NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Chiranjeevi : ‘నెపోటిజమ్’ కి అడ్డుగోడలా.. టాలీవుడ్ కి అండ‌గా నిలబడ్డ చిరంజీవి..!

chiranjeevi not letting nepotism

Chiranjeevi : బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ‘నెపోటిజమ్’ అనే పదాన్ని మనం తరచూ వింటున్నాం. ఖాన్ లు, కపూర్ లు అంటూ కేవలం కొన్ని ఫ్యామిలీల సినిమాలకే ఎక్కువ ఆదరణ కల్పించడం…. ప్రొడ్యూసర్లు కూడా వారి వైపు అడుగులు వేస్తుండటంతో టాలెంట్ ను తొక్కేస్తున్నారు అన్న మాట ఈ మధ్య మరీ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అన్నీ పేరు మోసిన ఫ్యామిలీలలో ‘మెగా ఫ్యామిలీ’ పెద్దది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మెగా ఫ్యామిలీ నుండి అరడజనుకి పైగా హీరోలు బయటకు వచ్చారు. అయితే ఇక్కడ మాత్రం ‘నెపోటిజమ్’ అనే పదానికి అస్సలు చోటు కాదు. అందుకు ప్రధాన కారణం పెద్దన్న చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు తన ఇంట్లో నుండి వచ్చే వారి స్క్రిప్ట్ లను తానే దగ్గరుండి పరిశీలించి జాగ్రత్తగా వారి కెరీర్ ప్లాన్ చేయించే చిరంజీవి మరొకవైపు టాలెంటెడ్ చిన్న హీరోలను సైతం విపరీతంగా ప్రోత్సహిస్తుంటారు. ఇక టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అయితే మెగా ఫ్యామిలీ వల్ల వెలుగులోకి వచ్చిన వారు కోకొల్లలు. 

chiranjeevi not letting nepotism
chiranjeevi not letting nepotism

Chiranjeevi : అందరికీ ఛాన్సులు – అదే మెగా మంత్ర

తాజాగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా చేసిన పంజా వైష్ణవ్ తేజ్ చిత్రానికి హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి. డైరెక్టర్ అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయని కొత్త కుర్రాడు. అంతేకాకుండా చిరంజీవి తన తర్వాత సినిమాలో కూడా మెహర్ రమేష్, బాబీ లాంటి మరుగున పడిపోయిన డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వడం చూస్తుంటే అతనికి సినిమా మీద ఉన్న మక్కువ, టాలెంట్ ఉన్న నమ్మకం కొట్టొచ్చినట్లు కనబడతాయి. 

ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హవా అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ తర్వాతి సినిమాల కాంబినేషన్ లు పెద్ద రేంజ్ లో ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమాలు మొదలు పెట్టేసాడు. సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాలకు స్టార్ హీరోల రేంజ్ లో ప్రీ- రిలీజ్ బిజినెస్ జరుగుతుంది అంటే కేవలం అది మెగా ఫ్యామిలీ కి ఉన్న పవర్, చిరు మీద ఉన్న నమ్మకం. అంతే కాదు విజయ్ దేవరకొండ, నాగ శౌర్య వంటి ఎంతో మంది టైర్ 2 సినిమాల అన్ని ఈవెంట్లకు ముఖ్య అతిథిగా విచ్చేసేందుకు చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటి వరకు ఆయన ఎవరికీ ‘నో’ చెప్పిన దాఖలాలు అయితే లేవు. 

మెగాస్టార్ లేకుండా నో ఈవెంట్ : చిరంజీవి

తన కుటుంబంలోని వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో మిగతా స్టార్ హీరోలు, చిన్న హీరోలకి కూడా చిరంజీవి దగ్గర నుండి అంతే ప్రోద్బలం ఉంటుంది. ‘ఖైదీ నెం. 150’ తో భారీ స్థాయిలో రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు, ‘ఆచార్య’ సినిమా తర్వాత రీమేక్ సినిమాలను చేయడం నిజంగా కొత్త కథల పట్ల తనకు ఉన్న ప్రేమ, ఫ్లాపులతో వెనుకబడిన డైరెక్టర్స్ కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే అతని ఆత్మ సంకల్పాన్ని చూపిస్తోంది. బాలీవుడ్ కి భిన్నంగా టాలీవుడ్ లో ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందంటే అందుకు ఏకైక కారణం మెగాస్టార్ చిరంజీవి. 

chiranjeevi not letting nepotism
chiranjeevi not letting nepotism

మెగా… కావాలి అందరికీ బాగా : Chiranjeevi

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అనామకుడిగా ప్రవేశించి…. తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని తన కుటుంబంతో వారితో పాటు మొత్తం టాలీవుడ్ కే పెద్ద ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి లాంటి వాళ్ళు ముందు ఉండడం వల్ల ఆ నమ్మకంతోనే ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా వెలుగులోకి వస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

author avatar
arun kanna

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri