NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఢిల్లీలో వేగంగా కదులుతున్న “న్యాయ” పావులు..! జాగ్రత్త పడాల్సింది జగనే..!!

బీజేపీ ఏం చేస్తుంది..? సీఎం జగన్ తదుపరి అడుగులు ఏమిటి..? జస్టిస్ రమణ తరపున చర్యలు ఎలా ఉండబోతున్నాయి..!? ఇవన్నీ గడిచిన మూడు రోజులుగా మెదులుతున్న ప్రశ్నలు..! ఏపీలో న్యాయవ్యవస్థకు.., ప్రభుత్వానికి మధ్య పోరు ఢిల్లీకి చేరింది. ఇక ఏం జరిగినా ఢిల్లీలోనే జరగాలి. సీఎం తన తదుపరి అడుగులను ఢిల్లీలోనే వేయాలి.., న్యాయవ్యవస్థ అక్కడి నుండి ఎదుర్కోవాలి. బీజేపీ అక్కడి నుండే చూస్తూ ఉండాలి..!! జగన్ తన రెండో దశ పోరుకి సిద్ధమవుతున్న తరుణంలో న్యాయవ్యవస్థ నుండి జగన్ కి వ్యతిరేక అడుగులు చకచకా పడిపోతున్నాయి. ఇప్పుడు అప్రమత్తం కావాల్సింది జగనే..!!

ఒకేరోజు న్యాయవ్యవస్థ “రెండు ప్రతిచర్యలు”..!!

ఒక చర్యకు ప్రతిచర్య ఉంటుంది. (There is a reaction to every action ). ఇక్కడ జగన్ మొదట చర్య మొదలు పెట్టారు. ఢిల్లీ నుండి ఈరోజు ప్రతిచర్య వచ్చింది.

* సుప్రీమ్ లో జగన్ కి వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలయింది. “30 కి పైగా క్రిమినల్ కేసులు.., మనీ లాండరింగ్ కేసులు ఉన్న జగన్ జస్టిస్ ఎన్వీ రమణపై తప్పుడు ఆరోపణలు చేయడం అధికార దుర్వినియోగమే. ఇది ప్రజల్లో న్యాయవ్యవస్థపై చులకన భావాన్ని కలిగిస్తుంది. జగన్ ని సీఎం పదవి నుండి తొలగించాలి” అంటూ సుప్రీమ్ కోర్టు అడ్వకేట్లు జీఎస్ మని, ప్రదీప్ కుమార్ కలిసి పిటిషన్ వేశారు. జగన్ చేసిన ఆరోపణలపై విశ్రాంత న్యాయమూర్తులు లేదా సీబీఐ చేత విచారణ చేయించాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు.

పరోక్షంగా బీజేపీ పాత్ర స్పష్టమే..!!

బార్ అసోసియేషన్లు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీల గొడుగు కింద ఉండడం సహజమే. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ వైసీపీకి అనుకూలంగా.., ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. జగన్ న్యాయవ్యవస్థతో పోరు విషయంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏమాత్రం స్పందించలేదు. సహజంగా తప్పు ఎవరిది ఉన్నా.., బార్ అసోసియేషన్లు అంటే న్యాయవ్యవస్థకు మద్దతుగా ఉంటాయి. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం జస్టిస్ రమణకు మద్దతుగా నిలవలేదు. కానీ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం ఈరోజు జగన్ కి వ్యతిరేకంగా పెద్ద ఖండన ఇచ్చింది. “జస్టిస్ రమణకి పూర్తి మద్దతు తెలుపుతూ.., జగన్ తీరుని తప్పు పడుతూ, జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర పదాలనే వాడింది. అంటే ఇక్కడ బీజేపీ వైఖరి అర్ధం చేసుకోవచ్చు. తన అనుకూల బార్ అసోసియేషన్ ని బీజేపీ ఏమాత్రం నియంత్రించలేదు..? అనేది ఆలోచించాల్సిన విషయం..!

Justice NV Ramana: in Confusion about his First Case?

* ఈ వ్యవహారం మొదలు పెట్టక ముందే సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే కదా..! ఆ సందర్భంలో “నేను ఇలా చేయబోతున్నాను” అని బీజేపీకి కేవలం సమాచారం ఇచ్చారా..? లేదా బీజేపీ పెద్దల అనుమతి తీసుకున్నారా..? లేదా బీజేపీతో కలిసి ఏకాభిప్రాయంతో చేశారా..? అనే సందేహాలు అందరిలోనూ ఉండేవి. కానీ ఒక్క లాజిక్కు ద్వారా సమాధానం స్పష్టమే. “ఈరోజు పరిణామాలు చుస్తే బీజేపీకి కేవలం సమాచారం మాత్రమే ఇచ్చి జగన్ తన చర్యలు మొదలు పెట్టినట్టు” అర్ధం చేసుకోవచ్చు. మరి ఇది మొత్తం ముందే తెలిసిన బీజేపీ ఎందుకు జగన్ ని నియంత్రించలేదు..? న్యాయవ్యవస్థతో మనకెందుకు అని జగన్ కి ఎందుకు సర్ది చెప్పలేదు..!? పోనీ తమకు అనుకూలంగా ఉండే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ని “ఎలాగూ జగన్ కి అనుకూలంగా ఉంచలేదు సరికదా..! కనీసం తటస్థంగా అయినా ఎందుకు ఉంచలేదు..!? అనేది ఆలోచించాల్సిన కీలక పాయింటు..! తెరపై విడుదలవుతున్న సినిమాను చూద్దామని బీజేపీ ముందే ఫిక్సయిందా..?? చూద్దాం.! బీజేపీ వ్యవహారం.., లోతుగా కాస్త ఘాటుగా రేపు చెప్పుకుందాం..!!

 

 

 

 

 

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju