NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

చంద్రబాబు పక్కా ప్లాన్..! టీడీపీ కమిటీల్లో తొక్కిందెవర్ని.? ఎక్కించిందెవర్ని..?

TDP ; Municipolls Winning Analysis

పార్టీ జిల్లా అధ్యక్షుడిగా… పార్టీ రాష్ట్రం మొత్తం తెలిసిన.. మంత్రిగా పని చేసిన దేవినేని ఉమాకి అదే పదవి.., పార్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంచుమర్తి అనురాధకి అదే పదవి కల్పించారు.. పార్టీలో అసలు ఎవ్వరికీ మద్దిపాటి వెంకటరాజుకి అదే పదవి దక్కింది..!! అంటే దేవినేని ఉమాకు దించినట్టా..? కాదా..!!?

రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసి.. ప్రతిపక్షంలో ఉండగా పార్టీని జిల్లాలో నిలబెట్టి.., అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఆశించి పార్టీకి కీలకంగా పని చేసిన చింతమనేని ప్రభాకర్ కి.., పార్టీలో పక్క నియోజకవర్గం వాళ్లకు కూడా తెలియని.. సాదాసీదా నాయకులకు ఒకేస్థాయి పదవులు ఇచ్చారు. మరి చింతమనేనిని దించినట్టా..? కాదా..!?

tdp senior leaders giving shock to chandrababu naidu
tdp senior leaders giving shock to chandrababu naidu

ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి.. పూర్తిగా పార్టీలో యాక్టీవ్ కూడా అవ్వని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యదర్శిగా పదవి కట్టబెట్టారు..! అంటే పైకి ఎక్కించినట్టా..? కాదా..!?

2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డికి.. తాతల కాలం నుండి పార్టీలో ఉంటూ.., పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కూడా పని చేసిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి ఒకే స్థాయి పదవి ఇచ్చారు. అంటే దామాచార్లను దించినట్టా కాదా..? సాయికల్పనను పైకి ఎక్కించినట్టా..? కాదా..!?

* రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న.. జిల్లాలో పట్టున్న పరిటాల వారసుడు శ్రీరామ్ కి అధికార ప్రతినిధి ఇచ్చారు. అసలు పార్టీలో ఎవరికీ తెలియని సయెద్ రఫీ, సప్తగిరి ప్రసాద్ కి కూడా అదే పదవి ఇచ్చారు. అంటే ఇక్కడ తొక్కినట్టా..? కాదా..!?

సో.. టీడీపీ రాష్ట్ర కమిటీల్లో చంద్రబాబు పక్కా ప్రణాళికలు ఉన్నాయి. పక్క పార్టీల కాపీలున్నాయి. పక్కలో బల్లాలను పక్కన పెట్టారు. కొత్త వాళ్ళను పక్కకు తెచ్చుకున్నారు. బీసీల పాటా పాడారు. కమ్మలకు కొమ్ములు కాస్త దించారు. కానీ ఊరికే దించలేదు.

ఎందుకు దించారో తెలుసా..!?

దేవినేని ఉమాపై ఎప్పటి నుండో ఆ జిల్లాలో ఆరోపణలున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పని చేసినప్పటి నుండి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.., కొందరు సీనియర్ నాయకులను లెక్క చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా గత ప్రభుత్వంలో నీటి మంత్రిగా నీతి కబుర్లు చెప్తూ.., అవినీతి బాగానే చేశారనే బ్యాడ్ టాక్ ఉంది. అందుకే అతన్ని దించారు.


* ఇక చింతమనేని అంటే నోరు అదుపులో ఉండదు. ఎదురుగా గ్రామా కార్యదర్శి ఉన్నా.., సీఎం ఉన్నా ఒకే తరహాలో మాటలు వస్తుంటాయి. కార్యకర్తలు అంటే మమకారం ఉన్నప్పటికీ విలువ ఉండదు. సొంత మనుషులంటే చులకన ఉంటుంది. పైగా బోలెడంత బ్యాడ్ నేమ్ ఉంది. అందుకే ఏదో ఒక పదవి ఇచ్చేస్తే పోతుంది అనే లెక్కలో ఇచ్చేసారు.
* ఇక దామచర్ల జనార్దన్ పరిస్థితి కూడా అంతే. పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా తొమ్మిదేళ్లు పని చేసారు. పార్టీని సమన్వయం చేయడంలో ఎప్పుడూ విమర్శలు ఉండేవి. సీనియర్లతో, జిల్లాలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పొసిగేది కాదు. ఆయన కారణంగానే పార్టీ నుండి కొందరు బయటకు వెళ్లిపోయారనే వాదనలు ఉన్నాయి. అందుకే ఈ భారాన్ని దించుకుంటే క్రమంలో దించేశారు. సో… ఈ సారి కమిటీల్లో మాత్రం ఇలా కానిచ్చేశారు..!!

 

 

author avatar
Srinivas Manem

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!