NewsOrbit
Featured బిగ్ స్టోరీ

ఆపరేషన్ “కుప్పం” మొదలు…! జగన్ పదునైన వ్యూహం…!

Kuppam TDP - Leaders Resigned Exclusive

వంశీ వస్తేనేమి… రాకపోతేనేమి..! బలరాం లాంటి వాళ్ళు చేరితేనేమి, చేరకపోతేనేమి…? గంటా చేరికతో వైసిపికి ఒరిగేదేంత…?? ఇవన్నీ జగన్ కి ఒక చిన్న భాగం మాత్రమే. జగన్ ఇవేమి పట్టవు. “వస్తారా…? ఒకే రండి, ఒక మూల జాగ్రత్తగా ఉండండి. తోక జాడిస్తే కత్తిరిస్తా” అనే రకం జగన్. జగన్ టార్గెట్ వేరు, జగన్ లక్ష్యం వేరు…! అదే చంద్రబాబుని మాజీ ఎమ్మెల్యేని చేయడం. ప్రస్తుతానికి చంద్రబాబుని మాజీ ముఖ్యమంత్రిగా మార్చిన జగన్ ఇక బాబీని మాజీ ఎమ్మెల్యేగా మార్చడానికి సుదీర్ఘ వ్యూహాన్ని రచించి, అమలు చేస్తున్నారు. “కుప్పం”లో బాబుని ఓడించడానికి పావులు కదుపుతున్నారు.

ఆపరేషన్ “కుప్పం” మొదలు…!

ఎస్.., ఆపరేషన్ కుప్పం మొదలయింది. ఇక్కడ పావులు వేసేది సీఎం జగన్… అక్కడ అమలు చేసేది మంత్రి పెద్దిరెడ్డి. బలంగా, జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా.., దశలవారీగా వెళ్తున్నారు. వారం కిందట మొదలైన ఈ ప్రక్రియ నెమ్మదిగా.., 2023 వరకు కొనసాగుతుంది. “ఒక మహా వృక్షాన్ని నరకాలంటే.. ముందుగా చిన్న కొమ్మలు.., చిన్న ఊడలు.. మొదలుకుని తర్వాత పెద్ద కొమ్మలు, పెద్ద ఊడలు… ఆపై మొదలు నరికి, చివరిగా వేర్లు పీకేయాలి. అదే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పధ్ధతి. ఆరు దశల ఈ ప్రక్రియలో ఇప్పుడు మొదటి దశను అమలు చేస్తున్నారు.

 

 

 

Kuppam TDP - Leaders Resigned Exclusive

ఇదే ప్రణాళిక..! అవసరం మేరకు మార్పులు…!

ఆరు దశల్లో కుప్పంలో చంద్రబాబు హవా తగ్గించాలి. 2024 ఎన్నికల్లో ఆయన్ను ఓడించాలి. అందుకు
* కుప్పంలో మండలాలు వారీగా చంద్రబాబుకి నమ్మకంగా ఉంటూ.., బాబు లేకున్నా పార్టీని, ఎన్నికలను నడిపిస్తున్న నాయకులను లాగెయ్యడం మొదటి దశ. సామజిక వర్గాల వారీగా కీలక నాయకులకు వైసిపిలో చేర్చుకోవడం.

* మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకి అత్యంత నమ్మకంగా కుప్పంలో పని చేస్తున్న నాయకులకు గాలం వేయడం. వారికి అడిగినవి ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం.

* ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 350 ముస్లిం, బీసీ కుటుంబాలను వైసిపిలో చేర్చుకున్నారు. వీరిలో బాబుకి బాసటగా నిలిచినా ప్రాంతాల వారున్నారు.

* ఇక బూతుల వారీగా బాబుకి అత్యంత బలంగా ఉన్న శ్రేణులను చెల్లాచెదురు చేయడం. బాబుకి ఉన్న తమిళ ఓట్లు తొలగించడం.., అవసరమైతే వైసిపి అనుకూల ఓట్లను చేర్చడం… ఇలా పక్కదారిలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమే.

 

* మరో దశలో భాగంగా కుప్పంలో జగన్ ఓ బహిరంగ సభ నిర్వహించి, వరాల జల్లులు కురిపించి, 2024 నాటికి ఒక పెద్ద ప్రాజెక్టు ఇచ్చి ఫలితం చూపించడం. ఇక ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న బీసీ సామజిక వర్గ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి కీలకం చేయడం..! ఇలా అనేక ఎత్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం పార్టీలో చేరికలు మాత్రమే అయ్యాయి. దీన్ని ప్రస్తుతానికి చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారు. తన బలం అక్కడ తగ్గదని ధీమాలో బాబు ఉన్నారు.

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju