NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పెద్ద స్కామ్ … చిన్న వార్త… తెలుగు మీడియా కుల రాతలు మారవా ?

 

 

ఆంధ్రప్రదేశ్ గడ్డమీద పుట్టిన ప్రజలకు నిజం తెలుసుకునే యోగం లేనట్లే… కుల జాడ్యం పట్టిన మీడియా ఆంధ్ర ప్రదేశ్ మీద భాగం కావడమే ఇక్కడి ప్రజల దౌర్భాగ్యం…. పొద్దున్నే ఎంత మాట అన్నారు ఏంటి అనుకోకండి!!! దేశాన్ని వణికించే అతిపెద్ద బ్యాంకు స్కాం ఆంధ్రప్రదేశ్లో బయటపడితే… దానికి మన కుల మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో తెలుసా!!! మెయిన్ పేపర్లో సింగిల్ కాలం…. అది కనికనిపించని కోణంలో…. వేద్దామా వద్దా అనే సంసయం తో…..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న సారీ సారీ…… దక్కించుకోలేదు చంద్రబాబు ఇచ్చిన బహుమానం. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం లోకి మారిన తర్వాత చంద్రబాబు ఆయన కంపెనీ ట్రాన్స్ ట్రోయ్ కి ఇచ్చిన బహుమానం ఇది. పోలవరం లాంటి బృహత్తర ప్రాజెక్టు కట్టే సామర్ధ్యం ఆ కంపెనీకి ఉందా లేదా అసలు ఆ కంపెనీ పరిస్థితి ఏమిటి అని ఆలోచించకుండా… రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కు చంద్రబాబు పనులు అప్పగించారు. ఏదో తిమ్మిని బమ్మి చేద్దామని పనులు తీసుకున్న ట్రాన్స్ ట్రాయ్ కొన్ని నెలల్లోనే చేతులెత్తేసింది… పోలవరంలో మిగిలేది ఎక్కువే కానీ ఇక్కడ గాలి లెక్కలు చూపించడం అంత తేలిక కాదని కంపెనీ భావించింది. వెంటనే కాంట్రాక్టును సబ్ కాంట్రాక్టర్లు చేస్తూ వివిధ కంపెనీలకు అప్పగించారు. అదంతా వదిలేస్తే…. అంత ప్రఖ్యాత కంపెనీ అయిన ట్రాన్స్ట్రాయ్ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో చిక్కుకుంది.. చిక్కు కోలేదు వారు చేసిన పాపం ఇది…

భారీ మొత్తం 

ఇప్పటివరకు బ్యాంకులను మోసం చేసిన నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా, లలిత్ మోడీల స్కాం కంటే ఇప్పుడు బయటపడినా రాయపాటి స్కాం చాలా పెద్దది. సుమారు 79.26 బిలయన్ డాలర్లు అంటే సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ రాయపాటి సాంబశివరావు కంపెనీ లో తప్పులు జరిగాయి. తప్పులు అనేకంటే ఈ సొమ్ము పక్కదారి పట్టించి తినేశారు అనడం బాగుటుంది. ఇది ఇప్పటివరకు భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం. నీరవ్ మోడీ, జోక్ సీలు కేవలం 6 వేల కోట్ల వరకు మాత్రమే బ్యాంకులకు ఎగ్గొట్టడం, లేదా పక్కదారి పట్టించడం చేశారు. రాయపాటి కంపెనీ దీన్ని అధిగమించి ఎనిమిది వేల కోట్ల వరకూ బ్యాంకుల సొమ్మును మింగేసింది.

ఎలా జరిగింది??

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కు కెనరా బ్యాంకు దాని సంయుక్తంగా ఉన్న బ్యాంకులు అప్పులు ఇచ్చాయి. సుమారు ఏడు బ్యాంకుల నుంచి వీరు అప్పులు పొందినట్లు ప్రాథమిక సమాచారం. ట్రాన్స్ ట్రాయ్ లోని లెక్కలను పెద్దవి చేసి కంపెనీ సామర్థ్యాన్ని ఆస్తులను పెద్దవిగా చూపి, కొన్ని డాక్యుమెంట్లను నకిలీవి సృష్టించి, టెంపరింగ్ చేసి మరి బ్యాంకు లను మోసం చేశారు. దీనిపై గతంలోనే కేసు నమోదు చేసిన సీబీఐ ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేసింది. మొత్తం దీనిలో ఎంత పక్కదారి పట్టింది అనేది అన్ని ఆధారాలతో సహా బయట పెట్టింది. రాయపాటి సాంబశివరావు తో పాటు కంపెనీ డైరెక్టర్గా ఉన్న చెరుకూరి శ్రీధర్ దీనికి ప్రధాన బాధ్యులు అని తేల్చింది. ఓ ప్రణాళిక ప్రకారమే ఎనిమిది వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారని సిబిఐ అంచనా వేస్తోంది.

పత్రికల్లో ఏది??

ఇంత ముఖ్యమైన దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వార్తలు ఈనాడు పత్రిక వేసింది సింగిల్ కాలమ్…. ఆంధ్రజ్యోతి అదే దారి. దీనిలో నిజానిజాలు వెలికి తీసి వార్తను పూర్తిగా అందించాల్సిన సాక్షి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది… విస్మరించింది అనే కన్నా వాళ్ళు వాళ్ళు ఒకటే అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూనే బాగుంటుంది.. కుల మీడియా లో పూర్తిగా కూరుకుపోయిన ఎలక్ట్రానిక్ ఛానల్ ళ్లు సైతం ఇది అసలు పెద్ద విషయమే కాదు అన్నట్టు అసలు డిబేట్ లు లేవు చర్చలు లేవు ప్రత్యేక స్టోరీ లేకుండానే వీటిని ముగించారు. ఇదంతా ఓ కుల నాటకం… అధికారం దగ్గరికి వచ్చేటప్పటికి పోటీపడటం తప్ప తప్పులు విషయంలో అంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పిన తెలుగు రాజకీయాలు, మీడియా అసలు స్వరూపం.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju