NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

బీజేపీ ఎత్తులు..! సుప్రీం చీఫ్ జస్టిస్ కోసం జగన్ రిస్క్ గేమ్..! సంచలన కథనం

మోదీ – జగన్ కలయికపై అనేక పుకార్లు, అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..! జగన్ అడిగినవి, మోదీ చెప్పినవి అంటూ జాతీయ మీడియా సహా అనేక మీడియాల్లో రకరకాలుగా వండి వడ్డిస్తున్నారు..!! అఫ్ కోర్స్ మోదీతో కలయిక సందర్భంగా జగన్ తనకు కావాల్సినవి అడగడంలో ఆశ్చర్యం లేదు. “తన వ్యక్తిగత ఇబ్బందులు.., రాజధాని వికేంద్రీకరణకు, ఇతర అంశాల్లో న్యాయ సహాయం.., టీడీపీ అవినీతిపై సీబీఐతో విచారణ.., రాష్ట్రానికి నిధులు..! ఇవన్నీ సహజమే. ఇదే విధంగా బీజేపీ కూడా జగన్ ని ఎన్డీఏలో చేరమనడంలో ఆశ్చర్యం లేదు. అయితే..!!
ఈ కలయిక ఓ కీలక అంశం చుట్టూ తిరిగింది అనేది తాజాగా “న్యూస్ ఆర్బిట్” కి చిక్కిన సంచలన అంశం..! కొన్ని లాజిక్కులు క్షుణ్ణంగా పరిశీలిస్తే… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నియామకం కోసం జగన్ ద్వారా బాటలు వేస్తున్న బీజేపీ కొత్త ఎత్తుకి.., ఈ కలయిక వేదికగా మారింది అనేది ఒక పెద్ద అంశం..! అదెలాగో, అదేమిటో చూద్దాం..!!

బీజేపీ కొత్త ఎత్తులు ఇవే..!!

జగనూ – బీజేపీ మధ్య బంధం ఉన్నట్టే. అది ఎన్డీఏలో చేరితో వెలుతురులో.., చేరకపోతే చీకట్లో కొనసాగుతుంది. అయితే త్వరలో సుప్రీం కోర్టుకి కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించాల్సి ఉంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న జాబితాలో జస్టిస్ ఎన్వీ రమణ పేరు ముందు వరుసలో ఉంది. ఆ స్థానానికి రమణని నియమించాలి అన్నా, ఆపెయ్యాలి అన్నా బీజేపీకి కారణాలు కావాలి. అందుకు జగన్ ఒక పావు(దారి)గా ఉండాలి అనేది బీజేపీ ఎత్తు. ఎన్వీ రమణ మూలాలన్ని ఏపీలోనే ఉన్నాయి. ఆయనపై కొన్ని పాత కేసులున్నాయి. స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు చేసిన ధర్నా కేసు.., హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం సమయంలో ఇచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం వివాదాస్పదమైంది. అయితే ఇవేమీ లీగల్ గా నిలబడలేదు, తర్వాత కొట్టేశారు. తాజాగా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులోనూ ఆయన బంధువులకు భూములున్నాయని కొన్ని ఆరోపణలున్నాయి. అంటే ఈ కారణాలు బూచిగా చూపించి రమణని ఆపేయాలన్నా…! లేదు.., “ఇదిగో నీపై ఇన్ని ఉన్నా నీకు ఆ స్థానం ఇస్తున్నాం. కాస్త చూసుకోవోయ్” అని చేయి అందించాలన్నా ఈ అంశాలే కీలకం. అందుకే జగన్ ని దువ్వి, జగన్ ద్వారా కొన్ని పాయింట్లు పట్టుకుని.., ఆ స్థానాన్ని శాసించాలి అనేది బీజేపీ వేసిన ప్లాన్ కావచ్చు.

అయితే… ఈ డేంజర్ గేమ్ లో జగన్ ఎందుకు దూరినట్టు..!?

అన్నిటి కంటే ముఖ్యంగా జగన్ ఇప్పుడు అత్యంత డేంజర్ గేమ్ (తన 16 నెలల పాలనలో ఇదే అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన వ్యవహారం)లో దూరడం పెద్ద సాహసమే. కానీ జగన్ కి ఇది అనివార్యం. “ప్రస్తుతం సుప్రీం జడ్జిగా ఉన్న జస్టిస్ రమణ… గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రతిపాదించబడి, నియమించబడ్డారు. పైగా రమణ, చంద్రబాబు ఒకే సామాజికవర్గం. అందుకే ప్రస్తుతం న్యాయవ్యవహారాలపై జగన్ కి పట్టు ఉండాలి అంటే ఈ రిస్క్ చేయాల్సిందే”..! తన పాత్ర పోషించాల్సిందే. అందుకే బీజేపీ గేమ్ లో జగన్ కూడా ఒక మార్గం. తన అవసరాలు తీర్చుకునే క్రమంలో జగనూ బీజేపీకి సై అనే అవకాశమూ లేకపోలేదు. ఇదన్నమాట లోతుగా వెళ్తే ఇన్ని అంశాలు ఉన్నాయి. సీఎంలు, పీఎంలు, చీఫ్ జస్టిస్ లు ఊరికే అయిపోరు..!!

author avatar
Special Bureau

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju