NewsOrbit
Featured బిగ్ స్టోరీ

జగన్ తో విజయ్ పోస్టర్ల హల్ చల్..!! తమిళ పాలిటిక్స్ లో ఏపీ సీఎం..!!

అజిత్ తో పాటుగా జగన్-ప్రశాంత్ కిశోర్  ఫొటోలు

విజయ్ ఫ్యాన్స్ హంగామా..అసలు ఏం జరుగుతోంది…

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్ యూత్ స్టార్స్ కు స్పూర్తి గా మారుతున్నారా. ఏపీలో చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ ఇండ్టస్రీని 2019 ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు చేసిన జగన్ ఆదర్శంగా నవ యువ పొలిటికల్ నేతలు ముందుకు కదులుతున్నారు. వారి అభిమానం జగన్ ఫొటోలు పెట్టి మరీ తమ హీరోలకు స్పూర్తి జగన్ అంటూ చెప్పకనే చెబుతున్నారు. ప్రతీకార రాజకీయాలకు చిరునామా అయిన తమిళనాడులో ఇప్పుడు హీరో విజయ్ తో పాటుగా కలిసి ఉన్న జగన్ పోస్టర్లు..ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళనాట హీరోలకు ఉండే అభిమానులు తమ హీరోల కోసం దేని కైనా సిద్దపడతారు. త్వరలో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో అన్నా డీఎంకే వర్సెస్ డీఎంకే అన్నట్లుగా ఉండే పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో విజయ్ కాంత్ పూర్తిగా నీరసపడ్డారు. ఈ సమయంలో కొత్తగా హీరో విజయ్ తంత్రి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఎన్నికల సంఘంలో దరఖాస్తు చేసారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ తో పాటుగా స్టాలిన్ సైతం హాజరయ్యారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా..అందులో ఏపీ సీఎం జగన్ ఫొటో ఇప్పుడు అటు తమిళనాడు..ఇటు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

cm-jagan-flexies-along-with-hero-vijay-became-viral-in-tamilanadu-politics
vijaya file with ys jagan

తమిళనాట జగన్ పోస్టర్ల హల్ చల్..

తమళినాడులో సినీ హీరోలకు ఉండే అభిమానుల దూకుడు తెలుగు హీరోల అభిమానులతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తమ హీరోలను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక, ఇప్పుడు తమిళనాట ఎన్నికల మూడ్ వచ్చేసింది. హీరో రజనీ కాంత్ తన రాజకీయ ప్రయాణం పైన పూర్తి క్లారిటీ ఇవ్వటం లేదు. అన్నా డీఎంకే లో నాయకత్వ పోరు నెలకొంది. డీఎంకేలో ఇప్పుడిప్పుడే అసమ్మతి స్వరాలు పెరిగి బీజేపీ వైపు వలసలకు కారణమవుతున్నాయి. ఇదే సమయంలో సడన్ గా హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం హీరో విజయ్ కు సంబంధించిన కార్యాలయాల పైన ఐటీ దాడులు జరిగాయి. ఆ తరువా విజయ్ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ దిశగా విజయ్ తండ్రి చేస్తున్న ప్రయత్నాలు కొత్త చర్చలకు కారణమవుతున్నాయి. ఈ సమయంలో హీరో విజయ్ అభిమానులు తమ హీరోతో పాటుగా ఏపీ సీఎం జగన్…పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తో ఉన్న ఫోటోలను..బ్యానర్లను..ఫ్లెక్సీలతో హల్ చల్ చేయటం ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. జగన్ ..విజయ్ మధ్య ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధాలు లేవు. అదే విధంగా ప్రశాంత్ కిశోర్ సైతం విజయ్ తో కలిసి రాజకీయంగా పని చేయటానికి సిద్దంగా ఉన్నట్లు గా ఎక్కడా చెప్పలేదు. కానీ, ఇప్పుడు ఈ పోస్టర్లు అనేక వాదనలకు కారణమవుతున్నాయి.

 

cm-jagan-flexies-along-with-hero-vijay-became-viral-in-tamilanadu-politics
vijaya posters

జగన్ స్పూర్తి కోసమా..తెలుగు ఓటర్ల కోసమా

చెన్నైలో ఇప్పుడు దర్శనమిస్తున్న ఈ పోస్టర్ల వెనుక కారణం ఏంటనేది అక్కడి తెలుగు ప్రజల్లో ఆసక్తి కరంగా మారింది. ఏపీలో పార్టీ పెట్టిన సమయం నుండి అటు కేసులు..ఇటు రాజకీయంగా ఒడి దుడికులు ఎదురైనా ఎక్కడా వెనుకడగు వేయకుండా40 ఇయర్స్ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన జగన్ ను స్పూర్తిగా తీసుకోవాలని తమ అభిమాన హీరోకు చెప్పటమే వీటి వెనుక అభిమానుల ఉద్దేశమా అనేది ఒక చర్చ. అదే విధంగా జగన్ ఏ విధంగా అయితే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ను పక్కన పెట్టుకొని 2019 ఎన్నికల్లో ఒన సైడ్ విక్టరీ సాధించారో…అదే విధంగా తమ హీరో సాధించాలనేది వారి లక్ష్యమా అంటూ చర్చలు సాగుతున్నాయి. అయితే, అక్కడ డీఎంకే-అన్నా డీఎంకే లాంటి పార్టీలు తమిళనాడు రాజకీయాల్లో ఎవరినీ ఎదగనీయకుండా.. అధికారం ఆ రెండు పార్టీల మధ్యే పోరాటం గా మార్చేసాయి. అయితే, ఇప్పుడు జయలలిత-కరుణానిధి మరణంతో ఆ రెండు పార్టీల్లోనూ గతంలో ఉన్న పట్టు నేతలకు తగ్గింది. దీనినే బీజేపీ తనకు అవకాశంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఏ మాత్రం రాజకీయంగా అనుభవం లేని విజయ్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఏ పార్టీకి అయినా మిత్రపక్షంగా ఉంటారా..సొంతంగా బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది. అయితే, జగన్ – సూర్య మధ్య స్నేహం ఉంది. కానీ, విజయ్ తో ఎటువంటి సంబంధం లేని జగన్..ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనూ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇది తమిళనాడులో ఏ రకమైన ప్రభావం చూపుతుందో చూడాలి.

author avatar
DEVELOPING STORY

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju