ఇది “రాజీ”కీయ జగన్మంత్రం…!

Share

పొలిటికల్ మిర్రర్

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎవరైనా…, ఎటైనా వెళ్లొచ్చు, రావచ్చు. అలా, అలా తిరగేసి చక్కర్లు కొట్టొచ్చు. లేకపోతే రాజకీయ బండి నడవదు. పాపం ఇవి తెలుసుకోలేని జగన్ “నైతిక విలువలు” అని…, “మాట తప్పను, మడమ తిప్పను” అని…, పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై “అదే రోజున అనర్హత వేటు” వేసేయ్యాలని… చెప్పుకొచ్చారు. సీఎం కాకమునుపు ఏ మీటింగ్లో అయినా, ఏ వేధికపై అయినా, ఏ సందర్భంగా అయినా ఆ 23 మంది, ఆ 23 మంది అంటూ చెప్పేవారు. ఇప్పుడో…! ఆహా…, మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంట…? పార్టీ కండువా వేయకపోతే మాత్రం రహస్యంగా ఉండిపోతుందా ఏంటి..? ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై నాడు అంతగా గోల చేసిన జగన్ నేడు అసలు ఇలా చేర్పులు విషయంలో “రాజీ”కీయం చేయడానికి కారణం ఏంటి? ఆయన వేస్తున్న జగన్మంత్రం ఏంటి? అనేది కాస్త తెలుసుకుందాం.

151 మంది ఉన్నారుగా… ఇంకా ఎందుకు??

నాడు చంద్రబాబు వెంట ఉన్న ఎమ్మెల్యేలు 106 మంది మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కి 18 మంది ఎక్కువ. అందుకే కాస్త ఆందోళన, ఆత్మన్యూనతా, అభద్రతా భావంతో నెమ్మదిగా 23 మందిని లాగేసారు. ఇది జగన్ కి విపరీతంగా కోపం తెప్పించింది. అందుకే తరచు వారిపై, బాబుపై, టీడీపీపై తెగ విమర్శలు చేసేవారు. మరి నేడు జగన్ వెంట 150 మంది ఉన్నారు. బోలెడు మంది. అసెంబ్లీలో ఏ బిల్లు అయినా, ఏ మాట అయినా ఈజీగా చెల్లుబాటు అవుతుంది. అయినా జగన్ టీడీపీ ఎమ్మెల్యేలపై కన్నేశారు. చకచకా లాగేస్తున్నారు. మొదట వల్లభనేని వంశీ, తర్వాత మద్దాలి గిరి, ఇప్పుడు కరణం బలరాం… ఇంకో ఆరుగురు రెడీగా ఉన్నారట. కాస్త మాట్లాడి సెట్ చేస్తే 12 మంది వచ్చేస్తారని వైసిపి వర్గాల టాక్. అంటే నెలో, రెండు నెలల్లోనో వీళ్ళు రావడం ఖాయమేనని తెలుస్తుంది. ఇక్కడే జగన్ “నాడు తాను మాట్లాడిన నైతిక విలువలు, పార్టీ మార్పు, సంతలో పశువులు” అనేవి మర్చిపోయారు. నాడు చంద్రబాబు చేర్చుకుంటే సంతలో పశువుల్ని కొన్నట్టు…!! నేడు జగన్ చేర్చుకుంటే మార్కెట్లో కూరగాయలు కొన్నట్టా…? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా పార్టీ కండువా వేయకుండా, కేవలం తమకు మద్దతు మాత్రమే ఇచ్చేలా స్కెచ్ ఒకటి వేసుకుని అమలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం ఈ చేరికల ప్రధాన లక్ష్యం “చంద్రబాబుని ఒంటరి చేయడం, టీడీపీని పతనం చేయడం”. జగన్ మనస్తత్వాన్ని బాగా ఎరిగిన వారు ఆయన పార్టీలో చేర్చుకోవడం పెద్దగా నమ్మట్లేదు. ఎన్నికలకు ముందు జగన్ని నమ్మి వస్తే మనసుతో నమ్మి వచ్చినట్టు… ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తే… పనుల కోసం వచ్చినట్టు. అని బాగా తెలిసిన వాడు జగన్. అందుకే ఒకసారి చేరిన తర్వాత కనీసం మళ్ళీ మొహం కూడా చూసేందుకు ఇష్టపడని తత్వం అని సీఎం సన్నిహితులు చెప్తుంటారు.

బాబుపై నమ్మకం లేకేనా…!

ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ జరుగుతున్నారు. 23 మందిలో ముగ్గురు వెళ్లగా, 20 మంది మిగిలారు. మరో ఆరుగురు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీలో అంతర్గత వర్గాలకు కూడా తెలుసు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నట్టు…? వారిని ఆపలేరా?? అంటే… ఆపలేరు. ఏమి చేయలేరు. చంద్రబాబు ప్రస్తుతం ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. వీడుతున్న ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పాలంటే “పార్టీకి భవిష్యత్ చూపించాలి”…! “తనకి ప్రత్యామ్నాయం చూపించాలి”..! “జగన్ తో, వైసీపీతో మొండిగా పోరాడాలంటే కనీసం కేంద్రం అండ చూపించాలి”…! “2024లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించాలి. ఆర్ధిక లక్ష్యాలు నెరవేర్చాలి”…! ఇవేమీ చంద్రబాబు ప్రస్తుతం చేసే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీకి బలం పెరుగుతుంది. పథకాల పేరిట జగన్ మంత్రం వేస్తున్నారు. పథకాల లబ్దిని రుచి చూస్తున్న జనం అభివృద్ధి ఉందా? ఆగిందా? అనేది పట్టించుకోవడం లేదు. అంటే ఒక రకంగా జగన్ ఒక చేతిలో తినిపిస్తున్న “బెల్లం ముక్క”ని తింటూ, ఆస్వాదిస్తున్నారే తప్ప రెండో చేతిలో భవిష్యత్తుని పెద్దగా ఆలోచించట్లేదు. అందుకే వైసీపీకి ఇప్పుడు వచ్చే కష్టం, నష్టం ఏమి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బాబుకి టీడీపీలో ప్రత్యామ్నాయం తయారుకాలేదు. ఎవరూ పార్టీని నడిపే సమర్ధతలో లేరు. కేంద్రం పెద్దలతో పొసగడం లేదు. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య కష్టంగా టీడీపీలో ఉండలేక కొందరు ఎమ్మెల్యేలు, మాజీలు జగన్నామ స్మరణ చేసుకుంటూ జగన్మంత్రం పఠిస్తున్నారు.

మరి 2024లో సర్దుబాట్లు ఎలా…?
వైసీపీలో చేరికలతో కిటకిటలాడుతోంది. నాడు చంద్రబాబు కూడా ఇలాగే చేసి ఎన్నికల సమయాన సీట్ల సర్దుబాటులో ఇబ్బంది పడ్డారు. అందుకే సీట్ల కేటాయింపులో తేడా కారణంగా కొన్ని స్థానాలు కోల్పోయారు. మరి ఇలాగే చేరికలు ఉంటే 2024 నాటికి వైసిపి పరిస్థితి ఇంతేనా?? అని ప్రశ్నలు వస్తున్నాయి.
ఉదాహరణకు నిన్న పార్టీలో చేరిన కరణం బలరాం చీరాల ఎమ్మెల్యే. అక్కడ ఇది వరకే రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటికీ బలంగా ఉన్నారు. ఆయనను కాదని, వచ్చే ఎన్నికల్లో కరణంకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అద్దంకి కేటాయించాలన్నా… ఇక్కడ టికెట్ పై వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ప్రస్తుత ఇంచార్జి బాచిన చెంచు గరటయ్య వేచి ఉన్నారు. ఇదే పరిస్థితి గుంటూరు పశ్చిమ, కనిగిరి, గన్నవరంలోనూ ఉంది. మరి నాలుగేళ్ళ తర్వాత కేటాయింపు కదా ఇప్పటి నుండే ఎందుకు ఆలోచన, కంగారు అంటే… రాజకీయం అంటే అంతే. అయిదేళ్ల లక్ష్యాలే ఇక్కడ ఇంపార్టెంట్. పార్టీలో ఇటీవల చేరిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తన అంతరంగీకులతో మాట్లాడుతూ…”2024లో టికెట్ హామీ తోనే వైసీపీలో చేరాను” అంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ పరిస్థితి ఏమైనట్టు. ఈయన కూడా కదిరి బాబూరావు చేరికపై అసలు పట్టించుకోవట్లేదు. ఆయనకు అంత సీన్ లేదు. వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అంటున్నారట. ఇలా ఇప్పటి నుండే అంతర్గత యుద్ధం మొదలయ్యింది.

శ్రీనివాస్ మానెం


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

22 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

46 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago