NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

CM YS Jagan 1000 Days: జగన్ కి మళ్ళీ ఓట్లేస్తరా..!? వెయ్యి రోజులు.. లక్ష అవకాశాలు.. కోటి ఆశలు.. మరి తప్పులు..!?

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

CM YS Jagan 1000 Days: నిరుద్యోగ యువతకు ఉపాధి బాట వేయడం లేదు.. కానీ వారి ఇళ్లకు సంక్షేమ పథకాలు పంపిస్తున్నారు..!

రైతుకు రకరకాల రాయితీ ఇవ్వడం లేదు.. కానీ అండగా నిలవాలని రైతు భరోసా అందిస్తున్నారు..!

కార్పొరేట్ ఫీజులపై అదుపు పెట్టడం లేదు.. కానీ చదువు ఖర్చులకూ అమ్మఒడిని వేస్తున్నారు..!

ఉద్యోగులకు అడిగినవి ఇవ్వడం లేదు.. కానీ తలకు మించిన భారంతో పీఆర్సీ తదితరాలు అంగీకరించారు..!

జనం జేబులో డబ్బులు ఇస్తున్నారు.. వేస్తూనే ఉన్నారు.. ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు రావు, ప్రగతి పనులు జరగడం లేదు.. మరి జగన్ వెయ్యి రోజుల పాలనకు ఏం పేరు పెడదాం..!? సంక్షేమ సారధి అంటే సరిపోతుందా..!? ప్రగతి రథ సారధి అవసరం లేదా..!? ఈ అంశాన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం..!

రాష్ట్రంలో వైైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు అభినందనలు తెలియజేస్తున్న ఫోటోలు, వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ వెయ్యి రోజుల పరిపాలన తీరును విశ్లేషిస్తే జగన్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చు..? అనేది ఇక్కడ పరిశీలన చేద్దాం. వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ వెయ్యి రోజుల్లో ఏమి చెప్పారు.. ? ఏమి సాధించారు.. ? ఏమి సాధించారు..? ఏమి చేయలేదు..? అనేవి చూస్తే…జగన్మోహనరెడ్డి సంక్షేమ
పథకాల అమలులో దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచిపోతారు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన, అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో ఇంతగా అమలు జరగడం లేదు. ఏపిలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు అంతే లేదు. అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, విద్యా కానుక, కాపు నేస్తం, జగన్న చేదోడు, చేయూత ఇలా చాలా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేదు అని చెప్పవచ్చు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒక్కో కుటుంబానికి రూ. లక్షో.., రూ. లక్షో 20 వేలో లబ్ది చేకూరుస్తూనే ప్రభుత్వం వాళ్లకు తెలియకుండానే తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తుందనే విమర్శ ఉంది. అయితే వేలకు వేల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు జేబులోకి వచ్చి పడుతున్నాయి కాబట్టి ఈ చిన్న మొత్తాల్లో పెరిగిన ఖర్చుల భారం ప్రజలకు తెలియడం లేదు. ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి 50 నుండి 60 మార్కులు వేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?
CM YS Jagan 1000 Days How Many Marks

CM YS Jagan 1000 Days: సంక్షేమ చాలా..!? అభివృద్ధి వద్దా..!?

కానీ పరిపాలనలో ఉన్న నాయకుడు తాము కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చి గెలుస్తాము అని పొరబాటు పడినట్లే. పరిపాలన అంటే సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలి. సంక్షేమ పథకాల మీదనే ప్రభుత్వాలు నిలబడతాయి అని అనుకుంటే తమిళనాడులో శాశ్వతంగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఆద్యులు తమిళనాడు పార్టీలే. తమిళనాడులో మిక్సీలు ఇస్తారు. టీవీలు ఇస్తారు. గ్రైండర్లు ఇస్తారు. లాప్ టాప్ లు ఇస్తారు, కంప్యూటర్లు ఇలా ఇస్తుంటారు. అవసరమైతే విగ్ లు కూడా ఇస్తారు. సంక్షేమ పథకాలకు ఓట్లు రాలితే తమిళనాడులో ఒకే పార్టీ అధికారంలో ఉండాలి. అక్కడి దాకా ఎందుకు ఇటీవల తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం కింద కుటుంబానికి పది లక్షలు పంపిణీ అంటూ పథకాన్ని తీసుకువచ్చారు. కానీ ఓట్లు వచ్చాయా అంటే రాలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా రైతు భరోసా ఇచ్చారు. పసుపు కుంకుమ కింద పదివేల వంతున మహిళలకు ఇచ్చారు. రైతు రుణ మాఫీ చివరి విడత ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇచ్చారు. పెన్షన్ మొత్తాన్ని రూ. 200ల నుండి రూ. 2వేలకు పెంచారు. అనేక రాయితీలు ఇచ్చారు. అయినా ఆయనకు జనాలు ఓట్లు వేయలేదు. ప్రజలు సంక్షేమ పథకాలను అంతగా పట్టించుకోరు అనేది వీటిని బట్టి వైసీపీ తెలుసుకోవాలి.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?
CM YS Jagan 1000 Days How Many Marks

దేనికి ఎన్ని మార్కులు.. ఎన్ని మార్పులు..!?

రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి వందకు 25 మార్కులు మాత్రమే వేసుకోవాలి. రోడ్ల పనులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నాయి. 70 శాతం ప్రాంతాల్లో జరగడం లేదు. ప్రధానంగా ఎవరూ టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. కమిషన్ల కారణంగానో, బిల్లులు వస్తాయో రావో అన్న అపనమ్మకంతోనో కాంట్రాక్టర్ లు ముందుకు రావడం లేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చెప్పుకోవడానికి కియా పరిశ్రమ అనేది ఒకటి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడేళ్లలో ఒక పెద్ద పరిశ్రమ తెచ్చాము అని చెప్పుకోవడానికి ఏమి లేదు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, ప్రగతి విషయంలో వైసీపీ వెనుకబడింది అనేది కాదనలేని వాస్తవం. ఈ విషయంలో ప్రభుత్వానికి వందకు 20 -25 మార్కులే వస్తాయి. ఉత్తమ పరిపాలన అంటే జనంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ ప్రాంతంలో సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రచ్చబండ పేరుతో కార్యక్రమాలను నిర్వహించే వారు. సమస్యలను వెంటనే పరిష్కరించే వాళ్లు. ఈ ప్రభుత్వంలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ లో రాయితీలు ఎత్తేశారు. విత్తనాల రాయితీలు ఎత్తేశారు. ఎరువుల ధరలు పెరిగాయి.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?
CM YS Jagan 1000 Days How Many Marks
  • ధరలు పెరిగినా రాయితీలు ఎత్తివేయడం రైతులకు ఇబ్బందిగా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగ ప్రకటనలు లేక నిరుద్యోగులు నిరుత్సాహానికి గురి అవుతున్నారు. చాలా వర్గాల్లో ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ వెయ్యి రోజుల పరిపాలనలో జగన్మోహనరెడ్డికి వందకు సగం (50) మార్కులు మాత్రమే వేసుకోవచ్చు.. పథకాలు ఇచ్చారు కాబట్టి ఈ పరిస్థితి అయినా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రెండున్నరేళ్ల పాలనే కీలకం కానుంది. ఈ రెండున్నరేళ్లలో జగన్మోహనరెడ్డి అభివృద్ధి చేస్తారా చేయారా.. ?పరిశ్రమలు తీసుకువస్తారా.. ? తీసుకురారా.. ? ప్రాజెక్టులు కడతారా కట్టారా..? రాజధాని విషయంలో మూటగట్టుకున్న అపఖ్యానితి పోగొట్టుకుంటారా ..? లేదా, పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తారా ఇవ్వరా .. ? అనేది చూడాలి. వీటి బట్టి ప్రభుత్వ భవిష్యత్తు అధారపడి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. రాబోయే రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాలకు తోడుగా అభివృద్ధిపైనా దృష్టి పెడితే ఈ ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలు ఆదరిస్తారు అని చెప్పవచ్చు.

author avatar
Srinivas Manem

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !