వారి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. దీని వెనుక అధికార పార్టీ ఉందా లేదా టీడీపీ డబుల్ గేమ్ ఆడుతుందా అన్న విషయం పక్కన పెడితే ఇప్పటివరకు పవన్ ఒక్కసారి కూడా రోడ్డు మీదకు వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ కి మద్దతు ఇవ్వలేదు. అప్పుడు టీడీపీతో…. ఇపుడు బీజేపీ చేరటం వల్ల పాపం పవన్ ప్రశ్నించటమే మరచిపోయారు అన్న విమర్శలకు అతని దగ్గర సమాధానం ఉందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!