NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

డిల్లీ ఎక్స్ క్లూజీవ్ : కాంగ్రెస్ కి సోనియా ఫామిలీ టాటా ??

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయులంతా ఎరిగిన ఏకైక పార్టీ…. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దశాబ్దాల పాటు భరత ఖండాన్ని ఏకగ్రీవంగా పాలించిన ఈ పార్టీ ఇప్పుడు శిధిలావస్థలో ఉంది అంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీని తరతరాలుగా ముందుండి నడిపిస్తున్న నెహ్రూ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరిస్తూ ఉండడమే.

అతనే కాలదన్నుకుంటున్నాడు…!

రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పగ్గాలను చేపట్టడానికి విముఖంగా ఉన్నాడు. ఇన్నాళ్లు అతను బ్రేక్ తీసుకొని పార్టీ పరిస్థితిని, దేశ రాజకీయాలను పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంతా భావించారు కానీ ఇప్పటికీ తల్లి చేతులెత్తేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ని దగ్గర ఉండి నడిపించాల్సింది పోయి ఆ నిర్ణయం తీసుకోకుండా తనకు నాయకత్వం వద్దనే వద్దు అంటే…. దానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మేము కాంగ్రెస్ తోనే బ్రతుకుతాం…. చస్తాం కానీ పార్టీ పగ్గాలు మాత్రం మాకు వద్దనే వద్దు అని కుటుంబం చేప్పుకుంటున్నట్లు ఉంది

స్వయంకృత అపరాధం… లేదు ప్రత్యామ్న్యాయం!

నిజానికి జాతీయ కాంగ్రెస్ పార్టీలో వందలాది గ్రూపులు ఉండొచ్చు…. పదుల సంఖ్యలో అజెండాలు నెల కొనవచ్చు. అయితే నెహ్రూ కుటుంబమే అన్నింటికీ సెంటర్ పాయింట్. ఇప్పటి వరకు దీని వల్లనే కాంగ్రెస్ ముఖ్యులు ఏమీ మాట్లాడలేని దురవస్థ. అందుకే పదే పదే రాహుల్గాంధీని పగ్గాలు చేపట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారే తప్ప ప్రత్యామ్నాయం ఆలోచించేవారు లేరు. గతంలా పార్టీ మీద ఒకటికి పదిసార్లు ఆలోచించి అభిప్రాయాలు చెప్పగల ఒక తరం వెళ్ళిపోయింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. గెహ్లాట్ వంటి సీనియర్లకు యువ నాయకుల నుండి తిరస్కారం ఎదురవుతోంది. ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు. అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు పార్టీకి సరైన చాణక్యం చూపించగల సామర్థ్యం ఉన్న వాళ్ళు అయితే కాదు.

కుటుంబ అంతర్గత నిర్ణయం

తాజాగా ప్రియాంక గాంధీ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు గమనిస్తే ఆ కుటుంబం అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆమె పరోక్షంగా నొక్కివక్కాణించడమ్ గమనించవచ్చు. “మా కుటుంబేతర నాయకులు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. రాహుల్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. పార్టీకి ఒక కొత్త నాయకత్వం కావాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ పని చేయడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను.” ఇవి ప్రియాంక మాట్లాడిన ముఖ్యమైన మాటలు. ఇక రాహుల్ పార్టీ నాయకత్వం నుండి నిష్క్రమించడం అనేది కుటుంబంలో సీరియస్ గా జరిగిన చర్చ అని ఆమె వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.

మొత్తానికి ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు లేక జాతీయ కాంగ్రెస్ ఇక ముగిసిన అధ్యాయం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో రానుందా?

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk