NewsOrbit
బిగ్ స్టోరీ

‘నేను ఉండి ఉంటే అసలు ….’ చంద్రబాబు పాండిత్యం మొత్తం బయటకొచ్చింది

 

నిన్న విశాఖ గ్యాస్ లీక్ ఘటన జరిగిన తర్వాత జగన్ హుటాహుటిన వైజాగ్ కు తరలిపోయారు. అయితే చంద్రబాబునాయుడు గారు మాత్రం విశాఖకు వెళ్లేందుకు ఎన్నో విఫలయత్నాలు చేశారు. అదలా ఉంచితే మొన్నటి నుండి వైరల్ అవుతున్న వ్యాఖ్య ఏమిటంటే ‘మోడీకి ఏపీలో నో ఎంట్రీ అని ఉరిమిన చంద్రబాబే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు మోడీని అడుక్కుంటున్నాడు’ అని. విశాఖ వెళ్లడానికి చంద్రబాబు ప్రధాని మోదీ సాయాన్ని మరియు అనుమతి కోరిన దాన్ని చూపిస్తూ బయటకు వచ్చినా వ్యాఖ్య ఇది. రాజకీయాల్లో ఇంత అస్థిరమైన శత్రుత్వాలు మరియు చంచలమైన స్నేహ బంధాలు ఒక్క చంద్రబాబు దగ్గర మనం చూస్తూ ఉంటాం.

ఇక ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండవలసి రావడం వల్ల తన రాజకీయ లబ్ధి కోసం చేయవలసిన ప్రయత్నాల అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తుందని అసహనంతో ఊగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫ్రస్టేషన్ లో అతనే మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కావట్లేదు. తనకు ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోగొట్టుకుంటున్న తీరు ఇప్పుడు తెదేపా వర్గాలకు అంతుచిక్కడం లేదు.

నిన్నటి విశాఖ గ్యాస్ లీక్ తర్వాత బాబు అన్న మాటలివి — “ఐఏఎస్ లు ఏం చేస్తారు? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా…. స్టైరిన్ అంటే నాకే తెలియదు ఐఏఎస్ లకు ఏం తెలుస్తుంది? జగన్ ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. చెబితే వినడు. సబ్జెక్ట్ కమిటీ కదా వేయాల్సింది జగన్ తో సంబంధం లేకుండా మా నాయకులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప లతో నేనే ఓ కమిటీ వేస్తున్నాను”

జగన్ వేసిన కమిటీ ని కాదని తమ సొంత ఎమ్మెల్యేలతో కమిటీ వేయడం ఏందో చంద్రబాబుకే తెలియాలి. సాంకేతికంగా రసాయన పరిశ్రమల గురించి ఐఏఎస్ అధికారులు, నిపుణులకు కాకపోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలను ఏం చేయాలి…. తదుపరి ప్రమాదాలను నివారించాలన్న విషయం పై వారి కన్నా బాగా ఎవరికి తెలుసు?

కంపెనీ వైఫల్యం మరియు మొన్న చోటుచేసుకున్న తప్పిదాలను పరిశీలించి ఆయా నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు నివేదికలను వివరించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు…. అందులోనూ ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులకు కాకుండా ఇంకా ఎవరికి ఉంటుంది? అటువంటి కమిటీని బాబు తప్పుబట్టడం ఏందో అతనికే తెలియాలి. ఇంతకీ రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప ఏఏ సబ్జెక్టుల్లో పట్టబధ్రులో బాబు గారే సెలవివ్వాలి.

ఇదిలా ఉంటే, “కోటి రూపాయలతో మనిషి బ్రతుకి వస్తాడా..? అసలు కోటి రూపాయలు ఎవరు అడిగారు? అవి అయినా సరిపోతాయా?” అంటూ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం బాబు గారు ఎంతవరకు సబబు? ఉదారంగా పరిహారాలు ఇవ్వడం చంద్రబాబు కి ఎప్పుడూ చేతకాలేదు… పైగా మళ్లీ అర్ధరహితమైన వ్యాక్యాలు. పుష్కరాల ప్రమాదం సందర్భంలో బాబు చేసిన నిర్వాకం ఎవరికీ తెలియంది కాదు. రేపు పొద్దున లీగల్ ఫైట్ లో కంపెనీ నుండి ఎక్కువ మొత్తం రాబట్టలేకపోయినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామన్నా కోటి రూపాయలు అయినా పరిహారంగా వస్తాయి అన్న భావంతో జగన్ కోటి రూపాయలు ప్రకటించి ఉండవచ్చు. దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది వేరే విషయం.

ఇకపోతే…. “ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. నేను ఉండి ఉంటే నేరుగా ఫ్యాక్టరీలో కి వెళ్ళే వాడిని. ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు సరిగా లేదు” అని బాబు వ్యాఖ్యానించడం కొసమెరుపు. బాబు ఉంటే ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఏం చేసేవాడు? సేఫ్టీ వాల్వ్స్ స్వయంగా క్లోజ్ చేసేవాడా లేదా అప్పటికప్పుడు ఇంజన్లు రిపేర్ చేసేందుకు బోల్టు లు, నట్లు విడదీసి ఎక్కడ తప్పు జరిగిందో కన్నుక్కొని చివరికి ధ్రవ పదార్థాన్ని వాయువుగా మారకుండా ఉందేందుకు పాలిమరైజేషన్ చేసేవాడా?  ఒక రాజకీయ నాయకుడు ప్రమాదం జరిగేటప్పుడు ఫ్యాక్టరీలకు వెళ్లి చేయగలిగింది ఏముంటుంది? ఏదో వినే వాళ్ళు వెర్రి మాలోకాలు అన్నట్లు పిచ్చి వ్యాఖ్యలు చేయడం కాకపోతే.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment