NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

వస్తాడు.. నటిస్తాడు.. దోచేస్తాడు… ఈ పగటి చోరగాడు మహా డేంజర్

 

మీ అపార్ట్మెంట్ వద్దకు ఎవరైనా వస్తున్నారా?? అనుమానాస్పదంగా తచ్చాడుతున్నారా?? పదేపదే అటు ఇటు తిరుగుతూ అడిగిన వారికీ ఆడో రకంగా సమాధానం ఇస్తున్నారా?? అయితే కచ్చితంగా మీరు… మీ చుట్టూ పక్కల వారు, మీ అపార్ట్మెంట్ లో ఎదో జరగబోతుంది అని గుర్తించండి… లేదా ”సూర్యా భాయ్” దొంగతనానికి తిరుగుతున్నాడని భావించండి….

ఎలక్ట్రీషియన్ గా పరిచయం చేసుకుని అపార్ట్ మెంట్ వాచ్ మెన్ లకు చెప్పి లిఫ్టులో రెండు మూడు సార్లు పైకి కిందకూ తిరుగుతాడు. సూర్య … తాళం వేసి ఉన్న ప్లాట్లను గుర్తిస్తాడు. మెట్ల మార్గంలో ప్లాట్ కు వెళ్లి తాళం పగలకొట్టి చోరీ చేస్తాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా హెల్మెట్ పెట్టుకుంటాడు. చోరీ, చోరీకి వాహనం మారుస్తాడు. దీంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగసాగాడు. ఒకటి కాదు రెండు కాదు
దాదాపు పిడెల్ల పాటు ఎంతో చాకచక్యంగా చోరీలు చేసిన సూర్య అనే కారుడు గట్టిన దొంగను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
** హైదరాబాద్ టోలీ చౌక్ పారామౌంట్ కాలనీకి చెందిన కాజాం అలీఖాన్, అలియాస్ సూర్య అన్న (28) చెడు వ్యసనాలకు బానిసై 16 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు చేయటం ఫ్రారంభించాడు. దొంగతనం చేసిన సొమ్ముతో గోవా వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. డబ్బు అయిపోగానే మల్లి ఓ కొత్త అపార్టుమెంట్లో కన్నం వేసేవాడు. కేవలం దొంగతనాలు పెద్ద పనిగా అతడి వ్యాపకం ఉండేది. లాక్ డౌన్ కంటే ముందు 70 చోరీలు చేసాడు, ఆ తర్వాత ఇంకో 16 చోరీలు చేసాడు. మొత్తం 86 చోరీలయ్యాయి. చిన్ననాటి నుంచి చేసిన చోరీలకు లెక్కే లేదు.

** 2015లో జూబ్లీహిల్స్‌, 2016లో మీర్‌పేట్‌, 2018లో సంగారెడ్డి పోలీసులు అతడిపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. గత ఫిబ్రవరిలో జైలు నుంచి వచ్చి ఆగస్టు నుంచి మళ్లీ మొదలుపెట్టాడు. 4 నెలల్లో సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 16 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఎవరి సహాయం తీసుకోడు. ఒంటరిగానే వెళతాడు. పోలీసులకు చిక్కకుండా ముప్ప తిప్పలు పెట్టేవాడు.

** చదివింది టెన్త్ క్లాసు…ఫంక్షన్ హాల్లో తండ్రితో కలిసి ఉద్యోగం. కానీ జల్సాలకు అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అందుకు డబ్బు కావాలి. దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నాడు. దానికి ఒక టైమింగ్ పెట్టుకున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపే చోరీ చేస్తాడు. ఏది పడితే అది చోరీ చేయడు… బంగారం, నగదు తప్ప ఇంకేమీ ముట్టుకోడు సూర్య భాయ్ .ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకొస్తాడు. ఎలక్ట్రీషియన్ లాగా చొక్కా పై జేబులో అందరికీ కనపడేలా టెస్టర్ పెట్టుకుంటాడు. ఇంటి తాళాలు పగలకొట్టే పరికరాలు లోదుస్తుల్లో దాచి పెడతాడు. వాహనంపై బయలుదేరి ఖరీదైన అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ గా ఉన్న ఖరీదైన ఇళ్లు టార్గెట్ చేస్తాడు.మొదట అపార్ట్మెంట్లోకి వెళ్లి ఏ ఇల్లు మంచి రిచ్ లుక్ తో ఉందొ చూస్తాడు. అనంతరం దానికి తాళం వేసి ఉంటె … మెల్లగా తన వద్ద ఉన్న కొన్ని సామాన్లతో దాన్ని తెరిచి లోపలకు వెళ్తాడు. ఉదయం వేళా కావడంతో ఎవరైనా చూస్తే తానూ ఎలక్ట్రీషియన్ అంటూ కవర్ చేస్తాడు. లోపల ఉన్నబీరువాలు, డబ్బు దాచే వారిని తీసి విలువైన ఆభరణాలు తీసుకు వెళ్తాడు. ఉదయం వేళా దొంగతనాలు చేస్తాడు కాబట్టి ఎలాంటి పెద్ద వస్తువులు తీసుకువెళ్లాడు. కేవలం డబ్బు, బంగారం మాత్రమే అతడి టార్గెట్. ఇదీ ఇతని చోరీ స్టైల్ మొత్తం 86 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ ఘరానా దొంగ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. దింతో గత కొంత కాలంగా సైబరాబాద్ పరిధిలో జరుగుతున్నా అపార్ట్మెంట్ చోరీలకు అడ్డు కట్ట పడుతుంది అని భావిస్తున్నారు… అన్నట్లు ఎలాంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చు… మీఋ జాగ్రత్త సుమీ…

 

 

 

author avatar
Special Bureau

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!