NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్..! రాజధానులు ఒకటా..? మూడా..? రేపు విడుదల..!?

రాష్ట్రంలో రాజధాని రగడ (రాజకీయం) మొదలై ఏడాది అవుతుంది..! పాలనా వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని ఏడాది అవుతుంది..! ఇన్నాళ్లులో ఏడాది కాలం వృథా తప్పితే పెద్దగా రాష్ట్రం గుర్తుంచుకునే మార్పులు ఏమి లేవు. ఇప్పటికీ దీనిపై తేల్చేయకపోతే ఇక సీఎం నిర్ణయానికి, ఆశయానికి విలువ ఉండదు..!! ఏడాదైన తరుణంలో బీజేపీ మాటలు ఎన్నో మారాయి. తాజాగా సోము మరింత ముదిరేలా మాట్లాడారు. మరోవైపు కోర్టుల్లో విచారణ కీలక దశలో ఉంది..! అందుకే ఇవన్నీ కాదు కానీ..- “నా నిర్ణయం ఇది. మీ కథ ఏమిటి..!?” అనేది స్పష్టత కోసమే జగన్ ఢిల్లీ టూరు అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక సోర్సుల ద్వారా తెలిసింది. దీనిలో కొన్ని లెక్కలు, రహస్యాలు, రాజీ సూత్రాలు ఉన్నాయి..! అవేమిటో చూద్దాం పదండి..!!

ap cm ys jagan meets amit shah

సోము ఆకస్మికమా..? ఆంతర్యమా..!?

రాజధాని విషయంలో బీజేపీ మొన్నటి వరకు ఒక స్టాండ్ లో లేదు. రకరకాల వేదికలపై, రకరకాల మాటలతో గడిపేసింది. కానీ తొలిసారిగా మొన్న సోము వీర్రాజు “నేను మోడీ మనిషిగా చెప్తున్నాను. రాజధాని అమరావతిలోని ఉంటుంది. వికేంద్రీకరణ జరగదు. బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తాం” అన్నారు. ఇవి ఆకస్మికంగా మాట్లాడారా..? ఆంతర్యంతో మాట్లాడారా..? అనేది కీలకం. రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఇలా మాట్లాడారు అంటే కచ్చితంగా అది రాజధాని అంశంపై బీజేపీ పెద్దల్లో ఏదో కదలికలు జరుగుతున్నట్టే. అందుకే అవేమిటో తేల్చేయడానికి, తెలుసుకోడానికి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు అనేది ఒకటో కారణం..!!

cm jagan key decision about amaravathi
cm jagan key decision about amaravathi

ఏడాదిలో ఎన్నో అవరోధాలు..!!

రాజధాని గొడవ మొదలై ఏడాది అవుతుంది. సీఎం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన రోజు చాలా మద్దతు ఉంది. దేశం మొత్తం ఇటు చూసింది. రాష్ట్రంలో కూడా తటస్థులు చాలా వరకు మంచిదే అనుకున్నారు. అందుకే నాడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి.., అమరావతి అనుకూల ఉద్యమం కోసం జోలె పడితే పెద్దగా స్పందన లేదు. కానీ ఈ ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం రాజధానులపై ఎవరికీ ఆసక్తి లేదు, ఆలోచనలో మార్పులు వచ్చాయి. ఓ వైపు కరోనా, మరోవైపు వరదలు, పంట నష్టాలు, రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులు, న్యాయవ్యవస్థతో వివాదాలు, పాలనలో అనేక కొత్త సమస్యలు రావడంతో ప్రజల్లో రాజధాని పట్ల మిశ్రమ స్పందన ఉంది. అంటే ఏడాది కిందట ఉన్న మద్దతు మాత్రం ఇప్పుడు లేదు. నాటి నుండీ నాన్చుతున్న బీజేపీ పెద్దలు రాజధాని మార్పు విషయంలో పూర్తిగా ఏమి చెప్పలేదు. జగన్ మాత్రం బీజేపీ పెద్దలు, కేంద్రం శతశాతం మద్దతిస్తుంది అనే ఆశతో ఉన్నారు. ఇప్పుడు అది తేల్చేయాల్సిన సమయం వచ్చింది. అందుకే సీఎం ఢిల్లీ పర్యటన వెనుక బోలెడంత మ్యాటర్ ఉంది.

స్నేహ హస్తం ఇస్తే ఒకలా..! ఇవ్వకపోతే మరోలా..!!

ఇప్పుడు జగన్ కి ఉన్న అతి పెద్ద టాస్క్ మూడు రాజధానుల అంశమే. అందుకే ఢిల్లీలో రేపటితో ఒక స్పష్టతకు వచ్చేస్తారు. బీజేపీ మద్దతు ఉంటె.., వ్యవస్థల ద్వారా తన నిర్ణయానికి అనుకూల నిర్ణయాలు రావచ్చు. లేకపోతే వ్యతిరేక నిర్ణయాలు రావచ్చు. అది జగన్ కి బాగా తెలుసు. అందుకే మొన్నటి సోము మాటలతో బాగా మండి రాజకీయంగా ఒక క్లారిటీ తీసుకోడానికి ఢిల్లీ వెళ్లారనేది ఒక అంశం అయితే.., కేంద్రంతో స్నేహంగానే ఉంటున్నారు. కానీ మొన్న రైతు ఉద్యమం భారత్ బందుకు అనూహ్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అలా మద్దతిచ్చిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. మద్దతిచ్చిన జగన్ కూడా ఢిల్లీ వెళ్లారు. సో.. ఇదీ ఆలోచించాల్సిన పాయింటే..! ఇది రెండో అంశంగా ఉంటుంది. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టుని నిన్న సందర్శించిన సీఎం జగన్ దానికి నిధుల విషయంలో అధికారికంగా కాకుండా రాజకీయంగా లాబీయింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అధికారికంగా అయితే ఎవరు హక్కులు, తప్పులు, లెక్కలు, రూల్స్ చెప్పుకుంటున్నారు. అలా కాకుండా పోలవరానికి కేంద్రం నిధులివ్వకపోతే తనకు జరిగే నష్టం.., బీజేపీకి కూడా జరిగే నష్టాన్ని జగన్ వివరిస్తారు. సో.., ఇలా రాష్ట్రంలోకి కొన్ని కీలక అంశాలపై రాజకీయంగా ఒక స్పష్టత కోసం జగన్ ఢిల్లీ వెళ్లినట్టు చెప్పుకోవచ్చు. అందుకే రాజధాని ఒకటా..? మూడా..? అనేది రాజకీయంగా రేపటితో తేలిపోవచ్చు..!?

 

 

author avatar
Srinivas Manem

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju