NewsOrbit
బిగ్ స్టోరీ

కంట్రోల్ తప్పిపోయిన కరోనా… ఇలా అయితే ఎప్పటికీ బయటకి రాలేము!  

మొన్నటి వరకు ప్రతిరోజు భారతదేశంలో అటు ఇటుగా ఒక 1500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. కానీ ఇప్పుడు అనూహ్యంగా రోజుకి 2000 దాకా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం కేంద్ర ప్రభుత్వానికిమింగుడుపడడం లేదు. వరుసబెట్టి ఎంతో రిస్క్ తీసుకొని లాక్ డౌన్ లు అమలు చేస్తున్నా కూడా మెల్లగా రోజుకి నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2500 దిశగా దూసుకెళుతోంది. ఏ ఒక్క రోజు కూడా కేసులు తగ్గుతున్న దాఖలాలైతేకనిపించడం లేదు. రోజురోజుకి కొత్త రికార్డు నమోదు అవుతూ ప్రజలను భయాందోళనల్లోకి నెడుతోంది

ఇకపోతే ఆదివారం ఒక్కరోజే 2487 కొత్త కేసులు నమోదు కాగా ఒకే రోజులో ఇన్ని కేసులు ఇప్పటివరకు ఎప్పుడూ నమోదు కాలేదు. ఇక పాజిటివ్ కేసులు సంఖ్య 40,000 దాటి మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రికార్డుస్థాయిలో ఆదివారం ఒక్కరోజే 83 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. అయితే 40 రోజుల తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకున్న వారికి నిరాశే మిగిలింది.

కరోనా వైరస్ వ్యాప్తి కాలం 14 రోజులు.. మహా అంటే 28 రోజులు లాక్ డౌన్ కారణంగా దాని వ్యాప్తిని నిరోధించేసినట్లే అని అంతా చంకలు గుద్దుకుంటుంటే చివరికి 40 రోజుల గడిచినా ఆ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రమాద ఘంటికలు విపరీతంగా మోగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ లాంటి రాష్ట్రాలలో పరిస్థితి నిలకడగా ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని కేంద్రం కొన్ని గణాంకాలను చూపిస్తోంది. ఇక దేశంలో పాజిటివ్ కేసులు పది వేల నుండి 20 వేలకు చేరేందుకు తొమ్మిదిరోజులు పట్టగా 20 వేల నుండి 40 వేలకి చేరేందుకు కేవలం 14 రోజులు పట్టింది. దీన్ని విశ్లేషిస్తే 11 రోజుల్లో 20 వేల కేసులు నమోదయ్యాయని అర్థం చేసుకోవచ్చు.

ఇక వీటన్నిటితో పోలిస్తే దేశంలో కరోనా ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం కేరళ. మొదట్లో అత్యధిక పాజిటివ్ కేసుల వరసలో అగ్రస్థానంలో ఉన్న ఈ రాష్ట్రం తర్వాత ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తిని పూర్తిగానిరోధించింది. ఇప్పటికి 500 మందికి మాత్రమే పాజిటివ్ రాగా వారిలో 400 మందికి వైరస్ నయం అయిపోవడం గమనార్హం. కేవలం నాలుగు మరణాలు సంభవించగా ఆదివారం రోజున ఒక్క కేసు కూడా కేరళలో నమోదు కాలేదు

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment