NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

“విగ్రహాల ధ్వంసం” కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం ఆయనేనా..!? ఆలోచించాల్సిందే..!!

రాజకీయమంటే ఎన్నికలు వస్తే ప్రచారం చేయాలి. గెలిస్తే పాలించాలి. లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవాలి. అనుకుంటారేమో కానీ కాదు..!!
ప్రజలు ఓడిస్తే ఓడించారు.., కానీ “దేవుడు బుర్ర ఇచ్చాడు.., ఆ బుర్రలో చాల ఐడియాలు ఉన్నాయి.., వాటిలో అనేకం కుట్రలతో నిండాయి. వీటితో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలి. కులం, కోర్టు, మతం, దేవుడు, సభ ఏదీ అనర్హం కాదు. అధికార పక్షాన్ని ఆడుకోవాలంటే.., బురద వేయాలంటే ఎన్ని ప్లాన్లు వేయాలో అన్నీ వేయాలి”..! ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే కొన్ని అనుమానాలు.., ఇంకొన్ని లాజిక్కులు, లోతుగా కొన్ని పాయింట్లు పరిశీలిస్తే ఈ హిందూ విగ్రహాల ధ్వంసం వెనుక ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక కుట్ర కనిపిస్తుంది. అదే ఇక్కడ చెప్పుకుందాం..!!

Ramateerdham

పాపం జగన్. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము. 15 లక్షల మందికి ఇళ్లను నిర్మించి ఇస్తాము. పండగలా ఉంటుంది, ఆనందం ఉంటుంది అంటూ అనుకున్నారు. కానీ తాను ఎదుర్కొంటున్నది ఒక నలభై ఏళ్ల “రాజకీయ ముదురు”తో అనేది పెద్దల పట్టించుకోలేదు. అందుకే జగన్ అనుకున్న ఇళ్ల పట్టాల పండక పక్కకు వెళ్లి “రామనామం” పైకి వచ్చింది. వచ్చింది అనే కంటే ఒక ప్లాన్ ప్రకారం తెచ్చారు అనే బెటర్. సరిగ్గా జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాతనే విజయనగరం జిల్లా రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం అవ్వడం ఏంటి..? మీడియా ఫోకస్ అటు వెళ్లడం ఏంటి..? ప్రతిపక్షాలు రచ్చ చేయడం ఏంటి..? భక్తులను రెచ్చగొట్టడం ఏంటి..? ప్రభుత్వం డిఫెన్స్ లో పాడడం ఏంటి..!? ఇది ఒక ప్లాన్ అని ఖరారు చేసుకునే ముందు ఇంకొన్ని చూద్దాం..!!

chandrababu steps against cm jagan at delhi
chandrababu steps against cm jagan at delhi

* 2019 నవంబరు 14 – ఆ రోజున ఒంగోలులో సీఎం జగన్ మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి సోషల్ మీడియాలో “గుంటూరులో దుర్గా గుడిలో విగ్రహాలు ధ్వంసం” అంటూ ప్రచారం జరిగింది.
* 2020 జనవరి 21 – ఆ రోజున పిఠాపురంలో 23 హిందూ విగ్రహాల ధ్వంసం అయ్యాయి. సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో వార్తలు విపరీతంగా హల్చల్ చేశాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ అక్కడికి వారం రోజుల ముందు సీఎం జగన్ రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసారు. అదే నెలలో సీఎం అత్యుత్తమ పథకం “అమ్మఒడి” మొదటి విడత ఆరంభించారు.
* 2020 ఫిబ్రవరి 11 న రంపిచర్లలో వేణుగోపాల స్వామి ఆలయంలో.., ఫిబ్రవరి 13 న ఉండ్రాజవరం అమ్మవారి విగ్రహం.., 14 న నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమయ్యాయి. కానీ.. అక్కడికి వారం రోజుల ముందు సీఎం జగన్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దిశా పోలీస్ స్టేషన్ ని రాజమండ్రిలో ప్రారంభించారు.

antarvedi

* ఇక అంతర్వేది రథం దగ్ధం సమయామానికి రాష్ట్రంలో అంగన్వాడీలకు సీఎం జగన్ వరాలిచ్చారు. సెప్టెంబర్ 11 న సీఎం జగన్ మహిళలకు జగన్ ఆసరా పథకాన్ని ప్రకటించి, అందిస్తే… అక్కడికి రెండు రోజుల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమయ్యాయి. వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభించిన రెండు రోజుల ముందు నెల్లూరు జిల్లా తుమ్మూరులో ఆంజనేయ విగ్రహం ధ్వంసం అయింది. అక్టోబర్ 8 న జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభిస్తే.., అక్కడికి మూడు రోజుల ముందు మంత్రాలయం నరహింహస్వామి ఆలయంపై దడి జరిగింది. అక్టోబర్ 16 న 56 బీసీ కార్పొరేషన్లు ప్రకటించిన తర్వాత రోజున త్రలపాడు శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం అంటూ వార్తలు వచ్చాయి.

లోతుగా ఆలోచించాల్సిందే..!!

ఇదే.. ఇక్కడే.. ఈ పాయింట్లు చదివిన తర్వాతనే ఆలోచించాలి, అప్రమత్తమవ్వాలి. బేసిక్ గా సీఎం జగన్ క్రిష్టియన్. సో.., ఆయనపై హిందూ వ్యతిరేకి ముద్ర చాల సులువుగా వేసేయొచ్చు. అందుకే ఇలా విగ్రహాలు ధ్వంసం చేసినా.., ఆలయాలలో ధ్వంస రచన చేసినా జగన్ ఆత్మరక్షణలో పడతారు.., పథకాలు ప్రచారం, పేరు పక్కదారి పడుతుంది. ఇది, ఇంత లోతుగా ఆలోచించే బుర్ర మామూలుది కాదు. అది నలభై ఏళ్లకు పైబడి రాజకీయ అనుభవం.., అపర చాణక్యత లేకపోతే ఇలా ఆలోచించడం, “ధ్వంస వ్యూహ రచన” చేయడం సాధ్యం కాదు..!! “ఇవన్నీ కాదు అసలు చంద్రబాబుకి, వీటికి ఏమి సంబంధం లేదు. ఆయన అటువంటి ఆలోచనలు చేయరు, అంత కుట్ర పరుడు కాదు అని చెప్పుకోవాలన్నా బాబోరి రాజకీయ జీవితంలో అంత నీతి, నిజాయితీ కనిపించడం లేదు. ఇన్ని కుట్రలు, లోతుగా రచనలు వేయడంలో ఆయన దిట్ట..!” సో.., ఈ పాయింట్లు లోతుగా ఆలోచించి అప్రమత్తం కావాల్సింది సీఎం జగన్ మాత్రమే. ఆయన ప్రవేశపెట్టాల్సిన పథకాలు చాలానే ఉన్నాయి. పాలించాల్సిన సమయం చాలానే ఉంది..!!

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!