NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కడపలో కూర్చుని CBI పెద్ద పెద్దవాళ్ళకోసం – విపరీతంగా గాలిస్తోంది .. !

2019 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అధికార పక్షం, ప్రతిపక్షం విపరీతంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కడప పులివెందుల లో తీవ్రమైన హడావిడి చేశారు. ఎన్నో వాదోపవాదాలు అనంతరం కేసు సిబిఐ చేతికి పోయింది. మరి దాని పరిస్థితి ఎలా ఉంది?

 


ఎలా మొదలెట్టారు?

సిబిఐ అధికారులు మొదట కడప, పులివెందులలో నుండే తమ విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు. కొద్ది రోజులు కడప జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఈ కేసు విచారణను హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పచెప్పారు. గత నెల 17న సిబిఐ బృందాలు ఈ కేసు విచారణ మొదలు పెట్టాయి. విచారణ నిమిత్తం సీబీఐ కడప జిలాకు వచ్చింది. జూన్ 17 నుంచి దాదాపు రెండు వారాలు ఈ విచారణ జరిపారు.

టార్గెట్ వీళ్ళే….

ఇక ఎవరెవరిని విచారించారు అన్న విషయానికి వస్తే సిబిఐ మొదటిగా వివేకా కూతురు సునీతను పలుమార్లు ప్రశ్నించింది. సునీత ఒక బ్యాగ్ నిండా ఆధారాలు తీసుకువచ్చి సిబిఐ చేతికి అప్పగించిందనే వార్తలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే సీబీఐ విచారణ దూకుడు చూసి అందరూ ఈ కేసు త్వరలోనే ఒక కొలిక్కి వస్తుందని భావించారు. అలాగే కేసులో అనుమానితులుగా ఉన్న సిఐ శంకరయ్య, వైసిపి ముఖ్యనేత శంకర్ రెడ్డి, వివేకా పిఎ, వంటమనిషి, వామ్ మెన్ లను సిబిఐ ప్రశ్నించింది. గతంలో వేసిన సిట్ బృందాలు చేసిన దర్యాప్తు రిపోర్టు కూడా సిబిఐ తీసుకొనివచ్చి పరిశీలించింది. అలాగే మరికొన్ని ముఖ్య ప్రజాప్రతినిధులని కూడా ప్రశ్నిస్తారు ప్రచారం కూడా సాగింది.

భలే బోల్తా కొట్టించారు

ఇలాంటి సమయంలో గత నెల ఆఖరున సిబిఐ బృందం ఢిల్లీ వెళ్లిపోయింది. మళ్లీ వస్తాం అని చెప్పారు. వరుసగా సెలవులు ఉండడంతో అవి అయిపోయిన తర్వాత వస్తారని అంతా భావించారు. 22 రోజులు అయిన తర్వాత కూడా సిబిఐ నుండి ఎలాంటి సమాచారం లేదు. రెండు వారాలపాటు ఏకధాటిగా విచారణ జరిపిన వారు ఒక్కసారిగా విచారణకు బ్రేక్ వేశారు. ఏమైనా ఉత్తిషిని పైనుండి ఎదుర్కొంటున్నారా అన్న అనుమానాలు వచ్చాయి. చివరికి అయితే అసలు వ్యవహారం ఏమిటంటే సిబిఐ వారు ఢిల్లీ వెళ్లినట్లు నమ్మించి…. తమ వారిని కడప లోనే ఉంచారని చెబుతున్నారు. తమ విచారణ తర్వాత జరిగే పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తమకు రిపోర్టు అందజేయమని వారి ఇన్ఫార్మర్స్ సాధారణ మనుషులతో కలిసి తిరుగుతున్నారట.

ఇక సిబిఐ అంటే వ్యవహారం మామూలుగా ఉండదు. అందరినీ ఇలా మభ్యపెట్టి, బురిడీ కొట్టించేసి ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్న వారు త్వరలోనే వివేకా హత్య కేసుని ఒక కొలిక్కి తెస్తారు అని ప్రజలంతా నమ్ముతున్నారు

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju