బీజేపీతో “పొలిటికల్ బిజినెస్” ప్లాన్..! చంద్రబాబుకి “కమ్మ”గా చెవిలో పూలు..!

హైదరాబాద్ లో టీడీపీ కొన ఊపిరితో ఉంది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోతే ఇక చితి మీదకు వెళ్ళిపోయినట్టే..! అటువంటి పార్టీకి ఆ అనుకూల సామజిక వర్గీయులు ఓట్లు వేస్తే వృథా పోతాయి..! కేసీఆర్ ముందు వాళ్ళ పప్పులు కూడా ఉడకవు. అందుకే చంద్రబాబు నమ్మిన కమ్మ బృందం ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓ ప్లాన్ ప్రకారం నెట్టుకొస్తోంది..! బాబుకే ఎసరు పెట్టడానికి ప్రణాళికలు కూడా వేసేసింది..!!

కేసీఆర్ కన్ను వారిపైనే..!!

హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు 30 లక్షల వరకు ఉంటాయి. సుమారుగా 38 డివిజన్లలో వీరి ఓట్లు కీలకం. గెలుపు, ఓటములు ప్రభావం చూపేవి ఈ ఓట్లే. ఈ సెటిలర్లలోనూ చంద్రబాబు అనుకూల సామాజికవర్గం ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. కూకట్ పల్లి, బేగం పేట, జూబ్లీహిల్స్, పఠాన్ చెరు, మౌలాలి లాంటి ప్రాంతాల్లోని 7 డివిజన్లలో కమ్మ సామాజికవర్గం ఓట్లు కీలకం. మరో 8 డివిజన్లలో కూడా గెలుపు, ఓటములను శాసించే స్థాయి ఓట్లున్నాయి. అంటే సెటిలర్లుగా ఉన్న కమ్మ వారి పెత్తనం ఈ 15 డివిజన్లపై ఉంటుంది. ఈ డివిజన్లపై మొన్నటి వరకు టీడీపీకి పట్టుంది. 2016 లో అప్పటి అవసరాలు, తెలంగాణాలో కేసీఆర్ ఊపు నేపథ్యంలో అందరూ మూకుమ్మడిగా కేసీఆర్ కి వేశారు. అప్పట్లో చంద్రబాబు కూడా పెద్దగా కల్పించుకోలేదు. కానీ.. 2020 కి వచ్చే సరికి గ్రేటర్ లో ఈ కమ్మ ఓట్లు కీలకమయ్యాయి. అందుకే వీటిపై చంద్రబాబు ఒకలా వాడుకోవాలని చూస్తేంటే.. వాళ్ళు మరోలా ఆలోచిస్తూ చంద్రబాబు చెవులో “కమ్మ”ని పూలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

బాబు ఆలోచన ఎలా ఉందంటే..!?

గ్రేటర్ లో తనకు ఉన్న ఓటు బ్యాంకు ద్వారా తన పార్టీ గెలవదు అని బాబుకి తెలుసు. అందుకే తన అనుకూల సామజిక వర్గం ఓట్లను తనకు అనుకూలంగా వాడుకుని… ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందాలనేది చంద్రబాబు వ్యూహం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఆకలి మీద ఉంది. సీట్లు, ఓట్లు వేటలో నానా రకాల రాజకీయాలు చేస్తుంది. అటువంటి చోట సెటిలర్లుగా ఉన్న “కమ్మ”ని ఓట్లని బీజేపీకి అమ్ముకుని.. మోడీ, అమిత్ షా దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని బాబు వ్యూహం వేశారు. అందుకు అనుగుణంగా కొన్ని అనధికార ఆదేశాలు కూడా ఇచ్చారు. తనకు బీజేపీతో చాల అవసరాలున్నాయి. 2019 ఎన్నికల్లోనే అనవసరంగా పెట్టుకున్నారని అంతర్మధనం పడుతున్నారు. అందుకే ఇప్పుడు మల్లి బీజేపీతో జత కట్టడానికి గ్రేటర్ లో తన ఓట్లు మల్లింపు అనే అస్త్రాన్ని వాడుకోవాలని బాబోరు ప్లాన్ వేశారు. కానీ..!!

వీళ్ళ ఆలోచన మరోలా..! ఎందుకంటే..!?

బాబు అనుకున్నట్టు ఈ ఓట్లు బీజేపీకి వేస్తే.. మహా అయితే ఆరో, ఏడో గెలిస్తే బీజేపీకి వచ్చే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. టీఆరెస్ ఓటమికి దారి కాదు. ఎలాగైనా టీఆరెస్ కి మేయర్ పీఠం ఖాయం. సీఎం వాళ్ళే. మేయర్ వాళ్ళే… అటువంటి సమయంలో ఈ కమ్మని సెటిలర్లు వారికి వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు అంటే ఎందుకు ఊరుకుంటారు..? వ్యాపార మూలాల్లోకి వెళ్లడం.., కెలికేయడం కేసీఆర్ కి ఒక పూట పని. అసలే ఏళ్ల తరబడి అనధికార వ్యాపారాలతో హైదరాబాద్ లో తిష్ట వేసిన కమ్మని సెటిలర్లపై ఈ కేసీఆర్ తో కయ్యంతో ఇబ్బందులు తప్పవు. అందుకే కేసీఆర్ కి దొరకకుండా.. అతనితో ఎందుకు పేచీ అనుకుని ఏకధాటిగా టీఆరెస్ కి మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నారట. బాబు ఎన్ని చెప్పినా.. బీజేపీ ఎన్ని చేసినా.. తమ ఆధిపత్యం ఉన్న డివిజన్లలో టీఆరెస్ గెలిస్తేనే తమకు భవిష్యత్తు… అందుకే మారు ఆలోచన లేకుండా కారుకి గుద్దెయ్యాలి అనేది వారి ఆలోచన. ఆ రకంగా బాబుకి ఆ కమ్మని సెటిలర్లు చెవిలో పూలు పెట్టారన్నమాట..!!