NewsOrbit
Featured బిగ్ స్టోరీ

ఆయన “స్వయంకృషి”కి “ఖైదీ”లైన వారెందరో…!!

అమ్మకు “చంటబ్బాయి“.., అభిమానులకు “అన్నయ్య“… జూనియర్లకు “మాస్టర్“.., ప్రత్యర్థులకు “హిట్లర్“… మహిళలకు “మగ మహారాజు“.., ప్రత్యర్థులకు “రోష గాడు“.., మొత్తానికి తెలుగు సినిమాతో ఆయన “రక్త బంధం” పెనవేసుకుని.., సినిమా “రక్త సింధూరం” పూసుకుని “తిరుగు లేని మనిషి”గా మారారు.
           – అందుకే ఆయన “స్వయంకృషి”కి “ఖైదీ”లైన వారెందరో…!!

ప్రాణం ఖరీదు” తెలిసిన “మొండిఘటం” ఆయన. “మోసగాడ”నీ.., “రాక్షసుడ“నీ ఎవరు అనుకున్నా.., ఆయన ఒక “ఖైదీ” అంటూ “ఖైదీ నంబర్ 150“, “ఖైదీ నంబర్ 786 ” అనీ సంఖ్యలూ ఇచ్చినా… ఆయన అభిమానుల మనస్సులో “సుప్రీం హీరో”గా స్థిరమయ్యారు. “దొంగ” అనీ, “జేబు దొంగ” అనీ.., “అడవి దొంగ” “కొండవీటి దొంగ” అని పిలిచినా వెరవలేదు… “చట్టానికి కళ్ళు లేవు” అనుకోకుండా…, “న్యాయం కావాలి” అంటూ “చట్టంతో పోరాటం” చేసి “శ్రీ మంజునాధ” చల్లని చూపుతో “మంచి దొంగ” అనిపించుకుని “అందరివాడు“గా మారారు…!
              – అందుకే ఆయన “స్వయం కృషి”కి “ఖైదీ”లైన వారెందరో…!

 

తెలుగు సినీ తెరపై “గ్యాంగ్ లీడర్” గా తనకంటూ గ్యాంగ్ లేకుండా తెలుగు సినిమాకు “బిగ్ బాస్” గా.., “జై చిరంజీవా” అంటూ మొర పెట్టుకుంటే… సమస్యలు పరిష్కరించే “ఘరానా మొగుడు“గా మారారు. అవసరమైతే తెలుగు సినిమాకు “మెకానిక్ అల్లుడు“గా మారి రిపేర్ చేస్తారు. తనను “శంకర్ దాదా” అని పిలిచినా వారి చేతనే “శంకర్ దాదా జిందాబాద్” అని పిలిపించుకుని… అభిమానులు “అభిలాష” పడితే…, నిన్ను “చూడాలని ఉంది” అంటే ఆయనలో “ఆలయ శిఖరం” చూపిస్తారు. ఆపదలో ఉన్నాం అంటే “ఆపద్బాంధవుడి”గా మారి ప్రత్యక్షమవుతారు.
             – అందుకే ఆయన “స్వయంకృషి“కి “ఖైదీ“లైన వారెందరో..!

అమ్మపై “ఆరాధన“తో ఇష్టమైన పెసరట్లు వేస్తారు. “స్నేహం కోసం” ఎక్కడికైనా వెళ్తారు.., “ధైర్యవంతుడి“గా ఉంటారు. గిట్టని వాళ్ళు ఏమన్నా మానసిక “సంఘర్షణ“లోపలే ఉంచుకుంటూ.., “ఇంటిగుట్టు” బయటకు వద్దు అంటారు. ఎప్పుడైనా ఆగ్రహం వస్తే “గూండా“యిజం చూపరు. అవసరాన్ని చూసుకుని “పులి“.., “పులి బెబ్బులి” లా మారతారు. చల్లారకపోతే తనే ఒక “కొదమ సింహం” లా మారి, “త్రినేత్రుడు“గా.., “రుద్రనేత్రు”డుగా.., “రుద్రవీణ” మోగిస్తూ పరోక్షంగా వార్నింగ్ ఇస్తారు. అవసరమైతే “ఛాలెంజ్” విసిరి.., “చాణక్య శపధం” చేసి… చివరికి “విజేత“గా నిలుస్తారు.
             – అందుకే ఆయన “స్వయంకృషి”కి “ఖైదీ”లైన వారెందరో…!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju