ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదు అనేది YSR Congress Party సీఎం జగన్ YS Jagan Mohan Reddy గట్టి కోరిక..! ఎలాగైనా తాను రిటైర్ అయ్యేలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనేది Nimmagadda Ramesh Kumar నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలమైన ఉవాచ..! ఈ ఇద్దరి కోరికల చుట్టూ ఎన్నికలు అంశం AP High Court నలుగుతుంది..!!
రెండు వ్యవస్థలకు చెందిన.. రెండు భిన్న వర్గాలకు చెందిన.. రెండు భిన్న ఆలోచనలతో వెళ్తున్న ఈ ఇద్దరితో కోర్టులు కూడా కోర్టులు కూడా మెలికలు ఇస్తున్నాయి. ఇదిగో నిమ్మగడ్డకి ఊరట అనుకునే లోగా.. జగన్ కి అనుకూల తీర్పు వస్తుంది. హమ్మయ్య.., ఇక జగన్ గెలిచినట్టే అనుకునే లోగా నిమ్మగడ్డకి పాజిటివ్ ఉండే తీర్పు వస్తుంది. న్యాయవ్యవస్థలోని లోపాలు, నిబంధనలు, న్యాయ సూత్రాలు అనుసరించి ఒకరిపై ఒకరు పెత్తనం కోసం కోర్టులను వాడుకుంటున్నారు. ఈరోజు “స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు హైకోర్ట్ ఒకే చెప్పినంత మాత్రాన అయిపోలేదు..!” ఇంకా జగన్ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఏమైనా చేసి మరో 40 రోజులు సమయం వృథా చేయడమే జగన్ కి అతి పెద్ద పని..!!

సుప్రీమ్ కి వెళ్లడం మొదటి మార్గం..!!
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేయడం సీఎం జగన్ ముందున్న మొదటి మార్గం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎందుకు జరపవద్దొ.., ప్రభుత్వ ఆలోచన ఏమిటో వివరిస్తూ.. కొన్ని న్యాయ సూత్రాలకు అనుగుణంగా సుప్రీమ్ లో పిటిషన్ వేయొచ్చు..! ఇదే జరిగితే సుప్రీమ్ ఏమి జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తోంది అని చెప్పలేం. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరిగిన కోణంలోనే సుప్రీమ్ ఆలోచిస్తుంది కాబట్టి… ఏ రాష్ట్రంలోనూ లేని ఇబ్బంది మీకేమిటి..? అని సుప్రీమ్ ప్రశ్నించినా ప్రశ్నిస్తుంది. అప్పుడు జగన్ కి ఇబ్బందులు తప్పవు. అందుకే అన్ని కోణాల్లో అలోచించి, సుప్రీమ్ లో పిటిషన్ విషయంలో సీఎం చాకచక్యముగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సహాయ నిరాకరణ.. రెండో మార్గం..!!
ఎన్నికలు జరగాలంటే కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వలన మాత్రమే కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి నుండి, డీజీపీ నుండి జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, గ్రామస్థాయిలో సిబ్బంది కూడా సహకరించాలి. ఎన్నికల కమీషన్ చెప్పించి చేయాలి. సో.., వీళ్ళు లేకుండా ఎన్నికలు నిర్వహణ ఇసుమంత కూడా సాధ్యం కాదు. అందుకే సైలెంట్ గా.., ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా.. తమకు ఏమి ఎరగనట్టు.. సహాయ నిరాకరణ చేయడం మరో మార్గం. ఇది కూడా జగన్ ఆలోచిస్తున్న ఒక కీలక అంశం. ఇది జరిగితే కోర్టు ధిక్కరణ అనే వీలుంది.. కాకపోతే కోర్టు ధిక్కరణ కేసులు ప్రభుత్వానికి, కొందరు అధికారులకు కొత్త కాదు కాబట్టి.. కొంచెం రిస్క్ అయినా ఈ మార్గంలో వెళ్లినా వెళ్లొచ్చు.., ఆశ్చర్యం అవసరం లేదు.
వివిధ సంఘాల ద్వారా పిటిషన్లు మరో మార్గం..!!
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పని చేయడానికి వివిధ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు.., పోలీసు సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఏ నిర్ణయానికి అయినా కట్టుబడి ఉంటాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు మీడియాలో ప్రకటనలిస్తున్నాయి. అందుకే తమ ఇబ్బందులు చెప్తూ.., తమ వాదనని వినిపిస్తూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ లు దాఖలు చేయొచ్చు. అదే జరిగితే.., కీలక పాయింట్లు పట్టుకుంటే వారు గెలుస్తారని చెప్పలేం కానీ.., కొంత మేరకు సమయం వృథా అవుతుంది. ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. సమయం వృథా కావాలి. మార్చి వరకు కాలక్షేపం జరగాలి.. లేదా స్థానిక ఎన్నికలు ఆగాలి. వివిధ మార్గాల్లో పిటిషన్లు వేయడం ద్వారా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది.
* ఇక ఫైనల్ గా మరో మార్గం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దు అంటూ నెలరోజుల కిందట ఏపీ శాసనసభలో చేసిన తీర్మానం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఒకవేళ దీనిపై గవర్నర్ సంతకం చేసేస్తే.. బిల్లు ఆమోదం అవుతుంది. అంటే.., బిల్లుని దాటి, కాదని ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదు అంటూ వాదనలు వినిపించవచ్చు..!! అందుకే ఈ మార్గం ఎంచుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు. సో.., జగన్ X నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ ఇంకా ఉంది. జగన్ చేతిలో ఆయుధాలు ఇంకా ఉన్నాయి..!!